Monday, August 17, 2015

గుడ్ న్యూస్ జాబ్స్ జాబ్స్ కొలువుల జాతర!


నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో..
ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం పోస్టులు: 41
-విభాగాలు: మైనింగ్, కంప్యూటర్, ఫైనాన్స్, కంపెనీ సెక్రటేరియల్, లీగల్, అఫీషియల్ లాంగ్వేజ్, మెడికల్
మైనింగ్ విభాగంలో..
-జనరల్ మేనేజర్ (గ్రేడ్ ఈ-8): 5 పోస్టులు 
-అర్హతలు: మెకనైజ్డ్/సెమీ మెకనైడ్జ్ ఓపెన్‌కాస్ట్ కోల్/లిగ్నైట్/ఇతర మైనింగ్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. మేనేజర్/ఏజెంట్ ఆఫ్ మైన్స్/ప్రాజెక్ట్ ఆఫీసర్/ ఓపెన్ కాస్ట్/అండర్ గ్రౌండ్ మైన్‌లో కనీసం ఐదేండ్ల అనుభవం.
-వయస్సు: జూలై 1 నాటికి 54 ఏండ్లు ఉండాలి.
-పే స్కేలు: రూ. 51,300-3%-73,000
-డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఈ-7): 5 పోస్టులు
-అర్హతలు: మెకనైజ్డ్/సెమీ మెకనైడ్జ్ ఓపెన్‌కాస్ట్ కోల్/లిగ్నైట్/ఇతర మైనింగ్ విభాగాల్లో పనిచేసిన అనుభవం, మూడేండ్లపాటు అసిస్టెంట్ మేనేజర్‌గా లేదా ఓపెన్ కాస్ట్/అండర్ గ్రౌండ్ మైన్లలో మేనేజర్‌గా పనిచేసిన అనుభవం. 
-విద్యార్హతలు (రెండు పోస్టులకు): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/నాలుగేండ్ల బీఎస్సీ, ఫస్ట్‌క్లాస్ మేనేజర్ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: జూలై 1 నాటికి 52 ఏండ్లు.
-పే స్కేలు: రూ. 43,200-3%-66,000
కంప్యూటర్ విభాగంలో..
-జనరల్ మేనేజర్ (ఈ-8): 1 పోస్టు
-వయస్సు: జూలై 1 నాటికి 54 ఏండ్లు ఉండాలి.
-పే స్కేలు: రూ. 51,300-3%-73,000
-అడిషనల్ చీఫ్ మేనేజర్ (ఈ-6): 1 పోస్టు
-వయస్సు: జూలై 1 నాటికి 47 ఏండ్లు ఉండాలి.
-పే స్కేలు: రూ. 36,600-3%- 62,000
-డిప్యూటీ చీఫ్ మేనేజర్ (ఈ-5): 2 పోస్టులు
-వయస్సు: జూలై 1 నాటికి 44 ఏండ్లు ఉండాలి.
-పే స్కేలు: రూ. 32,900-3%-58,000
-మేనేజర్ (ఈ-4): 2 పోస్టులు
-అర్హతలు: ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఏఎంఐఈలో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ చేసి ఉండాలి. దీంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అప్లికేషన్ డెవలప్‌మెంట్/నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్/హార్డ్‌వేర్‌లో అనుభవం ఉండాలి.
-వీటితోపాటు ఈఆర్‌పీ లేదా ఎస్‌ఏపీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
-వయస్సు: జూలై 1 నాటికి 36 ఏండ్లు నిండిన వారై ఉండాలి.
-పే స్కేలు: రూ. 29,100-3%- 54,500
ఫైనాన్స్ విభాగంలో 
-డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఈ-7): 4 పోస్టులు
-వయస్సు: జూలై 1 నాటికి 52 ఏండ్లు నిండిన వారై ఉండాలి.
-పే స్కేలు: రూ. 43,200-3%-66,000
-డిప్యూటీ మేనేజర్ (ఈ-5): 7 పోస్టులు (వీటిలో జనరల్ 5, ఓబీసీ 1, ఎస్సీ 1) 
-అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఐ/ఎంబీఏ (ఫైనాన్స్) చేసి ఉండాలి. ప్రాజెక్ట్ అకౌంటింగ్/ఫైనలైజేషన్ అకౌంట్స్/ఆడిట్/ట్యాక్సేషన్/ఫండ్ మేనేజ్‌మెంట్/కాస్టింగ్ అండ్ బడ్జెటింగ్‌లో అనుభవం, దీంతోపాటు కంప్యూటర్ అనుభవం.
-వయస్సు: జూలై 1 నాటికి 44 ఏండ్లు నిండిన వారై ఉండాలి.
-పే స్కేలు: రూ. 32,900-3%-58,000
కంపెనీ సెక్రటేరియట్‌లో..
