Thursday, September 10, 2015

ప్రపంచములో వీటికి పాపులారిటీ ఎక్కువే !

ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది ఇన్‌స్టెంట్‌ మెసేజ్‌ అప్లికేషన్లను ఉపయోగిస్తుంటారు. అయితే వీటిలో ఫేస్‌బుక్‌కు చెందిన మెసెంజర్‌, వాట్సప్‌ మెసెంజర్‌లను ఎక్కువ వాడుతూ ఉంటారు. వాట్సప్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మంది వాడుతున్నారని ఒక అంచనా. దీనిని పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అయితే చైనా, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పరిస్థితి మరో విధంగా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది వాడుతున్న కొన్ని మెసేజింగ్‌ అప్లికేషన్లు...
  • చైనా- ఇక్కడ వియ్‌చాట్‌ అనే అప్లికేషన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనిని ప్రతి నెల 50 కోట్ల మందికి పైగా ఉపయోగిస్తారని ఒక అంచనా. లొకేషన్‌ షేరింగ్‌, స్మార్ట్‌వాచ్‌ కంపాటబిలిటీ దీనిలో ప్రత్యేకతలు. 
  • జపాన్‌- లైన్‌ మెసెంజర్‌ 2011లో భూకంపం వచ్చినప్పటి నుంచి దీని వాడకం మొదలైంది. ఆ సమయంలో ఎన్‌హెచ్‌ఎన్‌ అనే టెక్నాలజీ కంపెనీకి చెందిన ఉద్యోగులు.. భూకంప బాధితులు తమ సమాచారాన్ని అందించేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేశారు. దీనిలో స్టిక్కర్స్‌, ఎమోటికాన్స్‌ పదివేలకు పైగా ఉంటాయి. 
  • దక్షిణ కొరియా- ఈ దేశంలో 93 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు కోకోటాక్‌ అనే అప్లికేషన్‌ను ఉపయోగిస్తారు. ప్రతి వినియోగదారుడు తనకు నచ్చిన థీమ్‌ను తయారుచేసుకోగలగడం ఈ అప్లికేషన్‌ ప్రత్యేకత.

No comments:

Post a Comment