Saturday, September 26, 2015

నేటి గ్లోబలైజేషన్ యుగంలో ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలంటే సబ్జెక్ట్

నేటి గ్లోబలైజేషన్ యుగంలో ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలంటే సబ్జెక్ట్

నాలెడ్జ్‌తోపాటు వాటిని వ్యక్తీకరించగలిగే కమ్యూనికేటివ్ స్కిల్స్ తప్పనిసరి. ఒక భాషా శాస్త్రవేత్త చెప్పినట్లు Communication is the life blood of all the organizations అనే విషయాన్ని మరచిపోకూడదు. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్ పోటీని తట్టుకొని నిలబడాలంటే language Skills పట్ల స్పష్టమైన అవగాహన, పట్టు అవసరం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దాదాపు అన్ని రకాల గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కూడా తప్పనిసరి చేశారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల భావ ప్రసరణ నైపుణ్యాలను ఎంత సులభంగా స్పష్టంగా విషయాలను తెలియచేయగలరో అంచనా వేస్తారు. కనుక నిత్యజీవితంలోనూ, వృత్తిపరమైన జీవితంలోనూ అవసరమైన ఒక విడదీయరాని భాగమైన కమ్యూనికేటివ్ స్కిల్స్ (భావ ప్రసరణ నైపుణ్యాలు) ప్రాధాన్యత మరింత సందర్భోచితం. ఈ క్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్‌కు సంబంధించిన ప్రాథమిక భావనలను అర్థం చేసుకుందాం.

కమ్యూనికేషన్ అంటే..?

నాగరికత ప్రారంభమైన నాటినుంచి నేటివరకు మానవ జీవితంలో అంతర్భాగంగా కమ్యూనికేషన్ (సమాచార ప్రసరణ) కొనసాగుతోంది. ఒక వ్యక్తిలోని ఆలోచనలు, అభిప్రాయాలు, కోరికలు, అమూర్త భావాలను ఇతరులకు శాబ్ధిక (Verbal), అశాబ్ధిక (Non-Verbal) రూపంలో చేరవేసే ప్రక్రియనే కమ్యూనికేషన్ అనవచ్చు. Sender (సమాచారాన్ని ఇచ్చేవాడు), Receiver (సమాచారాన్ని గ్రహించేవాడు) మధ్య అర్థవంతమైన ఆలోచనల పరస్ఫర చర్యనే మనం స్థూలంగా సమాచార ప్రసరణగా అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఇంట్లో, ఆఫీసులో, విద్యా సంస్థల్లో విషయ మార్పిడి చేస్తూనే ఉంటాం. అయితే మనం చేసే Communication ఎంత Effectiveగా ఉంటే అంత ఎక్కువ మందికి విషయాన్ని అర్ధం చేయించగలం, వారి నుంచి సహకారం పొందగలం, ఎంత విజ్ఞాన సంపత్తి మన మెదడులో ఉన్నప్పటికీ సరైన విధంగా ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయగల Effective Communicative tools లేనట్లయితే మన విజ్ఞానం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
జార్జ్ టీ వర్ధమాన్ అనే అంతర్జాతీయ కమ్యూనికేటివ్ ట్రైనర్ ప్రకారం కమ్యూనికేషన్స్ అంటే Effective communication is purposive sym-bolic interchange resulting in workable Understanding and agreement between the sender and the receiver.
వాస్తవానికి కమ్యూనికేషన్ అనే పదం కమ్యూనికేర్ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనికేర్ అంటే To Share (పంచడం), To import (అందించడం), To commune (తెలియచేయడం) అని అర్థం. భారతీయ సామాజిక జీవన విధానంలో విషయాన్ని పదిమందికి తెలపడమనేది తరతరాలుగా కొనసాగుతున్నది. కానీ నేటి యువత పట్టాలకు ఇస్తున్న ప్రాధాన్యం భావప్రసరణ నైపుణ్యాలకు ఇవ్వడం లేదు. మన భావాలను సరైన రీతిలో ఇతరులకు తెలియపరచగలిగినప్పుడే విజయపథంలో దూసుకుపోగలం.

కమ్యూనికేషన్ దశలు 
సాధారణంగా సమాచార ప్రసరణలో ఐదు ముఖ్యమైన దశలున్నాయి. అవి ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగిఉంటాయి. అవి..

Ideation
ఈ దశలో కావాల్సిన ఆలోచనలను (Ideas)ను ఏర్పరచుకోవడం, వాటిని సరైన రీతిలో సెలక్ట్ చేయడం వంటివి జరుగుతాయి. ఏరకమైన విషయాన్ని Present చెయ్యాలో చేసే దశ. సమాచారాన్ని పంపేవారి Knowledge, అనుభవాలు, శక్తి సామర్ధ్యాలు ఈ దశలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.

