Tuesday, August 4, 2015

భారత్ తన రత్నాన్ని కోల్పోయింది - నరేంద్ర మోడీ (Speech about APJ Kalam )



భారత్ తన రత్నాన్ని కోల్పోయింది, కానీ ఆ ఆభరణం ప్రసరించిన వెలుగులు ఎపిజె అబ్దుల్ కలాం స్వప్నించిన గమ్యానికి నడిపిస్తాయి: భారత్‌ను విజ్ఝానంలో సూపర్ పవర్‌గా, అగ్రరాజ్యాల సరసన మొదటి వరసలో నిలుపుతాయి. దేశ ప్రజా సమూహం యావత్తూ నిజాయితీగా ప్రేమించి, ఆరాధించే మన శాస్త్రవేత్త - రాష్ట్రపతి - ఎప్పుడు కూడా విజయాన్ని వస్తుగత లబ్ధితో లెక్కించలేదు. వైజ్ఝానికంగా, ఆధ్యాత్మికంగా ఆయన దృష్టిలో పేదరికానికి ఎదురు శక్తి జ్ఝానసంపద మాత్రమే. మనర రక్షణ కార్యక్రమాల హీరోగా ఆయన అవధులను మార్చేశారు, ఆధ్యాత్మిక గురువుగా సుంకిత పక్షపాత ఉద్రిక్తత లన నుంచి సామరస్యపూర్వకమైన పారమార్థిక ఆవరణలకు పయనించే స్వచ్ఛను బోధించారు. ప్రతి మహాన్వితమైన జీవితం కూడా ప్రిజమ్ లాంటిది. మనకు దారి చూపే ఆ కిరణాల్లో మనం తడిసి ముద్దయిపోతాం. ఆయన వాస్తవికతా పునాదిపై ఆయన ఆచరణసాధ్యమైన ఆదర్శవాదాన్ని ప్రదర్శించారు.
ప్రతి పేద పిల్లవాడు వాస్తవికతావాది. పేదరిక భ్రమలను ప్రోత్సహించదు. పేదరికం అత్యంత భయానకమైంది, అతను లేదా ఆమె స్వప్పించడం ప్రారంభించకముందే అది వారిని ఓడించవచ్చు. కానీ కలామ్‌జీ పరిస్థితులకు తలొగ్గి ఓడిపోదలుచుకోలేదు. బాలుడిగా ఆయన పేపర్ బాయ్‌గా పనిచేస్తూ సంపాదించి చదువును కొనసాగించారు. ఇవాళ, అవే వార్తాపత్రికల పేజీ తర్వాత పేజీ ఆయనకు నివాళులు అర్పించడంతో నిండిపోయాయి. తన జీవితం ఎవరికైనా రోల్ మోడల్ అవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆయన చెప్పారు. కానీ అంధకారం ఆవరించిన, పేదరికంలో మగ్గే వ్యవస్థా చట్రంలోని ఓ పేద పిల్లవాడు ఆయన జీవితం రూపుకట్టిన తీరులో కొంత ఓదార్పు పొందగలడు. భ్రమాన్వితమైన వెనకబాటు నుంచి, నిస్సహాయత నుంచి పిల్లలు తమను తాము బయటకు రావడానికి బహుశా, అది సహాయం చేస్తుంది. ఆయన నాకు మాత్రమే కాకుండా ప్రతి పిల్లవాడికీ మార్గదర్శకుడు. ఆయన వ్యక్తిత్వం, నిబద్ధత, స్పూర్తిప్రదాయకమైన దృష్టికోణం జీవితంలో కాంతులు వెదజల్లింది. ఆయన నిరహంకారి, అదే ఆయనను శాంతస్వరూపుడిగా చేసింది. సంతోషకరమైన ప్రేక్షకులు, ప్రపంచాన్ని నడిపించే మంత్రులు, యువ విద్యార్థులు అంతా ఆయనకు సమానమే, అందరి వద్ద ఒకే విధంగా ఉండేవారు. ఆయనలో బాల్యంలోని నిజాయితీ, యువతలోని శక్తి, వయోజనుడిలోని పరిపక్వత కలగలిసి ఉన్నాయి. అదే ప్రతి ఒక్కరికి ఆయనను కొట్టొచ్చేట్లుగా చూపిస్తుంది. ప్రపంచం నుంచి ఆయన తీసుకుంది కొంచెం, ఇచ్చింది చాలా. తాను ఇవ్వగలిగినంతగా ప్రపంచానికి ఇచ్చాడు. లోతైన విశ్వాసం గల ఆయన మన నాగరికతకు సంబంధించి మేూడు విలువలను పాటించారు. అవి - ఆత్మనిగ్రహం, దానం, దయ. కానీ ఆ వ్యక్తిత్వానికి లక్ష్యాన్ని సాధించాలనే అగ్ని సాధనంగా పనిచేసింది. దేశానికి