కొబ్బరి నీళ్లు. ఏదో దాహం వేస్తేనో, వేడి చేసిందనో తాగుతూ ఉంటారు చాలామంది. కానీ ఈ కొబ్బరి నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని అంటున్నారు వైద్యులు. డీహైడ్రేషన్ సమయంలో కొబ్బరి నీరు తీసుకుంటే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. ఈ నీళ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గిస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం... కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే మూత్రమార్గాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాదు.. ఈ నీటిని మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించేందుకు కూడా ఉపయోగిస్తారు. ఈ నీళ్లను చర్మంపై రాసుకుంటే శరీరంపై ఉన్న పొక్కులు, ర్యాషెస్ తగ్గిపోతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లకు అంతటి ప్రాధాన్యత ఉన్నది.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఇంట్లో చికిత్స
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఇక్కడ కొన్ని రకాల సూచనలను తెలిపాము, భారతదేశంలోని స్త్రీలు చాలా కాలం నుండి ఈ రకమైన సూచనలను పాటిస్తున్నారు.
మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి హెన్న పేస్ట్, పెరుగు, నానబెట్టిన మెంతులను, మందార పువ్వులను లేదా గుడ్డు వంటి ఇంట్లో సాధారణంగా లభించే ఔషదాలలో ఏదోక ఔషదాన్ని ఎంచుకొని షాంపూ వాడటానికి ముందుగా వాడండి. వీటిని క్రమంగా వాడటం వలన మీ జుట్టు బలంగా మరియు చూడటానికి అందంగా కనపడుతుంది. కానీ, హెన్న అనేది నల్ల రంగులో వెంట్రుకలను కలిగి ఉన్న వారికి మాత్రమే సరిపోతుంది కారణం- హెన్నా జుట్టును ఎరుపు రంగులోకి మారుస్తుంది.
జుట్టును వారానికి ఒకసారైన టీ పొడితో చేసిన డికాషన్ లేదా స్నానం చేసే నీటిలో కొద్దిపాటి నిమ్మరసంను కలపండి. దీని వలన చుండ్రు తగ్గుతుంది.
కొబ్బరి నూనె లేదా బాదం నూనెలతో రోజు మసాజ్ చేయండి. రాత్రి పడుకునే సమయంలో కొబ్బరి నూనెతో మదాజ్ చేయటం వలన, వెంట్రుకల మొదల్లలో కదలికలు జరిగి, కేశాలు ఆరోగ్యకరంగా ఉంటాయి.


No comments:
Post a Comment