తెలంగాణ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు అందించే రుణాలు పెంచేందుకు అం గీకరించింది. రాష్ట్రంలోని దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, వికలాంగులకు స్వయం ఉపాధి, ఆర్థికంగా చేయూత నందించేందుకు 80 శాతం వరకు రాయితీ ఇచ్చేందుకు రా ష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. 2015-2016 సంవత్సరంలోనే దీనిని అమలు చేసేందుకు అంగీకరించింది. గతంలో స్వయం ఉపాధి, ఆర్థిక చేయూత కోసం ప్రభుత్వం 50 శా తం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నారు. కానీ రుణాలు పొం దేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రుణాల మంజూరు కోసం బ్యాంకర్లు అంగీకరించిన రుణాలు ఇచ్చేందుకు లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. రుణాలు ఇవ్వాలంటే ఏదైనా పూచికత్తు కావాలనే మెలిక పెట్టారు. ప్రభు త్వం ఇచ్చే 50 శాతం సబ్సిడీ విడుదల చేసిన బ్యాంకర్లు మా త్రం లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేందుకు మోకాలడ్డు వేశారు. స్వయం ఉపాధి రుణాలు రాక పోవడం వల్ల బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన ఫలితం ఉండేది కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15 సంవత్సరంలోను ఈ సమస్య పునరావృతం అవ్వడంతో ప్రభుత్వం ఉపముఖ్యమంత్రి క డియం శ్రీహరి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పా టు చేశారు. ఈ ఉపసంఘం విస్తృతంగా సమావేశాలు నిర్వహించింది. అధికారులు, నిపుణుల సలహాలు తీసుకుని పథకాల్లో మూర్పులకు పలు సూచనలు చేసింది.
లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని పెంచాలని ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. బ్యాంకర్లు ప్రభుత్వ సబ్సిడీ పోను తమ వాటాగా ఇచ్చే రుణాలు అందించేందుకు ముందుకు రావడం లేదని, ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీని 50శాతం నుంచి 80శాతం సబ్సిడీ ఇవ్వాలని సిఫారసు చేశారు. ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం అందించిన సిపారసులను అంగీకరిస్తూ 2015-16 సంవత్సరం నుంచి అందించే రుణాలకు 80 శాతం రా యితీ అందించాలని సంక్షేమ శాఖలకు ఉత్తర్వులను విడుద ల చేయనున్నారు. దీని వల్ల వ్యక్తిగత రుణాలు పొందేవారి తో పాటు బృందాలగా రుణాలు పొందేవారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు స్వయం ఉపాధి పథకాల కింద రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తున్నారు.
ప్రభుత్వం నూతనంగా విడుదల చేసే ఉత్తర్వుల వల్ల ఉపాధి, ఆర్థిక చేయూత పథకాల్లో ఒక్కో యూనిట్‌కు గరిష్టంగా రూ.30లక్షల వరకు రుణాలు అందించనున్నారు. అందులో రూ.15లక్షలు సబ్సిడీగా వస్తుంది. వ్యక్తిగత రు ణాల్లో కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.5లక్షల సా యం అందిస్తారు. ఈ పథకం కింద రుణాలు అందించేందు కు 50 వృత్తులను ఎంపిక చేశారు. పనిముట్లు, ఇతర పెట్టుబడుల కింద సాయం అందిస్తారు. నైపుణ్యేతర, నైపుణ్య వి భాగాల్లో వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలు, సేవా రంగాలను గుర్తిస్తారు. 2015-16 సంవత్సరం నుంచే రు ణాలు అందించేందుకు నిధులను సైతం విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి వర్గ ఉపసంఘానికి ఆదేశించారు.

No comments:
Post a Comment