Tuesday, August 25, 2015

ఇపుడు ఫేస్‌బుక్ లో కూడా విరాళాలు ఇవ్వవచు ...



ఎన్‌జీవోల కొరకు కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది ఫేస్‌బుక్ సంస్థ. ఫేస్‌బుక్ లో పేజీలు కలిగి ఉన్న ఎన్‌జీవోలన్ని ఈ ఆప్షన్‌ను వాడుకోవచ్చు. ఎన్జీవోల ఫేస్‌బుక్ హోమ్ పేజీల పైనా, వాటి సంబంధిత ప్రకటనలపైనా డొనేట్ నౌ ఆప్షన్‌ను చేర్చారు. ఈ ఆప్షన్ ద్వారా సూటిగా విరాళాలను సేకరించే వెసులబాటు స్వచ్ఛంద సంస్థలకు ఉంటుంది. డొనేట్ నౌ బటన్‌ను నొక్కినపుడు సంబంధిత ఎన్జీవో పేజీకి ఫేస్‌బుక్ ఆమోదం ఉన్నదీ లేనిదీ దాతలను అప్రమత్తం చేస్తుంది. 


నిధులు దుర్వినియోగం కాకుండా క్రెడిట్ కార్డు చెల్లింపు వివరాలు సైట్‌లో స్టోర్ అయ్యే విధంగా పేజీలతో డొనేట్ నౌ బటన్ ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. డొనేట్ బటన్‌ను రెండేళ్ళ క్రితమే తీసుకొచ్చినప్పటికీ రెడ్ క్రాస్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ లాంటి కొన్ని ప్రత్యేక సంస్థలకు మాత్రమే అనుమతించారు.


No comments:

Post a Comment