Monday, September 14, 2015

ఆర్‌సీ, లైసెన్స్ ఇంటి వద్ద మరిచి పోయినా మొబైల్స్ లో చుసుకోవచ్చు

         
  


                తరుచూ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వాహనదారుడు ఆర్‌సీ, లైసెన్స్ ఇంటి వద్ద 
మరిచిపోయానంటూ సమాధానాలు చెబుతుంటాడు.. అప్పుడు ధ్రువీకరణపత్రాలు తెచ్చాకే మీ వెహికిల్ తీసుకెళ్లడంటూ పోలీసులు వాహనాన్ని స్టేషన్ తీసుకెళ్లారు. వాహనదారుడి వద్ద అన్ని ఉన్నా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మీద ఇలాంటి తిప్పలు ఉండవిక. ఇక త్వరలో అలాంటి సమస్యకు నగర పోలీసులు టెక్నాలజీతో పరిష్కారం చూపనున్నారు. అన్ని ఉన్నా మరిచిపోయి ఉంటే.. వాహనదారుడి లైసెన్స్, ఆర్‌సీని కొత్తగా అందుబాటులో ఉన్న మొబైల్ అప్లికేషన్లో చెక్‌చేస్తారు.


           వాహనదారుడు చెప్పేది నిజమే అయితే వెంటనే అక్కడి నుంచి పంపిస్తారు. తక్షణ సహాయం అందించేందుకు
 ఎన్నో ఫీచర్లతో మరో సరికొత్త మొబైల్ అప్లికేషన్‌తో నగర పోలీసులు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా పెట్రోలింగ్ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మొబైల్ పెట్రోలింగ్ సిబ్బందితో పాటు ఎస్సైలు, సీఐలు, ఇతర పోలీసు అధికారులు ఈ అప్లికేషన్‌ను ఉపయోగించనున్నారు.


             వీరితో పాటు ట్రాఫిక్ విభాగంలోని పోలీసు సిబ్బంది కూడా ఈ అప్లికేషన్‌ను ఉపయోగించి తక్షణ నిర్ణయాలు 

తీసుకుంటారు. ఇంతేకాకుండా పోలీసు శాఖలో నేరాల అదుపు, శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంతర్గత విషయాలను ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఉన్నతాధికారులు ఆదేశాలు, సూచనలు, సలహాలు క్షేత్ర స్థాయిలో ఉంటే అధికారులకు అందజేయనున్నారు.  

No comments:

Post a Comment