Saturday, August 22, 2015

ఇక గూగుల్ సంస్థ సెర్చ్‌లో ట్రెండింగ్ ట్వీట్లను కూడా అందించనుంది

ఇక గూగుల్ సంస్థ సెర్చ్‌లో ట్రెండింగ్ ట్వీట్లను కూడా అందించనుంది. సోషల్ మీడియాలో మునిగి తేలేవారి ఎవ్వరి నోట అయినా ట్రెండింగ్ మాట తరుచుగా వినబడుతుంది. సంచలనాత్మక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ట్రెండింగ్స్ గా నిలుస్తాయి. గూగుల్‌లో ఏదైనా సమాచారాన్ని శోధించేటపుడు దానికి సంబంధించిన ట్రెండింగ్ ట్వీట్లను సాధారణ లింక్స్‌తో పాటు అందించనుంది గూగుల్ సెర్చ్ ఇంజన్. ట్విట్టర్ ఖాతాలు ఏవైనా ఇకపై గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌తో పాటు ట్రెండింగ్స్‌ను చూడవచ్చు. ఉదాహరణకు ఇస్రో ట్విట్టర్ కోసం యూజర్ సెర్చ్ చేసినపుడు ఇస్రో ట్విట్టర్ ఖాతాతో పాటు, ఇస్రో ఇటీవల చేసిన ట్రెండింగ్ ట్వీట్లను కూడా చూపుతుంది.

No comments:

Post a Comment