Encoding
ఇది అవసరమైన సమాచారాన్ని అవసరమైన రీతిలో Logical and coded రూపంలోకి మార్చే దశ. సమాచారాన్ని Encode చేసేటప్పుడు Sender, Receiver మధ్యఉన్న భౌతిక సంబంధం ముఖ్యమైన అంశం. సాధారణంగా మాతృభాషలో (First Language) సంభాషణ Informalగానూ, వాడుక పదాలతో నిండి ఉంటుంది. వివిధ రకాల అకడమిక్ పరమైన, వ్యాపార పరమైన సన్నివేశాలలో మర్యాదపూర్వక భాష ( Formal Language)ను ఉపయోగించడం అవసరం. ఉదాహరణకు హిందీ అర్థం చేసుకోలేని వారికి హిందీలో సమాచారం పంపడం వల్ల దాన్ని అర్ధం చేసుకోవడానికి సమయం పడుతుంది. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది.

Transmission 
ఇది 3 ముఖ్యమైన విషయాలను సూచిస్తుంది. అవి..
1. Proper Time (when to communicate)..
2. Proper Place (where to communicate)
3. Proper way (How to communicate)
ఉదాహరణకు ఆఫీస్‌లో బాస్ చెప్పిన విషయం సరిగ్గా అర్ధంకానప్పుడు దానిని ఒక Doubtగా ఉంచుకోవడంకంటే పై 3 రకాల సందర్భాలను బట్టి నివృత్తి చేసుకోవడం ద్వారా సరైన రీతిలో ప్రతిస్పందించవచ్చు.

Decoding
గ్రహించిన సమాచారాన్ని ఆలోచనల రూపంలోకి మార్చిన తర్వాత Receiver అర్ధం చేసుకొనే దశ. గ్రహించిన సమాచారాన్ని అర్ధం చేసుకోవడం, అనుసంధానించడం, విశ్లేషించడం అనేవి ఈ దశలోని ఉపభాగాలుగా ఉంటాయి. అయితే మౌఖిక సమాచారం (Oral Communication..) లో Listening and Understanding (వినడం, అర్ధ చేసుకోవడం) ప్రధాన భాగాలుగా ఉంటే, Written communicationలో Reading and Understanding (చదవడం, అర్ధం చేసుకోవడం) ప్రధాన అంశాలు.

Feedback
ఇది కమ్యూనికేషన్ ప్రక్రియలో చివరి దశ. సమాచారాన్ని గ్రహించిన వారి చర్య, ప్రతి చర్యలు (Action and Reaction) గ్రమించిన సమాచారం ఆధారంగా Sender తెలుసుకుంటాడు. అంటే Information Senderకు ఒక Responseలాగా ఉపయోగపడుతుంది. Sen-der తాను పంపిన సమాచారం ఎంతమేరకు Receiverకు అర్ధమయ్యిందో తెలుసుకోవడం ద్వారా తన లోటుపాట్లను గ్రహించవచ్చు.

కమ్యూనికేషన్ పద్ధతులు
ఒక వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారాన్ని పంపే పద్ధతులు

Down ward communication
ఏదైనా ఒక విషయాన్ని ఒక క్రమ నిచ్చెన మెట్ల (Hierarchy) పద్ధతిలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు చేరవేయడం. ముఖ్యంగా బ్యూరోక్రసిలోనూ, వివిధ సంస్థల్లోనూ ఈ రకమైన సమాచార ప్రసారాన్ని గమనించవచ్చు. ఉదా: ఒక కంపెనీ జనరల్ మేనేజర్ తన కింది స్థాయి బ్రాంచి మేనేజర్లకు విషయాన్ని పంపించడం. వివిధ రకాలైన Notes, notices, memos టెలిఫోన్ సంభాషణలు, E-mail లాంటివి.

Upward communication
ఇది కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారులకు చేరవేసే కమ్యూనికేషన్. వివిధ విషయాలకు సంబంధించిన Feedbackను పై స్థాయి వారికి అందచేస్తారు. 
ఉదా: వివిధ రకాల Proposals పంపడం, సలహాల బాక్స్, ఫిర్యాదులు స్వీకరించడం లాంటివి.

Horizontal communication
ఒక సంస్థకు సంబంధించిన Work Cultureకు చెందిన విషయం. Team work, Group coordinationకు సంబంధించిన విషయాలను గురించి తెలుపుంది. ఒక స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తుల మధ్య ఈ రకమైన కమ్యూనికేషన్ జరుగుతుంది.

Diagonal communication
ఇది ఆధునిక శాస్త్ర సాంకేతికత, నిర్వహణకు సంబంధించిన అంశాలపై దృష్టిపెడుతుంది. ప్రధానంగా మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీసుకరావాల్సిన మార్పులకు సంబంధించిన అంశాలను ఇది వివరిస్తుంది.
ఇవి మౌఖిక భావనలు ప్రాథమిక అంశాలుగా కమ్యూనికేషన్ సిస్టంలో ఉంటాయి. సరైన వైఖరుల్ని అభివృద్ధి చేసేదిగా కమ్యూనికేషన్ ఉండాల్సిన అవరసరం ఉంది.

No comments:

Post a Comment