ఏకదంతం మహాకాయం, తప్తకాంచన సన్నిభమ్,
లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకమ్.
మౌంజీ కృష్ణాజినధరం, నాగయజ్ఞోప వీతినమ్,
బాలేందు శకలం మౌళౌ, వందేహం గణనాయకమ్.
చిత్రరత్న విచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్,
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్.
గణవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్,
పాశాంకుశధరం దేవం, వందేహం గణనాయకమ్.
మూషికోత్తమమారుహ్య దేవాసుర మహాహవే,
యోద్ధుకామం మహావీరం వందేహం గణనాయకమ్.
యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా,
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్.
అంబికా హృదయానందం, మాతృభిః పరివేష్ఠితమ్,
భక్తి ప్రియం మదోన్మత్తం, వందేహం గణనాయకమ్.
సర్వవిఘ్నహరం, సర్వవిఘ్న వివర్జితమ్,
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్.
గణాష్టకమిదం పుణ్యం, యఃపఠేత్ సతతం నరః,
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్.
పూజా ద్రవ్యాలు:
వినాయక వ్రతకల్పం
పసుపు, కుంకుమ, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము.
పంచామృతం - ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అన్నీ కలిపినది.
దీపములు - తైలం, నెయ్యి.
వస్త్రములు - పత్తితో చేయవచ్చు.
మధుపర్కాలు - పత్తితో చేయవచ్చు.
యజ్ఞోపవీతం - పత్తితో చేయవచ్చు.
పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యం పరచి, పూర్ణకుంభం (వెండి లేదా రాగి లేదా యధా శక్తి చెంబు)లో కొత్త బియ్యం వేసి, వినాయకుని విగ్రహం పెట్టి అలంకరించండి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేతగడ్డి ఆకులు, వివిధ రకాల పూలు, పళ్ళు, పాలవెల్లి, గొడుగు.
మహా నైవేద్యం - నేతితో చేసిన 12 రకాల వంటకాలు. ఇవి వీలు కాకపోతే తమ శక్తి కొలది రకరకాల పిండివంటలు చేయవచ్చు.
తర్వాత మంచినీటితో గ్లాసు, గ్లాసులో పూవు, ఉద్ధరిణ (చెంచా) ఉంచుకోవాలి.
శ్రీగణేశ ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే ॥
ఉ. తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్॥
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
చం. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన జేసెద నేకదంతనా
వలపటి చేత ఘంటమున వాక్కున నెప్పెడు బామకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా
క. తలచితినే గణనాధుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా!
దలచితినే హేరంబుని! దలచితి నా విఘ్నములను తొలగించుటకున్॥
క. అటుకులు కొబ్బరి పలుకులు! చిటి బెల్లము నానబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్ర సుతునకు! వటుతరముగ విందు చేసి ప్రార్థింతు మదిన్!
ఆచమనం -
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని మూడు సార్లు జలం తాగాలి).
ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్టవేనమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అనుకుని కాసిన్ని నీళ్ళు తలపై చల్లుకోవాలి)
ఆత్మశుద్ధి -
శ్లో॥ అపవిత్ర పవిత్రోవా సర్వావస్ధాంగ తోపివా
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యంభ్యంతర శ్శుచిః
(ఈ మంత్రం చదివిన తరువాత చేతిలో కొన్ని నీళ్ళు
తీసుకుని కింది మంత్రాన్ని పఠించాలి)
భూశుద్ధి -
శ్లో॥ ఉతిష్టంతు భూతపిశాచాః యేతే భూమిభారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ॥
(తరువాత కొన్ని అక్షింతలు వాసన చూసి వెనుకకు
(కుడివైపు) జల్లుకొని ఈ మంత్రం చదవాలి.)
కలశారాధన -
నీటితో ఉన్న ఒక చెంబును తీసుకుని దానికి పసుపు రాసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత ఆ పాత్రలో తమలపాకు, అక్షింతలు వేసి ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి గంగా జలాన్ని ప్రార్థించాలి.
పసుపు గణపతి పూజా ప్రారంభః
కొన్ని అక్షింతలు పసుపు గణపతిపై చల్లి నమస్కరించాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు తథాస్తు.
(ఈ కింది విధంగా జపిస్తూ గణనాయకుడికి నమస్కరించాలి)
ఓం సుముఖాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వికటాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం శూర్పకర్ణాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి.
