Tuesday, September 22, 2015

జాతీయ ఎన్‌క్రిప్షన్‌ ముసాయిదా అమల్లోకి వస్తే తిప్పలు తప్పవు..


మీ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది...చూసి... తర్వాత డిలేట్‌ చేశారు...అది సర్వ సాధారణంగా జరిగే విషయమే. అయితే ఇకపై అలా చేస్తే శిక్షార్హులు అవుతారు. కేంద్రం ప్రతిపాదించిన జాతీయ ఎన్‌క్రిప్షన్‌ విధానం అమల్లోకి వస్తే ఇదే జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటికే రాద్దాంతం చెలరేగడంతో కేంద్రం వాట్సాప్‌, సోషల్‌ మీడియాకు ఎన్‌క్రిప్షన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. 

స్నేహితుల మధ్య ఎస్‌ఎమ్‌ఎస్‌లు, వాట్సప్‌ మెసేజ్‌లు గూగుల్‌ హ్యాంగవర్స్‌లో సందేశాలు సర్వ సాధారణం. కేంద్రం ప్రతిపాదించిన ఎన్‌క్రిప్షన్‌ విధానం ముసాయిదా యదాతథంగా అమలు అయితే సామాన్య జనానికి అనేక తిప్పలు తప్పవు. భారత్‌లో ఎన్‌క్రిప్షన్‌ సందేశాలు పంపండంలాంటి సేవలు అందించే సంస్థలు ఏవైనా సరే కేంద్రంతో ఒప్పందం కుదుర్చు కోవాలని కొత్త విధానంలో ప్రతిపాదించారు. అయితే ఎన్‌క్రిప్షన్‌ సందేశాలన్నింటిని కనీసం 90 రోజులు ఫోన్‌లో భద్రపరచుకోవాలని స్పష్టం చేశారు. 

కేంద్రం ప్రతిపాదనతో ఇప్పటికే నెటిజన్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. భారీ స్థాయిలో అభ్యంతరాలు రావడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. జాతీయ ఎన్‌క్రిప్షన్‌ పాలసీ నుంచి వాట్సప్‌, సోషల్‌ మీడియాను కేంద్రం మినహాయించింది. అయితే ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఇతర సందేహాలను మాత్రం 90 రోజుల పాటు భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. 

No comments:

Post a Comment