నియామకల్లో స్పీడ్ హైరింగ్ విప్లవం.............
ఉద్యోగాల కోసం టెస్టులు, ఇంటర్వ్యూలకు హాజరై రోజులు, నెలల తరబడి వేచి
చూడాల్సిన పని లేదు. వందల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినా సరే, 12
నిమిషాలు చాలు. మీరు ఆ జాబ్‌కు సరిపోతారా? లేదో తేలిపోతుంది. ‘స్పీడ్
హైరింగ్’గా పిలిచే ఈ కొత్త రిక్రూట్‌మెంట్ విధానాన్ని స్నాప్‌డీల్, ఓలా
క్యాబ్స్, క్వికర్, ఫుడ్‌పాండా, డబ్ల్యుఎన్‌ఎస్ లాంటి ఇ-కామర్స్ కంపెనీలు,
స్టార్టప్ కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. కాకపోతే ఉద్యోగం కోసం అప్లయ్
చేసిన అభ్యర్థి, తన సత్తా నిరూపించుకునేందుకు ఈ విధానంలో ‘కాగ్నిటివ్
ఎబిలిటీ స్పీడ్ టెస్ట్’ (కాస్ట్) అనే టెస్టుకు హాజరు కావాలి. అభ్యర్ధికి
నిష్పత్తులు, శాతాలు, రీజనింగ్, ఇంగ్లీషు గ్రామర్ ఎంత సత్తా ఉందో
పరీక్షించేందుకు 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. అందులో పాసైతే 12
నిమిషాల్లో మీ చేతికి ఆఫర్ లెటర్ కూడా వచ్చేస్తుంది. అయితే కంపెనీలు
ప్రస్తుతం ఈ విధానాన్ని జూనియర్ లెవల్‌లో కొత్తగా చేరే ఉద్యోగులకే
పరిమితం చేస్తున్నాయి.
No comments:
Post a Comment