Tuesday, September 22, 2015

TSPSC 3,896 కొత్త పోస్టులు

IR



త్వరలో నాలుగువేలకు పైగా పోస్టుల భర్తీ
-ఐఆర్ బెటాలియన్లలో 3896 పోస్టులు
- గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆర్థిక శాఖ
- టీఎస్‌పీఎస్సీ ద్వారా మరో 283 
- నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
-నవంబర్‌లో పరీక్షలు.
ప్రత్యేక పోలీస్ బెటాలియన్ల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించిన పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అలాగే టీఎస్‌పీఎస్సీ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలలో మరో 283 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తంగా నాలుగువేల మందికి పైగా నిరుద్యోగులకు త్వరలోనే ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటుకానున్న నాలుగు ఇండియన్ రిజర్వు బెటాలియన్ (టీఎస్‌ఎస్పీ)లలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


TSPSCLOGO


ఫలితంగా 3,896 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఈ నాలుగు బెటాలియన్లలో పోలీస్ కానిస్టేబుళ్లతోపాటు సంబంధిత పోస్టుల నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరుద్యోగ యువతకు తీపి కబురు అందిస్తూ నియామకాలకు సంబంధించి ఫైలుకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు నాలుగు బెటాలియన్లలో 3,896 కొత్త పోస్టులను సృష్టించడంతో పాటు నియామకాలను చేపట్టాలని పేర్కొంది. ఒక్కో బెటాలియన్‌లో 974 పోస్టులుంటాయి. 



వీటిలో కొన్ని ప్రమోషన్ల ద్వారా భర్తీ కానుండగా, మరికొన్ని నియామక ప్రక్రియ ద్వారా పూర్తి చేయనున్నట్టు ఆర్థిక శాఖ తన జీవోలో పేర్కొంది. ఇక టీఎస్‌పీఎస్సీ ద్వారా రవాణా, జలమండలి, పురపాలక శాఖలలో 283 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులకు బుధవారం నుంచి దరఖాస్తులు ఆహ్వానించనుండగా, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.


నియామకాలు..ప్రక్రియ


అసిస్టెంట్ కమాండెంట్/డీఎస్పీ హోదా ఉన్న 16 మంది అధికారులను పదోన్నతి ద్వారా లేదా నేరుగా ఎంపిక చేయనున్నారు. అలాగే ఆర్‌ఐ పోస్టులను కూడా నేరుగా లేదా ప్రమోషన్ల ద్వారా నియమించనున్నారు. ఇకపోతే అత్యంత కీలకమైన, క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఒక్కో బెటాలియన్‌లో 633 మంది కానిస్టేబుళ్లను భర్తీ చేయనున్నారు. వీరితోపాటు కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వంటమనుషులు, ఆఫీస్ సబార్డినేట్లు, దోబీలు, బార్బర్లు, స్వీపర్లను కూడా నేరుగా నియమించున్నారు. మినిస్టీరియల్ స్టాఫ్, కమాండెంట్, అదనపు కమాండెంట్, మెడికల్ స్టాఫ్ తదితర విభాగాల్లో పదోన్నతులు, డిప్యుటేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.

No comments:

Post a Comment