సంబంధించి ఆయన దృక్పథం స్వేచ్ఛ, అభివృద్ధి, బలం అనేవాటితో నిబిడీకృతమైంది. మన చరిత్రను గమనిస్తే, స్వేచ్ఛ అనేది రాజకీయ సందర్భమే కావచ్చు కానీ అందులో బౌద్ధిక స్వేచ్ఛ, బౌద్ధిక ఆవరణ విస్తరణ ఇమిడి ఉన్నాయి. సమీకృత ఆర్థిక పెరుగుదల ద్వారా మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్నవ్యవస్థల బయటపడాలని, పేదరిక నిర్మూలన జరగాలని ఆయన ఆశించారు. తెలివిగా, రాజకీయ నాయకులు 30 శాతం సమయాన్ని రాజకీయాలకు, 70 శాతం సమయాన్ని అభివృద్ధికి కేటాయించాలని ఆయన సూచించారు. అదే విషయాన్ని ఓ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు, వారి ప్రాంతాలకు చెందిన సామాజికఆర్థిక అంశాలను చర్చిస్తూ సూచిస్తూ ఉండేవారు. మూడో స్తంభం శక్తి హింస ద్వారా సమకూరదు. అవగాహన ద్వారా మాత్రమే సమకూరుతుంది. అభద్రతతో కూడిన దేశం సంపదకు మార్గాన్ని కనిపెట్టడంలో విజయం సాధించదు. శక్తి గౌరవాన్ని ప్రసాదిస్తుంది. ఆయన అణు, అంతరిక్ష రంగాల్లో చేసిన సేవలు, సాధించిన విజయాలు మన ప్రాంతంలో, ప్రపంచంలో మనం భద్రంగా ఉండగలమనే బలాన్ని ఇచ్చాయి. నూతన శాస్త్రసాంకేతిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా, ప్రకృతి శక్తితో సమతుల్యత సాధించే ప్రయోజనం పొందడం మార్గాలను ఎంచుకోవడం ద్వారా ఆయనను గౌరవిద్దాం.. చాలా తరుచుగా, దురశా మనలను పర్యావరణ భక్షకులుగా మార్చేస్తుంది. కలామ్‌జీ జలం, వాయువు, కాంతిప్రసరణ ద్వారా జీవం పోసుకునే వృక్షంలో కవిత్వాన్ని, శక్తిని దర్శించారు. ఆయన నయనాలతో మనం లోకాన్ని చూడడం నేర్చుకోవాలి. అదీ అదే శక్తివంతమైన ఉత్సాహంతో. మానవులు తమ జీవితాలను ఆకాంక్ష, సహనం, సామర్థ్యం, ఎదురులేని ధైర్యం ద్వారా తీర్చిదిద్దుకోగలరు. కానీ మనం మనం ఎలా పుట్టాలో, లేదా ఎలా, ఎప్పుడు మరణించాలో నిర్ణయించుకునే హక్కు లేదు. అయితే, కలామ్‌జీకి ఓ ప్రత్యామ్నాయాన్ని ఇస్తే, ఆ విషయాలను బహుశా తన కాళ్లపై నిలబడి, తరగతి గదుల్లోని తన ప్రేమాస్పదులైన విద్యార్థుల ముందు చెప్పి వీడ్కోలు తీసుకుని ఉండేవారు. బ్రహ్మచారిగా ఆయనకు పిల్లలు లేరు. కానీ అది తప్పు. భారతదేశంలోని అందరు పిల్లలకూ ఆయన పిత. బోధిస్తూ, బుజ్జగిస్తూ, విజ్ఝప్తి చేస్తూ, అంధకారాన్ని పారదోలుతూ ప్రతి చోటా ఆయన తన దృక్పథంతో, ఉద్వేగభరితమైన భాగస్వామ్యంచో కాంతులు వెదజల్లారు. ఆయన భవిష్యత్తును దర్శించారు, మార్గాన్ని చూపించారు. ఆయన భౌతిక కాయం ఉన్న గదిలోకి నేను ప్రవేశించినప్పుడు పిల్లల కోసం జ్ఝానదాహం తీర్చుకోవాలనుకునేవారి కోసం రాసిన స్ఫూర్తిదాయకమైన వాక్యాలతో ఉన్న చిత్రాన్ని ప్రవేశద్వారంలో చూశాను. ఆయన చేసిన మంచి అస్తికల సమాధితో అంతం కాదు. ఎందుకంటే, ఆయన పిల్లలు ఆయన జ్ఝాపకాలను తమ జీవితాలు ద్వారా, పనుల ద్వారా రక్షించుకుని, వారి పిల్లలకు బహుమతిగా అందిస్తారు. - నరేంద్ర మోడీ

No comments:

Post a Comment