హైదరాబాద్ :మహిళల భద్రత కోసం సైబరాబాద్ షీటీమ్స్ ఏడు రక్షణ సూత్రాలను తయారు చేసింది. ఉద్యోగం, కాలేజీలు, ఇతర పనుల మీద వెళ్లే మహిళలు వీటిని పాటించి సేఫ్‌గా ఉండాలని సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్‌చార్జి, మల్కాజ్‌గిరి డీసీపీ రమారాజేశ్వరి సూచిస్తున్నారు. ఈ రక్షణ సూత్రాలను పాటిస్తే మహిళలు ఆకతాయిలతో పాటు స్నాచర్స్, అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులను ధైర్యంగా ఎదిరించేందుకు ఉపయోగపడతాయన్నారు. ఉమెన్ ఫోరం, ఐటీ కారిడార్, కాలేజీలు, పాఠశాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి విద్యార్థినులు, ఉద్యోగినులకు అవగాహన కల్పిస్తామన్నారు. దీని కోసం యువత సహకారం తీసుకుంటామని చెప్పారు.
ఇవే రక్షణ సూత్రాలు
1.అవగాహనకే ఆత్మరక్షణలో మొదటి ప్రాధాన్యం
2.రక్షణ కోసం చేయాల్సిన నెంబర్లను ఫీడ్ చేసుకోవాలి.
-విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలో ముందే ఆలోచించుకోవాలి.
-అత్యవసర పరిస్థితిలో 100 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి.
-మీ ఫోన్ స్పీడ్ డయల్‌లో ఇంటికి, ఆఫీసుకు దగ్గరగా ఉండే పోలీసుస్టేషన్ల నెంబర్లను భద్రపర్చుకోవాలి.
-సైబరాబాద్ వాట్సాప్ నెంబర్ 9490617444ను మీ వాట్సాప్ గ్రూప్‌నకు జత చేసుకోవాలి.
3.క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణించేటప్పుడు ముందుగా ఆ వాహన నెంబర్ రాసుకోవాలి. అనుమానం వస్తే ఆ నెంబరును బంధువులు, స్నేహితులకు మెసెజ్ ద్వారా పంపించి మీరు ప్రయాణీస్తున్న మార్గాన్ని సూచించాలి.
4.మహిళలు నిర్మానుష్య ప్రాంతాల నుంచి వెళ్లొద్దు.
-ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్టయితే నిద్రపోవద్దు.
-క్యాబ్‌లలో వెళ్లేప్పుడు డోర్‌లాక్ చేయడంతో పాటు, కిటికీలను మూయాలి.
-బయటికి వెళ్ళే సమయంలో సెల్‌ఫోన్ ఫుల్‌ఛార్జింగ్‌లో ఉండేట్టు చూసుకోవాలి. పెప్పర్ స్ప్రే తప్పనిసరిగా వెంటు ఉంచుకోవాలి.
5. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థినులు, ఉద్యోగినులు అక్కడి వాతావరణాన్ని పూర్తి ఆధ్యయనం చేసుకోవాలి
6.ప్రయాణాల్లో వ్యక్తిగత వివరాలను షేర్ చేయొద్దు
7.ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆత్మైస్థెర్యాన్ని పెంచుకోవాలి.ఆత్మరక్షణ కోసం చిట్కాలు నేర్చుకోవాలి.

No comments:
Post a Comment