ధూపం ధూపయామి (అగరుపుల్లలను వెలిగించి స్వామికి ధూపం వెయ్యాలి.), దీపం దర్శయామి (దీపమును చూపించాలి.)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లాలి.), ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరం వెలిగించాలి.),
శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటి సూర్య
సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ
సర్వకార్యేషు సర్వదా॥
మహాగణాధిపతియే నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతి: సుప్రీత: సుప్రసన్నో వరదో భవతు,
మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. (గణపతి వద్దనుండి అక్షతలు తీసుకొని తలపై చల్లుకోవాలి).
విఘ్నేశ్వర కళ్యాణం
వినాయకుని వివాహం గురించిన పౌరాణిక గాథ.
అతని ఆంతర్యాన్ని గ్రహించిన వినాయకుడు నారదా! మా మధ్య కలహం వస్తుందని నీవు భావించావు. నా సిద్ధిబుద్ధి ఎవరో కాదు, నా ఆంతరంగిక శక్తులైన జ్ఞానం, క్రియ. అందుకే మేము మళ్ళీ ఒకటయ్యాం.నీ కలహ చింతన లోకోపకార కారకమైంది. భవిష్యత్ మానవుడు సిద్ధి బుద్ధి సమేతుడనైన నన్ను ఆరాధిస్తే వారికి సమస్త విఘ్నాలు తొలగి సుఖశాంతులు పొందుతారని చెప్పాడు. ఇది వినాయకుడి పెళ్ళి కథలోని ఆంతర్యం.
అధాంగ పూజ
(కింది నామాలు చదువుతూ పత్ర,
పుష్పాదులతో స్వామి వారిని అర్చించాలి).
ఓం గణేశాయ నమ:
- పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమ:
- గుల్ఫౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమ:
- జానునీ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమ:
- జంఘే పూజయామి
ఓం అఖువాహనాయ నమ:
- ఉరూ పూజయామి
ఓం హేరంబాయ నమ:
- కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమ:
- ఉదరం పూజయామి
ఓం గణనాధాయ నమ:
- నాభిం పూజయామి
ఓం గణేశాయ నమ:
- హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమ:
- కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ నమ:
- స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమ:
- హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమ:
- వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమ:
- నేత్రే పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమ:
- కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమ:
- లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమ:
- శిర: పూజయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ:
- సర్వాణ్యంగాని పూజయామి
అథైక వింశతి పత్రపూజ
(ఈ కింది నామాలు చదువుతూ 21 పత్రములతో స్వామిని పూజించాలి).
ఓం సుముఖాయ నమ: -మాచీ పత్రం పూజయామి ॥
ఓం గణాధిపాయ నమ: -బృహతీ పత్రం పూజయామి॥
ఓం ఉమా పుత్రాయ నమ:-బిల్వ పత్రం పూజయామి॥
ఓం గజాననాయ నమ: -దుర్వారయుగ్మం పూజయామి॥
ఓం హరసూనవే నమ: -దత్తూర పత్రం పూజయామి॥
ఓం లంబోదరాయ నమ:-బదరీ పత్రం పూజయామి॥
ఓం గుహాగ్రజాయ నమ: -అపామార్గ పత్రం పూజయామి॥
ఓం గజకర్ణకాయ నమ: -తులసీ పత్రం పూజయామి॥
ఓం ఏకదంతాయ నమ: -చూత పత్రం పూజయామి॥
ఓం వికటాయ నమ: -కరవీర పత్రం పూజయామి॥
ఓం భిన్న దంతాయ నమ:-విష్ణుక్రాంత పత్రం పూజయామి॥
ఓం వటవే నమ: -దాడిమీ పత్రం పూజయామి॥
ఓం సర్వేశ్వరాయ నమ: -దేవదారు పత్రం పూజయామి॥
ఓం ఫాలచంద్రాయ నమ:-మరువక పత్రం పూజయామి॥
ఓం హేరంబాయ నమ: -సింధువార పత్రం పూజయామి॥
ఓం శూర్పకర్ణాయ నమ: -జాజీ పత్రం పూజయామి॥
ఓం సురాగ్రజాయ నమ:-గండకీ పత్రం పూజయామి॥
ఓం ఇభవక్త్రాయ నమ: -శమీ పత్రం పూజయామి॥
ఓం వినాయకాయ నమ:-అశ్వత్థ పత్రం పూజయామి॥
ఓం సుర సేవితాయ నమ:-అర్జున పత్రం పూజయామి॥
ఓం కపిలాయ నమ: -అర్క పత్రం పూజయామి॥
ఓం శ్రీ గణేశ్వరాయ నమ:-ఏకవింశతి పత్రం పూజయామి॥
(మిగిలిన మొత్తం ఆకులనూ స్వామికి సమర్పించాలి).
