రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి మూడు ప్రభుత్వశాఖల్లోని 563 మెకానికల్, సివిల్ క్యాటగిరీ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువరించింది. శనివారం ఇచ్చిన ఈ ప్రకటన కమిషన్ వెబ్‌సైట్ (http://tspsc.gov.in)లో నోటిఫికేషన్ నంబరు 09/2015 పేరుతో అందుబాటులో ఉంది. మరోవైపు గ్రూప్స్ 1,2,3,4 పరీక్షల సిలబస్‌ను సోమవారం ప్రకటించనున్నట్టు తెలిసింది. కాగా రెండో నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు శనివారంనుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
-మెకానికల్, సివిల్ క్యాటగిరీలో ఖాళీలు
-మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ
-గ్రూప్స్ సిలబస్ ప్రకటన రేపే!
దరఖాస్తులకు చివరి గడువు సెప్టెంబర్ 28గా పేర్కొన్నారు. పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 25న నిర్వహించే అవకాశం ఉంది. వారంరోజుల ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించే ఈ పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం-సీబీఆర్‌టీ) లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే తమ వివరాలను నమోదు చేసుకున్న వారు తమ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తు పూర్తిచేయాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్న విద్యార్హతలను అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద వంద రూపాయలు, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, ఎక్స్ సర్వీస్‌మెన్, నిరుద్యోగ యువత క్యాటగిరీల వారికి మినహాయింపు ఉంటుంది. నిరుద్యోగుల కోటాలో ఫీజు మినహాయింపు కోరేవారు తగు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ర్టాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ఫీజు మినహాయింపు సహా ఏ రకమైన రిజర్వేషన్లు కూడా వర్తించవు. ఈ పరీక్ష హైదరాబాద్‌లో (హెచ్‌ఎండీఏ పరిధి) మాత్రమే నిర్వహించనున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియలో తదనుగుణంగా విడుదలయ్యే కోర్టుల ఉత్తర్వులు, జీవోలను కమిషన్ పరిగణనలోకి తీసుకొని ప్రక్రియలో తగు మార్పులు చేస్తుందని ఆదేశాల్లో తెలిపారు. ఈ పోస్టులకు అభ్యర్థుల తుది ఎంపిక రాత/ ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. బీసీ కోటాలో దరఖాస్తు చేసేవారు క్రిమీలేయర్ పరిధి పత్రాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అందజేయాల్సి ఉంటుంది. సందర్భానుసారం వచ్చే ఆదేశాల ఆధారంగా ఖాళీల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
1. అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్)
- గ్రామీణ త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఖాళీలు: 125
ఓపెన్ కోటా- 36, ఓపెన్ కోటా(స్త్రీ)- 21, బీసీ ఏ-06, బీసీ ఏ (మహిళ)-02, బీసీ బీ-08, బీసీ బీ (మహిళ)-05, బీసీ సీ-01, బీసీ సీ (మహిళ)-0, బీసీ డీ-08, బీసీ డీ (మహిళ)-03, బీసీ ఈ-05, బీసీ ఈ (మహిళ)-01, ఎస్సీ-13, ఎస్సీ (మహిళ)-06, ఎస్టీ-05, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-02, పీహెచ్ (మహిళ)-0, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 84, మహిళా కోటాలో 41 అన్నీ కలిపి 125 ఖాళీలు ఉన్నాయి.
2. అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్)- రోడ్లు, భవనాల శాఖ: 42
ఓపెన్ కోటా- 13, ఓపెన్ కోటా(స్త్రీ)- 06, బీసీ ఏ-02, బీసీ ఏ (మహిళ)-01, బీసీ బీ-02, బీసీ బీ (మహిళ)-0, బీసీ సీ-0, బీసీ సీ (మహిళ)-0, బీసీ డీ-03, బీసీ డీ (మహిళ)-02, బీసీ ఈ-03, బీసీ ఈ (మహిళ)-00, ఎస్సీ-04, ఎస్సీ (మహిళ)-02, ఎస్టీ-00, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-02, పీహెచ్ (మహిళ)-0, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 29, మహిళా కోటాలో 13 అన్నీ కలిపి 42 ఖాళీలు ఉన్నాయి.
3. అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ లేదా మెకానికల్)
-పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ: 258
ఓపెన్ కోటా- 80, ఓపెన్ కోటా(స్త్రీ)- 42, బీసీ ఏ-12, బీసీ ఏ (మహిళ)-06, బీసీ బీ-14, బీసీ బీ (మహిళ)-12, బీసీ సీ-02, బీసీ సీ (మహిళ)-01, బీసీ డీ-12, బీసీ డీ (మహిళ)-05, బీసీ ఈ-08, బీసీ ఈ (మహిళ)-03, ఎస్సీ-25, ఎస్సీ (మహిళ)-13, ఎస్టీ-09, ఎస్టీ (మహిళ)-06, పీహెచ్-05, పీహెచ్ (మహిళ)-03, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 167, మహిళా కోటాలో 91 అన్నీ కలిపి 258 ఖాళీలు ఉన్నాయి.
4. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ )
- పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ: 84
ఓపెన్ కోటా- 23, ఓపెన్ కోటా(స్త్రీ)- 12, బీసీ ఏ-03, బీసీ ఏ (మహిళ)-01, బీసీ బీ-07, బీసీ బీ (మహిళ)-05, బీసీ సీ-00, బీసీ సీ (మహిళ)-00, బీసీ డీ-05, బీసీ డీ (మహిళ)-01, బీసీ ఈ-04, బీసీ ఈ (మహిళ)-00, ఎస్సీ-10, ఎస్సీ (మహిళ)-04, ఎస్టీ-04, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-03, పీహెచ్ (మహిళ)-00, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 59, మహిళా కోటాలో 25 అన్నీ కలిపి 84 ఖాళీలు ఉన్నాయి.
5. టెక్నికల్ ఆఫీసర్స్ (సివిల్ లేదా మెకానికల్)
-పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ: 54
ఓపెన్ కోటా-16, ఓపెన్ కోటా(స్త్రీ)- 08, బీసీ ఏ-02, బీసీ ఏ (మహిళ)-02, బీసీ బీ-02, బీసీ బీ (మహిళ)-02, బీసీ సీ-02, బీసీ సీ (మహిళ)-00, బీసీ డీ-00, బీసీ డీ (మహిళ)-02, బీసీ ఈ-00, బీసీ ఈ (మహిళ)-02, ఎస్సీ-06, ఎస్సీ (మహిళ)-04, ఎస్టీ-02, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-00, పీహెచ్ (మహిళ)-02, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 30, మహిళా కోటాలో 24 అన్నీ కలిపి 54 ఖాళీలు ఉన్నాయి.
రేపే గ్రూప్స్ సిలబస్ ప్రకటన?
టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచింది. ప్రభుత్వం నుంచి అందుతున్న ఖాళీలకు తగినట్లు వేగంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న కమిషన్.. తాజాగా గ్రూప్స్ కేటగిరీకి రంగం సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్, 1,2,3,4లకు సంబంధించిన కొత్త సిలబస్‌ను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ రేపు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి గ్రూప్స్ సిలబస్‌లో కొన్ని మార్పులు ఉంటాయని కమిషన్ ఇంతకు ముందే ప్రకటించింది. గ్రూప్స్ నోటిఫికేషన్‌కు ముందే సిలబస్ ప్రకటిస్తామని కూడా కమిషన్ చెప్పింది.
No comments:
Post a Comment