పవన్ కళ్యాణ్ పైన పబ్లిక్ గా మండిపడ్డ నాగబాబు
మెగాస్టార్ చిరంజీవి షష్ఠిపూర్తి ఉత్సవాల సందర్భంగా జరిగిన వేడుకల్లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌పై మెగాబ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన వేడుకల్లో నాగబాబు మాట్లాడుతుండగా మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా పవన్ ఎక్కడ ? పవన్ రాలేదా ?పవన్ ఎప్పుడు వస్తాడని కేకలు వేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన నాగబాబు వారిపై ఫైర్ అయ్యారు.
వాడి గురించి ఎందుకు.. మీరు ఎందుకు అరుస్తారు..వాడు మీకంటే ముందు మాకు తమ్ముడు..మా అన్నయ్య పట్టించుకోపోతే వాడుసలు హీరోయే అయ్యేవాడు కాదు..మా వదినే వాడిని హీరోను చేసిందని…ఆ కృతజ్ఞత వాడికి లేదు…వాడికి సెన్స్ లేదని ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యారు.
మా ఫ్యామిలీ ఫంక్షన్లకు వాడిని ఆహ్వానించేందుకు వాడి ఇంటికి వెళ్లి రాత్రి పొద్దుపోయే వరకు పడిగాపులు కాచి ..వాడిని ఎన్నోసార్లు బ్రతిమిలాడామని …ఈ విషయాలన్ని మీకు తెలుసా అంటూ కూడా ..మీకు దమ్ముంటే ఈ విషయం వెళ్లి వాడినే అడగండి…వాడి ఆఫీస్ ముందో..ఇంటి ముందో ధర్నా చేయండటూ ఒక్కసారిగా ఫ్యాన్స్‌పై నాగబాబు విరుచుకు పడడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
ఏదేమైనా చిరు షష్ఠిపూర్తి లాంటి ప్రెస్టేజియస్ ఫంక్షన్‌కు కూడా తమ్ముడు పవన్ రాకపోతే మెగా ఫ్యామిలీలో ఉన్న విబేధాలు సమసిపోలేదని అర్థమవుతోంది.
No comments:
Post a Comment