Tuesday, August 18, 2015

తెలంగాణ కొత్తగా గ్రూప్ -3ని ప్రవేశపెట్టారని సిఫారసు చేసింది


ఉద్యోగాల భర్తీకి ఒక్కొక్కటిగా లైన్ క్లియర్ అవు తోంది. పరీక్షా విధానం, అభ్యర్థుల వయోపరిమి తి సడలింపుపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ తుది నిర్ణయానికి వచ్చింది. సర్వీస్ కమిషన్ నిర్వ హించే పరీక్షల స్కీమ్ ఎగ్జామినేషన్‌పై ప్రొఫెసర్ హరగోపాల్ నియమించిన కమిటీ నివేదికలో స్వల్ప మార్పులు చేస్తూ కేబినెట్ సబ్ కమిటీ యథావిధిగా ఆమోద ముద్ర వేసింది. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో నియమించి న కేబినెట్ సబ్ కమిటీ బుధవారం సెక్రటేరియట్ లో కడియం ఛాంబర్‌లో సమావేశమయ్యింది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మా రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ నివేదికను ఈ వారంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందచేస్తా రు. కెసిఆర్ ఆమోదం అనంతరం కేబినెట్ ముందుకు వస్తుంది. అక్కడ ఆమోదంతో జీవో విడుదల కానుంది.
ఈ జీవో ఆధారంగా సర్వీసు కమిషన్ నియామకాలు చేపట్టనుంది. సబ్ కమిటీ ప్రధానంగా గ్రూప్-2లో భారీ మార్పులు చేసింది. పరీక్షల్లో గందరగోళం లేకుండా గ్రూప్-1ఏ, గ్రూప్-1బి, గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనే ఆయోమయానికి తెరదించుతూ కొత్తగా గ్రూప్ -3ని ప్రవేశపెట్టారని సిఫారసు చేసింది. గ్రూప్ -2లోని నాన్ ఎగ్జిక్యూటి వ్ పోస్టులను గ్రూప్ -3 లోకి మార్చారు. గ్రూప్ -1ఎ, 1బి అనేవి ఇక ఉండవు. గ్రూప్-4 మినహా గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్ -3 పరీక్షలన్నింటికి ఇంటర్యూలు ఉంటాయి. రాత పరీక్షలన్నింటిలో నూ తెలంగాణ చరిత్రకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రూప్ -1లో తెలంగాణపైనే 450 మార్కులు, గ్రూప్ -2లో 150 మార్కులు ఉండే విధంగా మార్పులు చేశారు. గ్రూప్-3లో తెలంగా ణ చరిత్రపై అత్యధిక సంఖ్యలో ఉండనున్నాయి. ఇంటర్యూల విధానంపై గతంలో అనేక ఆరోపణ లు వచ్చాయి. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా కాకుండా ఇతరత్రా వ్యవహారాలకు అవకాశం ఇస్తున్నారని అపోహాలు ఉన్నా యి. కొందరు కమిషన్ సభ్యులు ఆధారాలతో సహా దోరకడ ంతో ఇంటర్యూల విధానానికి స్వస్తి పలకాలనే డిమాండ్ వినిపించింది. కానీ ఇంటర్వూలకు ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్న నిర్ణయంపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్త మయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
ఐదు సంవత్సారాల మినహాయింపు:
పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటి నిర్ణయించింది. గత నాలు గైదు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ని యామకాలు చేపట్టక పోవడం, అభ్యర్థులు ఉద్యమంలో పాల్గొనడంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించకడంతో నష్టపో యారు. వారిందరికి అవకాశం ఇచ్చే విధంగా వయో పరిమితిలో సడలింపు ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ హా మీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని కమిటీ నిర్ణ యం తీసుకుంది. అభ్యర్థులకు అవసరమైతే పది సంవత్స రాల మినహాయింపు ఇస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ హామీపైనా చర్చించారు. అయితే పది సంవత్సరాల మినహాయింపు ఇవ్వడం వల్ల అభ్యర్థులకు పెద్దగా ఉపయోగం ఉండదని లెక్కలు వేశారు. పది సంవత్సరాలు మినహాయిస్తే కొన్ని వర్గాల వారికి 49 సంవత్సరాల వయస్సున్న వారు పరీక్ష రాసే అవకాశం ఉంటుందని…. ఒక వేళ వారు ఎంపికైన ఉద్యోగంలో 9 సంవత్సరాల సర్వీసు మాత్రమే ఉండే అవకాశం ఉంది. దీంతో ఐదు సంవత్సరాల వైపు మొగ్గు చూపింది కమిటి.
గ్రూప్ -1లో ఇక ఆరు పేపర్లు
