Monday, September 7, 2015

కొత్తగా మార్కెట్లో కి రాబోతున్న ఫోన్స్.


కి 

ప్రపంచంలో ఇప్పుడు ఎమర్జింగ్‌ టెక్నాలజీ అంటే మొబైల్‌ టెక్నాలజీయే! అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు సైతం మొబైల్‌ తయారీలోకి వచ్చేశాయ్‌! ఎందుకంటే మన దేశంలోనే ఇంచుమించు ఎనభై కోట్ల మొబైల్‌ఫోన్లు ఉన్నాయంటే.. ఇంతకంటే పెద్ద మార్కెట్‌ మరొకటి ఉండదు. అయితే మార్కెట్‌లోకి రోజుకొక ఫోన్‌ వస్తుండటంతో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీలో కొత్తతరం ఇష్టపడే మొబైల్‌ఫోన్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటోంది. దీంతో భవిష్యత్తులో అతి పల్చటి ఫోన్లు, కాగితంలా మడత పెట్టుకునేవి, చేతికి వాచీలా కట్టుకునేవి, అద్దంలా ట్రాన్స్‌పరెన్సీ ఉన్నవీ, అరచేతిలో ఇమిడే గుండ్రటి బిళ్లలాంటివి, మణికట్టుకు కట్టుకునే బాండ్‌ వంటి రూపాల్లో ఫోన్లు రానున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతున్న కొద్దీ ఫోను బరువు తగ్గుతోంది. సామర్థ్యం పెరుగుతోంది. దీనికి తోడు.. సాంకేతిక సేవలు మరిన్ని అదనం.. అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో రానున్నాయని భావిస్తున్న కొన్ని మొబైల్‌ఫోన్‌ మొడళ్లు ఇవి.

No comments:

Post a Comment