Tuesday, August 25, 2015

ఖైరతాబాద్‌ వినాయకుడికి 5600 కిలోల భారీ లడ్డు



ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా ఖైరతాబాద్‌ మహా గణపతికి భారీ లడ్డును సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ అధినేత పీవీవీఎస్‌. మల్లికార్జునరావు తెలిపారు. ఈ ఏడాది 5600 కిలోల లడ్డును పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఏడు అడుగుల వ్యాసంతో లడ్డును తయారు చేయనున్నట్లు చెప్పారు. 1565 కిలోల శనగపప్పు, 1100 కిలోల నెయ్యి, 2425 కిలోల పంచదార, 380 కిలోల జీడిపప్పు, 100 కిలోల బాదం పప్పు, 11 కిలోల పచ్చ కర్పూరం, 33 కిలోల యాలకులతో లడ్డు తయారు చేయనున్నామన్నారు. వినాయక మాలాధారణ చేసిన భక్తులు మాత్రమే లడ్డు తయారీలో పాల్గొంటారన్నారు. సెప్టెంబర్‌ 12వ తేదీన లడ్డు తయారీని ప్రారంభించి 14వ తేదీనాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 

No comments:

Post a Comment