Thursday, August 20, 2015

టీఎస్‌పీఎస్సీ ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ పరీక్ష విధానం ఇలా






అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించనుంది. పరీక్షను పూర్తి పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు, వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు ఆన్‌లైన్ విధానం మేలని కమిషన్ భావిస్తున్నది. పరీక్ష నిర్వహించనున్న హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు.

వీరికి కేటాయించిన హాల్‌టికెట్ నంబర్లు సంబంధిత పరీక్షా కేంద్రంలో ముందస్తుగా సిద్ధం చేసి ఉంచిన కంప్యూటర్లపై కనిపిస్తుంటాయి. అక్కడికి వెళ్లి కంప్యూటర్‌లో హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసిన అనంతరం పాస్‌వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్‌వర్డ్‌ను పరీక్ష కేంద్రానికి సంబంధిత అభ్యర్థి వెళ్లినపుడు ఇన్విజిలేటర్లు కేటాయిస్తారు. ఈ వివరాలన్నీ నమోదుచేసిన తర్వాత సరిగ్గా పరీక్షా సమయానికి ఆన్‌లైన్ పేపర్ ఆ కంప్యూటర్‌లో అప్‌లోడ్ అవుతుంది. సంబంధిత విభాగాల ప్రశ్నలన్నింటినీ మార్క్ చేస్తూ వెళ్లాలి. అన్ని ప్రశ్నలను పూర్తి చేశాక సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
2-3 గంటల వ్యవధిలోనే ప్రాథమిక కీ!
పరీక్షాప్రక్రియ పూర్తయిన 2-3 గంటల వ్యవధిలోనే ప్రాథమిక కీ ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమయింది. దీనిపై మూడు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం పరీక్ష జరిగిన 5వ రోజున మెరిట్ లిస్ట్‌ను కమిషన్ విడుదల చేయనుంది. ఆ క్రమంలో అభ్యర్థులను 1ః2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ క్రమంలో కూడా అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు. తద్వారా పరీక్షకు హాజరైన వ్యక్తి, ఇంటర్వ్యూకు హాజరైనది ఒక్కరేనని నిర్థారించుకుంటారు. దీంతోపాటు సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు. పరీక్షల నిర్వాహణలో మరింత పారదర్శకతకోసం ఇన్విజిలేటర్ల బయోమెట్రిక్ వివరాలు సైతం సేకరించనున్నారు. దీంతోపాటు వారికి స్కాన్ చేసిన ఐడీ కార్డులను అందజేయనున్నారు. తద్వారా పూర్తిగా నిష్పాక్షికంగా పరీక్ష నిర్వహిస్తారు. 30,000లోపు అభ్యర్థులు ఉంటేనే ఆన్‌లైన్ విధానం అమలుచేయనున్నారు.

No comments:

Post a Comment