-మేనేజర్ (ఈ-4): 1 పోస్టు
-అర్హతలు: కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో సభ్యుడై ఉండాలి. హాండ్లింగ్ బోర్డ్/జనరల్ మీటింగ్స్‌లో, హాండ్లింగ్ ఆఫ్‌లో షేర్‌హోల్డర్స్/బాండ్ హోల్డర్స్ గ్రీవెన్సెస్‌లో ఐదేండ్ల అనుభవం కలిగి ఉండాలి.
-ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పనిచేయాలి.
-వయస్సు: జూలై 1 నాటికి 36 ఏండ్లు నిండిన వారై ఉండాలి.
-పే స్కేలు: రూ. 29,100-3%- 54,500
లీగల్ విభాగంలో..
-మేనేజర్ (ఈ-4): 2 పోస్టులు
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదై ఉండాలి. కమర్షియల్ లా/లేబర్, కన్‌స్ట్రక్షన్ లాలో డిగ్రీ పొందినవారికి ప్రాధాన్యం ఉంటుంది. లేబర్, సర్వీస్, కమర్షియల్ కాంట్రాక్ట్స్, ట్యాక్సేషన్, రెవెన్యూ విషయాల్లో, సివిల్ లాలో ఐదేండ్ల అనుభవం ఉండాలి. 
-తమిళనాడులోని ట్యుటీకోరిన్, రాజస్థాన్‌లోని బర్సింగ్సర్‌లో పనిచేయాలి
-వయస్సు: జూలై 1 నాటికి 36 ఏండ్లు నిండిన వారై ఉండాలి.
-పే స్కేలు: రూ. 29,100-3%- 54,500
అఫీషియల్ లాంగ్వేజ్ విభాగంలో..
-హిందీ ట్రాన్స్‌లేటర్-ట్రైనీ (డబ్ల్యూ-3): 2 పోస్టులు (జనరల్ 1, ఓబీసీ 1)
-అర్హతలు: హిందీలో పీజీ, డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్టుగా లేదా ఇంగ్లీష్‌లో పీజీ, డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయడంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసి ఉండాలి.
-వయస్సు: జూలై 1 నాటికి 30 నిండినవారై ఉండాలి.
-పే స్కేలు: రూ. 10,300-3%-28,390
మెడికల్ విభాగంలో..
డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ (ఈ-3, ఈ-4 గ్రేడ్), డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ఈ-5 గ్రేడ్) మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. అవి..
-ఎమర్జెన్సీ మెడిసిన్: 2 పోస్టులు
-విద్యార్హత: ఎంబీబీఎస్, ఎండీ (ఎమర్జెన్సీ మెడిసిన్)
-జనరల్ మెడిసిన్: 2 పోస్టులు
-విద్యార్హత: ఎంబీబీఎస్, ఎండీ/జనరల్ మెడిసిన్‌లో డీఎన్‌బీ
-జనరల్ సర్జరీ: 2 పోస్టులు 8 విద్యార్హత: ఎంఎస్/జనరల్ సర్జరీలో డీఎన్‌బీ
-ఆర్థోపెడిక్స్: 1 పోస్టు 8 విద్యార్హత: ఎంబీబీఎస్, డిప్లొమా ఇన్ ఆర్థోపెడిక్స్
-ఈఎన్‌టీ: 1 పోస్టు
-విద్యార్హత: ఎంబీబీఎస్, Diploma in Oto Rhino Laryngology
-రేడియాలజీ: 1 పోస్టు
-విద్యార్హత: ఎంబీబీఎస్, డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో డయగ్నొసిస్ (డీఎంఆర్‌డీ)
-అర్హత: ప్రభుత్వ/ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
-ఐసీయూ/ఎన్‌ఐసీయూ/ఆర్‌సీయూ/పీఐసీయూ/ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసుల్లో పనిచేసినవారికి ప్రాధాన్యత ఉంటుంది.
-వయస్సు: ఈ-3 పోస్టుకు జూలై 1 నాటికి 32 ఏండ్లు, ఈ-4 పోస్టుకు 36 ఏండ్లు, ఈ-5 పోస్టుకు 44 ఏండ్లు నిండినవారై ఉండాలి.
-వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎస్స్ సర్వీస్‌మెన్‌కు సడలింపు ఉంటుంది. 
-ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, అప్లికేషన్ ఫీజు: రూ. 300
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేదీ: ఆగస్టు 5
-చివరితేదీ: ఆగస్టు 25
-వెబ్‌సైట్: www.nlcindia.com.

No comments:

Post a Comment