Saturday, August 22, 2015

ఫోన్ బ్యాలెన్స్ కష్టాలు తప్పాయి!ఇక మీ ఫోన్‌లో బ్యాలెన్స్ ఉన్నా, లేకపోయినా ఫ్రీ’గా మాట్లాడుకోవచ్చు!


ఫోన్ బ్యాలెన్స్ కష్టాలు తప్పాయి! ఇక మీ ఫోన్‌లో బ్యాలెన్స్ ఉన్నా, లేకపోయినా మీకు కావలసిన వారితో ‘ఫ్రీ’గా మాట్లాడుకోవచ్చు! దీనికి ఇంటర్నెట్, మొై బెల్ అప్లికేషన్లు(యాప్స్) వంటివేవీ అక్కర్లేదు..! ‘ఫ్రీకాల్ క్లౌడ్ టెలిఫోనీ’ సంస్థ ఈ వినూత్న సర్వీసును శనివారం ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు యువ ఇంజనీర్లు యషాష్ సి.శేఖర్, యు.విజయ్‌కుమార్, ఇ.సందేష్ దీని రూపకర్తలు. శనివారమిక్కడ వారు తమ సర్వీసు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఒక ఫోన్ నంబర్‌కు ఒక రోజులో 12 నిమిషాలు ఉచితంగా మాట్లాడే అవకాశాన్ని తమ సంస్థ ద్వారా కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీకాల్ చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నామన్నారు.
ఫ్రీకాల్ ఇలా.. : ఫ్రీకాల్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రీకాల్స్ చేయాలనుకునే వారు ముందు గా ఫ్రీకాల్ సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 080-49202060కు మిస్డ్‌కాల్ ఇవ్వాలి. తర్వాత అదే నంబర్ నుంచి మీ నంబర్‌కు కాల్‌బ్యాక్ వస్తుంది. ఆ సమయంలో మీరు ఎవరితో మాట్లాడాలనుకుం టున్నారో వారి ఫోన్ నంబర్‌ను జతచేసి డయల్ చేస్తే ఆ నంబర్‌కు ఫ్రీకాల్ ద్వారా కాల్ కనెక్ట్ అవుతుంది. ఫ్రీకాల్ మాట్లాడే సమయంలో ప్రతి రెండు నిమిషాలకోసారి 10 సెకన్ల నిడివిగల వివిధ సంస్థ ల వ్యాపార ప్రకటనలు ఆడియో రూపంలో వస్తా యి. ఈ ప్రకటనలకు ఆయా సంస్థలు ఫ్రీకాల్ సంస్థ కు డబ్బు చెల్లిస్తాయి. ఫ్రీకాల్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వడం లేదా సంస్థ వెబ్‌సైట్ www.freekall.coద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు.

1 comment: