యాదగిరిగుట్ట : యాదాద్రిలో ఈ నెల 21నుంచి 24వరకు వరుణయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీతారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవర్ష పాశుపత హవన పూర్వక వరుణయాగం దేవస్థానం ఆధ్వర్యంలో కొండపైన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 21న స్వస్తీవాచనము, పంచగవ్య ప్రాశనము, అఖండదీపారాధన, రుత్విగ్వరణ , మండపారాధన జపం, పారాయణం విరాటపర్వ ప్రవచనం, 22న శ్రావణ శుద్ధ్ద అష్టమి రోజున నిత్యారాధనలు, శతరుద్రాభిషేకం, స్థాపితదేవతాహవనం, వరుణయాగం, 23న నిత్యారాధనము, శతరుద్రాభిషేకం, పర్జన్య, వరుణమూలమంత్ర హోమం, పారాయణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 24న బలిహరణము, జయాదిహోమం, పూర్ణాహుతి, అవబృత స్నానం, రుష్యశృంగవిగ్రహ విసర్జనము, మహాదాశీర్వచనం జరుగుతాయని ఆమె వివరించారు.
25 నుంచి పవిత్రోత్సవాలు
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 25 నుంచి 27 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. శ్రావణ ద్వాదశి 27 నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు మొక్కు కల్యాణములు, శాశ్వత కల్యాణములు మొక్కు బ్రహ్మోత్సవాలు, శాశ్వత బ్రహ్మోత్సవాలు సుదర్శన నారసింహ హోమం రద్దు చేస్తున్నట్లు వివరించారు
copy from namastetelangana
No comments:
Post a Comment