గ్రూప్ -1 లో పెద్దగా మార్పులు లేకున్నా.. మార్కులను, పేపర్లను పెంచారు. ప్రస్తుతమున్న ఐదు పేపర్ల స్థానంలో ఆరు పేపర్లు ప్రవేశ పెట్టారు. ఇకపై 1000 మార్కులకు గ్రూప్ -1 పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు 900 మార్కులు, 100 మార్కులు ఇంటర్యూలో ఉంటాయి. ప్రస్తుతం 825 మార్కులతో అభ్యర్థుల ఎంపిక ఉంది. వీటిలో 750 మార్కులు రాత పరీక్షకు, 75 మార్కులు ఇంటర్యూకు కేటాయించారు. కొత్తగా ప్రవేశ పెట్టనున్న ఆరు పేపర్ ను పూర్తిగా తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర సిలబస్ తో ప్రశ్నలు ఉంటాయి. పేపర్ -2 , పేపర్ -4, పేపర్ – 6 లో తెలంగాణ చరిత్ర, ఆర్ధిక, బౌగోళిక పరిస్థితులు, ఉద్యమ చరిత్రకు కలిపి 450 మార్కులు ఉన్నాయి. తెలంగాణలో ఎంపిక కాబోతున్న ఉద్యోగులు కాబట్టి తెలంగాణపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలనే ఆలోచనతో హరగోపాల్ కమిటీ సూచించిన విధంగా మార్పులు చేశారు. మిగిలిన పేపర్లు యధావిధిగా ఉంటాయి. వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదు.
గ్రూప్-2
గ్రూప్ -2 పరీక్ష కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పరీక్షలకు కోచింగ్ తీసుకు ంటూ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రూప్ -2లో డిస్కిప్ట్రివ్ విధానం ఉండాలనే ప్రతిపాదన వస్తే అభ్య ర్థుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అభ్యర్థుల ఒత్తిడికి తగ్గట్లుగానే డిస్కిప్ట్రివ్ విధానం జోలికి సబ్ కమిటి పోలేదు. ఈ పరీక్షా విధానంలో డిస్క్రిప్టివ్ విధానం ఉం డాలని నిపుణుల కమిటీపై ఒత్తిళ్లు వచ్చాయి. పరీక్షలో ఏ, బీ, సీ, డీలు రాయడం ద్వారా రాష్ట్ర, జోనల్ స్థాయి అధికా రులు కావడం సరికాదని విమర్శలు, సూచనలు వచ్చాయి. అయితే క్యాబినెట్ సబ్ కమిటి మాత్రం డిస్క్రిప్టివ్ విధానంపై మొగ్గు చూపకుండా హరగోపాల్ కమిటీ సూచించిన విధం గా ఇంటర్యూను ప్రవేశపెట్టారు. ఇకపై గ్రూప్ -2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే ఉంటాయి.
పరీక్షా విధానం : మల్ట్లిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ , ఇంట ర్యూ ఉంటాయి. ప్రస్తుతం మూడు పేపర్లు… 450 మా ర్కులతో ఉన్న ఈ పరీక్షను 675 మార్కులు, నాలుగు పేప ర్లకు పెంచారు. వీటిలో 600 మార్కులు రాత పరీక్షకు, 75 మార్కులకు ఇంటర్యూ ఉంటుంది. రాత పరీక్ష గతంలో మాదిరిగానే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (ఎంసీక్యూ) విధా నంలో ఉంటుంది. అయితే ఇప్పుడున్న మూడు పేపర్ల స్థా నంలో నాలుగు పేపర్లు ప్రవేశ పెట్టారు. ఒక్కో పేపర్ లో 150 మార్కుల చోప్పున ఉంటాయి. పెంచిన 150 మార్కు లు ప్రశ్నాపత్రం పూర్తిగా తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర మీదనే ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన మూడు పేపర్లలో మొ దటి పేపర్ జనరల్ స్టడీస్, రెండో పేపర్ లో చరిత్ర, పాలిటి అండ్ సోసైటి, మూడో పేపర్ లో ఎకానమి అండ్ డెవల ప్‌మెంట్ అంశాలతో ఉంటుంది. ఒక్కో పేపర్ కు రెండు న్నర గంటల సమయం కేటాయిస్తారు. డిగ్రీ స్థాయి సిలబ స్‌తో పరీక్ష ఉంటుంది.
గ్రూప్ -2 పరిధిలోకి వచ్చే పోస్టులు
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -3 , అసిస్టేంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్(ఏసీటీవో), డిప్యూటి తహసిల్దార్ (డిటి), సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2 , జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ , అసిస్టేంట్ రిజిస్ట్రార్ , అసిస్టేంట్ లెబర్ ఆఫీసర్ , ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (గ్రామీణాభివృద్ధి శాఖ), ఎక్సైజ్ సబ్ ఇన్సెస్పెక్టర్ , ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ -2 .
గ్రూప్ -3
ఇప్పటి వరకు ఉన్న గ్రూప్ -2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3గా మార్చారు. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్యూ విధానంలో ఎంపిక ఉంటుంది. 500 మార్కులకు రాత పరీక్ష, ఇంటర్యూలు ఉంటాయి. మూడు పేపర్లతో 450 మార్కులతో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్(ఎంసీక్యూ) విధానంలో పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్ కు రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు. ఇంటర్వూలో 50 మార్కులు ఉంటాయి.
గ్రూప్ -3 పరిధిలోని
సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, ఏఎస్‌వో, అసిస్టేంట్ ఆడిటర్, టెపిస్ట్ కమ్ అసిస్టేంట్, అసిస్టేంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టేంట్స్ 17 రకాల పోస్టులు ఉన్నాయి.

No comments:

Post a Comment