శ్రీ వరసిద్ధి వినాయక పూజా ప్రారంభః
(కింది మంత్రాలు చదువుతూ అక్షితలు స్వామిపై వేస్తూ నమస్కరించాలి)
ధ్యానం - శ్లో॥ భవంసంచిత పాపౌఘవిధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ॥
శ్లో॥ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంతుకుశధరం దేవం ద్యాయేత్సిద్ధి వినాయకం ॥
శ్లో॥ ఉత్తమం గణనాధస్యవ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టంప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥
శ్లో॥ ధ్యాయేద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
(కింది విధంగా అంటూ అక్షితలు స్వామిపై వేస్తూ నమస్కరించాలి).
ఆవాహనం - శ్లో॥ అత్రాగచ్ఛ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర అనాధనాధ సర్వజ్ఙ, గౌరీగర్భ సముద్భవ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
(కింది విధంగా అంటూ అక్షింతలు స్వామిపై వేస్తూ నమస్కరించాలి).
ఆసనం - శ్లో॥ మౌక్తికై: పుష్యరాగైశ్చ నానారత్త్నె ర్విరాజితం - రత్న సింహాసనం చారుప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: నవరత్న ఖచిత స్వర్ణసింహాసనార్థం-హరిద్రాక్షతాన్ సమర్పయామి.
(కింది విధంగా అంటూ పుష్పముతో గణేశుని చేతులపై నీళ్ళు చల్లాలి).
అర్ఘ్యం - శ్లో॥ గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన - గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షితైర్యుతం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: హస్తయో: అర్ఘ్యం సమర్పయామి.
(కింది విధంగా అంటూ పుష్పముతో గణేషుని పాదాలపై నీళ్ళు చల్లాలి).
పాద్యం - శ్లో॥ గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక - భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీ వరసిద్ధ్ది వినాయకాయ నమ: పాదయో పాద్యం సమర్పయామి.
(కింది విధంగా అంటూ పువ్వుతో నీరు చల్లాలి).
ఆచమనీయం - శ్లో॥ అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత - గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: ముఖే: శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
(కింది విధంగా అంటూ ఆవు పాలు, పెరుగు, నెయ్యిలతో కూడిన మధుపర్కము ఉంచవలెను).
మధుపర్కం - శ్లో॥ దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: మధుపర్కం సమర్పయామి.
(కింది విధంగా అంటూ పుష్పముతో స్వామిపై పంచామృతం చల్లవలెను).
పంచామృత స్నానం - శ్లో॥ స్నానం పంచామృత్తెర్దేవ గృహాణ గణనాయక - అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత ॥
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: పంచామృత స్నానం సమర్పయామి.
(ఈ కింది విధంగా అంటూ పుష్పంతో నీటిని రెండుసార్లు స్వామిపై చల్లాలి).
శుద్ధోదక స్నానం - శ్లో॥ గంగాది సర్వతీర్ధేభ్యై: అహృతై: అమలైర్జలై: స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం పున: శుద్ధాచమనీయం సమర్పయామి.
(కింది విధంగా అంటూ కొంచెం దూది పల్చగా చేసి స్వామిపై వెయ్యాలి).
వస్త్రం - శ్లో॥ రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం - శుభప్రద గృహాణత్వం, లమ్బోదర హారాత్మజ॥
శ్రీ వరసిద్ది వినాయకాయ నమ: వస్త్రయుగ్మం సమర్పయామి.
(కింది విధంగా అంటూ దూదితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామికి వెయ్యాలి).
యజ్ఞోపవీతం - శ్లో॥ రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చోత్తరీయకం - గృహాణ దేవ సర్వజ్ఞభక్తానామిష్ట దాయక॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: యజ్ఞోపవీతం సమర్పయామి).
(కింది విధంగా అంటూ పువ్వుతో గంధాన్ని స్వామిపై వెయ్యాలి).
గంధం - శ్లో॥ చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం॥
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: దివ్య శ్రీ చందనం సమర్పయామి
(కింది విధంగా అంటూ అక్షింతలు స్వామిపై వెయ్యాలి).
అక్షింతలు - శ్లో॥ అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: అలంకరణార్థం హరిద్రాక్షతాన్ సమర్పయామి.
(కింది విధంగా అంటూ పుష్పాలు స్వామిపై వెయ్యాలి).
పుష్పములు
- శ్లో॥ సుగంధాని సుపుష్పాణీ జాజీకుంద ముఖానిచ - ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: పుష్పం సమర్పయామి

No comments:
Post a Comment