Monday, August 31, 2015

తెలుగు ఎలా టైప్ చేస్తారో తెలుసుకుందాం సులబంగ (Mobile or Computer)


Typing in Telugu ...తెలుగు టైపింగ్
ప్రసుతం అందరూ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులను ఉపయోగిస్తున్నారు. అయితే మీ మొబైల్ లో తెలుగు టైప్ చేయటానికి చాలా మంది చాలా మెథడ్స్ ట్రై చేసి ఉంటారు. ఎక్కువ కష్టపడకుండా డైరెక్ట్ గా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో తెలుగు టైప్ చేయటానికి మీకు చాలా యాప్స్ ఉన్నాయి గూగల్ ప్లే స్టోర్ లో. వాటి అన్నిటిలోనూ Indic Keyboard Prime ది బెస్ట్ యాప్.
ఎలా పనిచేస్తుంది?
మీరు ఇంగ్లీష్ లో పదాలను ఎలా టైప్ చేస్తారో, ఇది అలాగే టైప్ చేయాలి. మనం జెనెరల్ గా మెసేజింగ్ చేసేటప్పుడు Tinglish వాడుతాం. Tinglish అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తో తెలుగు వ్రాయటం (Eg: Ela Unnaru) . Indic Keyboard Prime లో "Ela unnaru" అని టైప్ చేస్తే అది "ఏలా ఉన్నారు" అని ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసి తెలుగులో చూపిస్తుంది టెక్స్ట్ను. ఇకపోతే వొత్తులు, దీర్ఘాలు కావాలంటే కేవలం మీకు కావలిసిన లెటర్స్ ను రెండు సార్లు టైప్ చేస్తే వత్తులు వస్తాయి, అదే ఆల్ఫాబెట్ ను కేపిటల్ లో టైప్ చేస్తే దీర్ఘం వస్తుంది. ఇక ప్రత్యేకంగా (సున్నా - 'o') కావాలి అంటే 'M' లెటర్ ను కేపిటల్ లో టైప్ చేస్తే వస్తుంది. మాముల "m" టైప్ చేస్తే "మ్" అని వస్తుంది. ఇందిక్ ప్రైమ్ కీ బోర్డ్ నంబర్స్ ను టైప్ చేయటానికి డెడికేటెడ్ నంబర్స్ బటన్ ను కూడా ఇస్తుంది కీ బోర్డ్ లో.
మీరు తెలుగు నుండి వేరే భాషకు మారాలని అనుకుంటే స్పేస్ బార్ మీద 2 సేకేండ్స్ ప్రెస్ చేసి ఉంటే, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవటానికి అందుబాటులో ఉన్న కీ బోర్డ్ ఆప్షన్స్ వస్తాయి.
ఏలా ఇంస్టాల్ చేసుకోవాలి?
ఇది గూగల్ ఆండ్రాయిడ్ ఫోనుల పై మాత్రమే పనిచేస్తుంది. ప్లే స్టోర్ నుండి Indic Keyboard Prime ను డౌన్లోడ్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే మీరు చేయవలిసిన స్టెప్స్ ను వివరిస్తుంది. వాటిని స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చదివి ఫినిష్ చేయండి. అయితే Select Languages అని చూపించే 3 స్టెప్ లో Configure Languages మీద టచ్ చేయండి, ఇప్పుడు Use System Language ఆప్షన్ ను UnClick చేసి, Active Input Methods క్రింద ఉన్న English ను టిక్ చేయండి (ఇది మీరు తెలుగు కీ బోర్డ్ నుండి వెంటనే ఇంగ్లిష్ కీ బోర్డ్ కు వచ్చేందుకు ఉపయోగపడుతుంది), తరువాత క్రిందకు స్క్రోల్ చేస్తే తెలుగు కు సంభందించి 5 ఆప్షన్స్ చూపిస్తుంది. అందులో "తెలుగు - లిప్యాంతరీకరణ" ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇది సులువుగా Tinglish లో టైప్ చేయటానికి. మిగిలిన 4 తెలుగు ఆప్షన్స్ కష్టతరమైన తెలుగు టైపింగ్ ప్రోసేస్లు.
"తెలుగు - లిప్యాంతరీకరణ" సెలెక్ట్ చేయగానే మీ ఫోన్ బ్యాక్ బటన్ ప్రెస్ చేసి బ్యాక్ కు రండి. దీంతో మీరు తెలుగులో టైప్ చేయటనికి కీ బోర్డ్ ను కాన్ఫిగర్ చేయటం పూర్తి చేసినట్లే.
ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేయటానికి వెళ్లండి. అక్కడ మీకు చూపిస్తున్న కీ బోర్డ్ ఏంటో తెలుసుకోవటానికి స్పేస్ బార్ 2 సేకేండ్స్ పాటు క్లిక్ చేయండి, వెంటనే మీ ఫోనులో ఉన్న కీ బోర్డ్స్ లిస్టు వస్తుంది. అందులో మీకు కావలిసిన "తెలుగు - లిప్యాంతరీకరణ" కీ బోర్డ్ ను సెలెక్ట్ చేసి, ఇక ఈజీగా పైన చెప్పిన విధంగా తెలుగు లో సునాయాసంగా టైప్ చేయగలుగుతారు.

2. మన లాప్టాప్ లేదా మన కంప్యూటర్ లో తెలుగులో టైప్ చేయాలనుకుంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ (google       input tools) install చేస్కుంటే సరిపోతుంది 
పైన చెప్పిన విదంగానే యిది కూడా పని చేస్తుంది లేదంటే ఇంటర్ నెట్ వున్నవాళ్ళు ఆన్లైన్ వుపయోగించి కూడా తెలుగు లో టైప్ చేయవచు ఉదాహరణకి www.quillpad.in ఇలాంటివి చాలానే వున్నాయి
తెలుసుకుందాం సులబంగ 

No comments:

Post a Comment