Sunday, August 16, 2015

ఒక వ్యక్తి స్థాయి అతని మరణ సమయంలో చిట్టచివర ఘడియలలో దేనిని స్మరిస్తాడు?



ఒక వ్యక్తి స్థాయి (ఆధ్యాత్మికంగా) ఏమిటి అనేది అతని మరణ సమయంలో చిట్టచివర ఘడియలలో దేనిని స్మరిస్తాడు? అనేదాన్ని బట్టి తెలుస్తుంది..
బ్రతికినన్నాళ్లు మనసు దేనిమీద ప్రీతిని పెంచుకుంటుందో ఆఖరులో దానినే స్మరిస్తుంది..
దాని ఆదారంగానే పునర్జన్మ కూడా వస్తుంది....
ఇది ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటుంది....
1)ఆర్తచింత.2)రౌద్రచింత.3)ధన్యచింత.4)శుక్లచింత....
1)ఆర్తచింత;.భౌతికమైన వాటిమీద అంటే .తన శరీరం మీదగాని, తన బందువులమీదగాని,స్థిర చరాస్తుల మీదగాని వ్యామోహాన్ని పెంచుకుని వాటినే స్మరించడం..
2)రౌద్రచింత;..బ్రతికినన్నాళ్లు ఈర్ష్య అసూయలతో,శత్రుత్వాన్ని పెంచుకుని ఆఖరులో దానినే స్మరించడం...
ఈ రెండింటివల్ల తర్వాత జన్మలో తిర్యక్ గా అంటే వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండే జీవులుగా జన్మిస్తారు.
3)ధన్యచింత;..వీరు జీవితమంతా భగవత్ సంబందమైన విషయాల మీద,దార్మికగ్రందాలమీద అనురాగం కలిగిఉండి చివరలో వాటినే స్మరిస్తారు..
ఉదాః.గాంధిజీ భగవద్ గీతను ఎప్పుడు తనవెంట ఉంచుకోవడం,చనిపోయటప్పుడు "హే రామ్!" అని స్మరించడం..
వీరికి మోక్షాన్ని పొందడానికి వీలుగా తర్వాత జన్మ.. విశేషమైన జ్ఞ్యానం కల మానవజన్మ లభిస్తుంది.
4)శుక్లచింత;..ఇది అత్యున్నతమైన స్థితి...ఈ స్థితిలో మరణం అంటే ఎలాంటి భయము ,బెంగ ఉండదు..
శరీరాన్ని సాక్షిభూతంగా చూస్తూ "అది పడిపోతుంది,ఇక నేను ఇందులో ఉండకూడదని తెలుసుకుని" శిరస్సుమీద ఉండే బ్రహ్మరంద్రాన్ని తెరిచి అందులోనుంచి బైటికి వెళ్ళిపోతారు..
రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వారు ఈస్థాయివారు...


No comments:

Post a Comment