ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్లలో వారం పది రోజుల్లో వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద బస్‌స్టేషన్‌గా పేరొందిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి నిత్యం 3500 పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన బస్సులు ఈ బస్‌స్టేషన్ నుంచి రవాణా సాగిస్తాయి.
ప్రతి రోజు లక్షా యాభై వేల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు చేరుకుంటారు. వారి కోసం వైఫై సేవలను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ రెండు స్టేషన్లతోపాటు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న బస్‌స్టేషన్లలో వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు వైఫై సేవలను మొదటి 15 నిమిషాలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ఆ తర్వాత రీచార్జీ కూపన్స్ తీసుకుని మిగతా అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి రోజుకు 60 వేల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇక్కడ కూడా వైఫై సేవలు త్వరలో ప్రారంభించడానికి ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే వేలాది మంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది.
No comments:
Post a Comment