మహా కవి శ్రీ శ్రీ ప్రస్తానం
కావాలి నాకోక మరో ప్రపంచంమనిషినిన మనిషిగా చూసే ప్రపంచంకుట్రలు కుళ్ళూ లేని ప్రపంచంస్వార్ధం, వంచన లేని ప్రపంచంకులాలు, కక్షలు లేని ప్రపంచం
మతాలు, మారణ హోమాలు లేని ప్రపంచం
ప్రాంతియ భేధాలు తెలియని ప్రపంచం
కష్టించే వాడే రాజుగా ఉండే ప్రపంచం
ఆకలి కేకలు వినపడని ప్రపంచం
తల్లి తండ్రులును దైవంగా భావించే ప్రపంచం
పడతిని విలాస వస్తువుగా చూడని ప్రపంచం
అవినితి అగుపడని ప్రపంచం
శత్రువుని కూడా మిత్రునిలా భావించే ప్రపంచం
కావాలి నాకు మరో ప్రపంచం
అదే.......... సమ సమాజం
అన్యాయమే చట్టమైతే
దాన్ని ఎదిరించటమే ని బాధ్యత కావాలి.
- చే గువేరా
ప్రశ్నించటమే నువ్వు చేస్తున్న తప్పైయితే అ తప్పే నిరంతరం చేస్తూ వుండాలి.
పోరాడటమే నువ్వు చేస్తున్న నేరం అయితే అ నేరాన్ని నివ్వు మళ్ళి మళ్ళి చేస్తూ వుండాలి.
నివ్వు ప్రయాణించే దారిలో అవాంతరాలు ఎదురవ్వొచ్చు లక్ష చేదన ని గమ్యం కావాలి.
ఒక అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో ఇంకో అన్యయంతో మనలను అనిచేందుకు ప్రయత్నం చేస్తుంటే, మనం మనం ఏకమై ప్రభంజనమై అన్యాన్ని న్యాయం అనే మరో ఆయుధంతో ప్రతిఘటించాలి. ప్రభుత్వం మెడలు వంచాలి.
మరో ప్రపంచం వైపు అడుగులు వెయ్యాలి.
వివేకానందుడు ...
అమెరికా ప్రజలనే 'ప్రియ సహోదరులారా!' లారా అని సంభోధించిన లౌకిక వాది..
''కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు''
''ప్రయత్నం చేసి ఓడిపో... కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.''
''ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది''
''సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.''
''ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.''
లాంటి ఎన్నో ఉత్తేజ పూరిత మాటలు చెప్పి జాతిని మేల్కొలిపే ప్రయత్నం చేశాడు..
'దేవుడిని పూజించేకన్నా... పేదవాడికి సేవ చేయండి అని చెప్పిన గొప్ప మానవతావాది'.. వివేకానంద..
'మతాన్ని' అధికారం కోసం.. సొంత లాభాల కోసం వ్యక్తి గత ఎజెండాల కోసం...కొన్ని స్వార్థ శక్తులు వివేకానందుని పేరును.. ఆతని ఆదర్శాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి...
''ఇందనం కనుగొనక ముందే విమానాలను కూడా 'సృష్టించి..' చరిత్రను వక్రీకరించి నేటి యువతలో ఓ అభూత కల్పనలను నింపే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతోంది...
భవిష్యత్ ను నిర్మించే యువ భారత్ కు ఈ సంకేతాలు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు..
నిజమేంటో... కొంతమందిలోకైనా తీసుకెళ్లాల్సిన సమయం..
గళం విప్పాల్సిన సమయం.. ఇది...
మీరేమంటారు...???
No comments:
Post a Comment