కొత్తగా ఉద్యోగంలో చేరిన పోస్ట్‌మాన్
ఉత్తరం ఇవ్వడానికి ఒక ఇంటికెళ్లాడు..
పోస్ట్‌మాన్ : బాబు మీ నాన్నగారు ఉన్నారా?
అబ్బాయి : లేరు.. బజార్‌కు వెళ్లారు.
పోస్ట్‌మాన్ : సరే మీ అన్నని పిలువు.
అబ్బాయి : వాడు కూడా లేడు.. ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు.
పోస్ట్‌మాన్ : అవునా! సరే మీ అమ్మని పిలువు.
అబ్బాయి : లేదు. పక్కింటి వాళ్లతో పిక్నిక్‌కి వెళ్లింది.
పోస్ట్‌మాన్ : (కోపంగా) ఇంటికి తాళం వేసి నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్లకపోయావా? ఇంట్లో ఏం చేస్తున్నావ్?
అబ్బాయి : హా! అందుకే కదా మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికొచ్చాను!
పోస్ట్‌మాన్ షాక్.. అబ్బాయి రాక్!

No comments:
Post a Comment