Tuesday, August 18, 2015

బీహార్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధికి రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు







  బీహార్‌లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధికి రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. మరో రూ.40 వేల కోట్ల గ్రాంట్‌ ఇస్తామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
అర్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ  రూ.60 వేల కోట్లు ఇస్తారా...రూ.70 వేల కోట్లు ఇస్తారా...రూ.90 వేల కోట్లు ఇస్తారా అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చేస్తున్నారని రూ.1.25 లక్షల కోట్లు ఇస్తామని మోదీ ప్రకటించడంతో అర్రాలో ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. పేదరికం నుంచి ధనిక రాష్ట్రంగా బీహార్‌ను అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీహార్‌ భవిష్యత్తును తన ప్రభుత్వం మార్చేస్తుందని స్పష్టం చేశారు.
బీహార్‌ అభివృద్ధి చెందితే ఎక్కువగా ఆనందించేది తానే అని ఆయన అన్నారు. దళితుల అభ్యుదయం కోసి కృషి చేసిన వ్యక్తిని బీహార్‌ గవర్నర్‌గా నియమించామని మోదీ తెలిపారు. బీహార్‌ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించారు. 25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే 23 స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 

No comments:

Post a Comment