మన తెలంగాణ/ హైదరాబాద్ : నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగాల ప్రకటన నేడు (బుధవారం) వెలువడనుంది. రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొట్ట తొలి ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సుమారు 800 ఎఇఇ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌తో పాటు సిలబస్‌ను కూడా విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక శాఖలలో ఖాళీగా ఉన్న ఎఇఇ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారితో భర్తీ చేస్తారు, ఇందుకు రాత, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. అర్హులైన వారు ఈ నెల 20 తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష (450 మార్కులు) వచ్చే నెల 20వ తేదీన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు మౌఖిక పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశంలో నోటిఫికేషన్ విడుదలవుతుంది
Tuesday, August 18, 2015
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 800 ఎఇఇ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
మన తెలంగాణ/ హైదరాబాద్ : నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగాల ప్రకటన నేడు (బుధవారం) వెలువడనుంది. రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొట్ట తొలి ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సుమారు 800 ఎఇఇ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌తో పాటు సిలబస్‌ను కూడా విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక శాఖలలో ఖాళీగా ఉన్న ఎఇఇ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారితో భర్తీ చేస్తారు, ఇందుకు రాత, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. అర్హులైన వారు ఈ నెల 20 తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష (450 మార్కులు) వచ్చే నెల 20వ తేదీన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు మౌఖిక పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశంలో నోటిఫికేషన్ విడుదలవుతుంది
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment