ప్రకృతి ఒడిలో సుందరవనాలు
దేశ చిత్రపటంలో చిత్తూరు జిల్లాకు పర్యాటక కేంద్రంగా ప్రముఖ స్థానం ఉంది. పుణ్యక్షేత్రాలు.. జలపాతాలు.. చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి.. యాంత్రిక జీవితంలో కాసేపు
సేదదీరేందుకు ఇక్కడి ప్రకృతి ఆహ్వానం పలుకుతుంది. పచ్చని చెట్లు, ఎతై్తన కొండల నుంచి జాలువారే జలపాతాలు, గలగల పారే సెలయేర్ల మధ్య ఆహ్లాదంగా గడిపేందుకు అనువైన
ప్రాంతాలెన్నో ఇక్కడ ఉన్నాయి. విస్తారమైన అడవులు ఉన్న జిల్లాలో ఇందుకు అనుగుణంగా అటవీశాఖ ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. అడవుల్లో పర్ణశాలల ఏర్పాటు,
చెట్లపై నడక, వన్యమృగాల ప్రదర్శనతో చిన్నపిల్లల నుంచి పెద్దలకు వినోదంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతోంది అటవీశాఖ. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎకో టూరిజం ప్రాజెక్టుల వివరాలను తెలుసుకుందాం..
జంగిల్‌బుక్:
తిరుపతి పట్టణం సమీపంలోని కపిలతీర్థం వద్ద పర్యాటకులు, పిల్లల కోసం జంగిల్‌బుక్ ఏర్పాటు చేశారు. ఈ ప్రకృతి అధ్యయన ఉద్యానవనంలో వివిధ రకాల పక్షుల గురించి తెలిపే కీటకధామం, ఖనిజాల గురించి వివరించే ఖనిజ సామ్రాజ్యం ఉంది. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది. పిల్లలు టెలిస్కోప్ వీక్షించడానికి అనువైన ఏర్పాట్లు చేశారు.మామండూరు
తిరుపతికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామండూరు ప్రాంతం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అడవిలో విహరించడానికి, జంతువుల్ని సందర్శించడానికి 10 కిలోమీటర్ల
పొడవునా ప్రకృతి బాట ఉంది. పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ వసతి గదులు ఉన్నాయి.
కపిలతీర్థం:
తిరుపతిలో పకృతి ప్రసాదిత జలపాతం
కైలాసనాథకోన:
పుత్తూరు నగరి మార్గంలో కైలాసనాథకోన జలపాతంఉంది. తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరం.
తలకోన 
దట్టమైన అడవులు.. కళ్లను కట్టి పడేసే ప్రకృతి అందాలు. గిరిశిఖరం నుంచి జాలువారే జలపాతం తలకోన ప్రత్యేకత. చలనచిత్రాల చిత్రీకరణలకు తలకోన అటవీ ప్రాంతం
అనువైనదిగా పేరొందింది. ఇక్కడ నిత్యం ఏదోఒక సినిమా చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. సందర్శకుల సౌకర్యార్థం అడవిలో చెట్లపై నడిచేందుకుఅనువుగా నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ బోటింగ్ సదుపాయంతో పాటు వనమూలికల సందర్శన, నేచర్ ట్రయిల్స్ నిర్వహిస్తూంటారు. వివిధ ప్రాంతాలను సందర్శించడానికి వీలుగా జంగిల్ సఫారి ఏర్పాటు చేశారు.తిరుపతి నుంచి 59 కిలోమీటర్లు, భాకరాపేట నుంచి అయితే 24 కిలోమీటర్ల దూరంలో తలకోన ఉంది. వంద సంవత్సరాల వయస్సు ఉన్న గిల్లతీగ భూమి నుంచి పది అడుగుల ఎత్తు పెరిగి నాలుగు శాఖలుగా విస్తరించి 5 కిలోమీటర్ల పొడవునా ఉంది. తలకోన ప్రాంతానికి ఈ గిల్లతీగ ప్రత్యేకతగా నిలిచింది. తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరం
కైగల్ జలపాతం: డుముకురాళ్ల జలపాతం. పలమనేరు నుంచి కుప్పం మార్గంలో ఉంది. తిరుపతి నుంచి 150 కిలోమీటర్ల దూరం.
ఉబ్బలమడుగు: బుచ్చినాయుడుకండ్రిగ నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని ఉబ్బలమడుగు జలపాతం వద్ద నిత్యం పర్యాటకుల సందడి ఉంటుంది. కొండకోనల మధ్య సుందర జలపాతం ఇక్కడి ప్రత్యేకత. దీన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో తమిళనాడు నుంచి పర్యాటకులు వస్తూంటారు. ఇక్కడ సందర్శకుల కోసం అతిధిగృహాలు ఏర్పాటు చేశారు.
చారిత్రాత్మక కట్టడాలు..
చంద్రగిరి: విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో చంద్రగిరి దుర్గం విడిదిగా ఖ్యాతి గడించింది. కోటలో పురావస్తు ప్రదర్శనశాల, బోటింగ్, సాయంత్రం వేళల్లో రాష్ట్ర పర్యాటకశాఖ రూపొందించిన అద్భుతరూపవాణి కార్యక్రమం సందర్శన. తిరుపతి నుంచి 16 కిలోమీటర్లు
కంగుందికోట: కుప్పంలో కంగుంది కోట ఉంది. ఆంజనేయస్వామి విగ్రహం సందర్శనీయం. తిరుపతి నుంచి 210 కిలోమీటర్లు
హార్సిలీహిల్స్: దక్షిణ టిగా ఖ్యాతి గడించింది. వేసవి విడది. సముద్రమట్టానికి 1,265 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. తిరుపతి నుంచి 150కిలోమీటర్లు.పర్యాటకులకు రవాణా సదుపాయాలకు..
పర్యాటక శాఖ కేంద్రీయ విచారణ కార్యాలయం: తిరుపతి శ్రీనివాసం ఫోన్0877 2289126.
శ్రీదేవి కాంప్లెక్సు: ఐఆర్‌ఓ ఫోన్ 0877 2289120, 121
తిరుమలలో పర్యాటకశాఖ కార్యాలయం ఫోన్: 08772289128
ఆర్టీసీ విచారణ: 0877 12666
కమనీయ దృశ్యం
ప్రకృతి సుందర దృశ్యాలతో కన్నులకు ఇంపుగా గిరిశిఖరాల నుంచి జాలువారే జలపాతాలతో ఉల్లాసాన్ని కలిగించే ఎతైన కొండల మధ్య వెలసియున్న శ్రీకైలాసనాథకోన ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజల్లుతోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన శ్రీ కైలాసకోన పుత్తూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి- త్తుకోట రహదారి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కాకముక కొండల నడుమ 120 అడుగుల ఎత్తు నుంచి జారువారే ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం కొండపై ఉన్న ఏడు బావుల గుండా ప్రవహిస్తూ ఏడాది పొడవునా దుముకుతుండటం ప్రత్యేకత. ఈ జలపాతంలో స్నానం ఆచరించి జలాన్ని తాగితే ఉదరకోశ, చర్మవ్యాధులు నయమవుతాయని నమ్మకం ఉంది.
మహిమగల కొలను
బుటకపల మండలంలోని దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లె గుట్టలో మహిమగల కొలను ఉంది. నీళ్లగుండు కింద ఉన్న ఈ కొలను పూర్తిగా బండపైతగ్గుప్రదేశంలో ఒక బిందె మాత్రమే నీళ్లు ఉరుతుంటాయి. వీటిని బిందెలోకి తోడితే తిరిగి రుతాయి. ఈ విధంగా ఎన్ని నీళ్లైన రుతాయి. కరవు రోజుల్లో కూడా ఇక్కడ నీరు రడం విశేషం. పూర్వం ఇక్కడ అభయాంజనేయస్వామి ఆలయం ఉండేదని చెపుతారు.
చారిత్రక స్కందపుష్కరిణి
కార్వేటినగరం సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన ఈ స్కంధపుష్కరిణిని క్రీ.శ 1857-85లో శ్రీవెంకటపెరుమాళ్ దేవమహారాజు నిర్మించారు. 14.54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పుష్కరిణి మెట్లపై నీరు ఏవైపు చూసినా సమానంగా ఉండటం విశేషం. మెట్లపై మలచిన దేవతామూర్తులు, సర్పాలు, విచిత్ర జంతువులు, చేపలు, తాబేళ్ల చిత్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
లక్ష్మీమహల్
కార్వేటినగరం సంస్థానాధీశులు నిర్మించిన లక్ష్మీమహల్ చంద్రగిరి కోటను పోలీ ఉంటుంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరింది. క్రీ.శ. 1857-1885 లో వెంకటపెరుమాళ్ దేవమహారాజులు దీన్ని నిర్మించారు. చంద్రగిరి కోటను పోలి ఉన్న ఈ భవనం అలనాటి వాస్తు శిల్పకళలకు దర్పణం పడుతుంది. భవన నిర్మాణ పైకప్పునకు బర్మాటేకు దుంగలు వాడారు. కోట్ల విలువ చేసే చందనం, బర్మాటేకులు ఇప్పటికీ ఉన్నాయి.
హార్సిలీహిల్స్ అందాలు హాయ్.. హాయ్!
రాష్ట్రంలో అత్యంత ఎతై్తన పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్. సముద్రమట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్నఈ ప్రదేశం బి.కొత్తకోట మండలంలో ఉంది. పురాతన కాలం నుంచి ఏనుగు మల్లమ్మకొండగా పిలువబడే ఈ కొండకు 1848లో మొదటిసారిగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో కడప కలెక్టర్‌గా పనిచేసిన సర్ హార్సిలీ గుర్రంపై చేరుకున్నారు. ఇక్కడి చల్లటి వాతావరణానికి ముగ్ధుడైన ఆయన వేసవి విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఈకొండ హార్సిలీహిల్స్‌గా పేరెన్నికగన్నది. 1859లో ఆయన నాటిన నీలగిరి మొక్క మహావృక్షంగా ఎదిగి ప్రస్తుతం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 7 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల ఎత్తు పెరిగిన ఈ వృక్షానికి భారత ప్రభుత్వం 1995లో మహావృక్ష పురస్కారాన్ని ఇచ్చింది. 1964లో హార్సిలీహిల్స్‌ను రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గవర్నర్ వేసవి విడిదికి ఇక్కడ గవర్నర్ బంగ్లా నిర్మించారు. అప్పటి నుంచి వేసవి విడిది కేంద్రంగా ఉన్న హిల్స్ గత 15 ఏళ్లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘణనీయమైన అభివృద్ధి సాధించింది. ఇక్కడ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో కూడిన 50 అతిథిగృహాలు, సమావేశ మందిరం నిర్మించారు. రెస్టారెంట్ కూడా ఉంది. స్విమ్మింగ్‌పూల్, మసాజ్ సెంటర్, పిల్లల ఉద్యానవనం ఉన్నాయి. ఇంకా ప్రకృతి అందాలతోపాటు అడ్వెంచర్ టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్‌వాకింగ్, జార్బింగ్, ట్రెక్కింగ్, రాక్‌క్లైంబింగ్ తదితర ఏర్పాట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో వేసవి విడిది కేంద్రంగా ఉన్న హార్సిలీహిల్స్ నేడు నిత్యపర్యాటక కేంద్రంగా అభివృద్ధి సాధించింది. దీంతో పర్యాటక శాఖకు నెలసరి రూ.25 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. వేసవిలో రూ.35 నుంచి రూ.40 లక్షల దాకా ఉంటుంది. హిల్స్‌లో ఆటవీశాఖ ఆధ్వర్యంలో మినీ జూపార్క్, ప్రకృతి అధ్యయన కేంద్రం, మొసళ్లపార్కు, పిల్లల ఉద్యానవనం పర్యాటకులను ముగ్ధులను చేస్తున్నాయి. అటవీ, పోలీస్, రెవెన్యూ, రైల్వే శాఖల అతిథి గృహాలు ఉన్నాయి. ఇక్కడికి రావాలనుకునే పర్యాటకులు ఆన్‌లైన్ ద్వారా టూరిజం అతిథి గృహాలు రిజర్వు చేసుకునే అవకాశం ఉంది. ఫోన్ నెంబర్లు9440272241, 08571-279323 లలో సంప్రదించి పూర్తి వివరాలను పొందవచ్చు
శేషాచలంలో జలపాతాల అందాలు
శేషాచలం అడవులు అరుదైన జంతు, వృక్షజాతులకు నిలయమే కాదు, అందమైన ప్రకృతి సౌందర్యానికి, పరవశింపజేసే జలపాతాలకు నిలయం. కనుతిప్పుకోలేని అందాలతో అలరారుతూ భక్తిభావం పెంపొందిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఎతై్తన పర్వతాల నుంచి దూకే జలపాతాలు ఇందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇందులో గుంజన, తుంబుర, రామకృష్ణ, కలివిలేటికోన, స్వామికోన, మూడేళ్లకురవ, విష్ణుగుండం, తలకోన, ఎర్రారెడ్డి గుండం, గోల్లదేవుని గుండం, సీతమ్మసెల వంటి జలపాతాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చే దేవతలు, గంధర్వులు ఈ జలపాతాల్లోనే ముందుగా స్నానమాచరించి వచ్చేవారని, ముక్తికోసం, దైవ సాక్షాత్కారం కోసం మునులు, రుషులు తపస్సు చేసే పవిత్ర జలపాతాలుగా పురాణ ప్రాశస్థ్యాన్ని కలిగివున్నాయి.
మనసుకు ఉల్లాసం...మామండూరు * ప్రకృతి ప్రియుల కేంద్రం
నిత్యం నగర జీవనంలో యంత్రాల మాదిరి పరిగెత్తి... మనశ్శాంతి లేని జీవనం సాగిస్తు వారంతపు చివర్లో కుటుంబంతో సహా ఎక్కడైన వెళ్లాలని అనుకునే వారికి మామండూరు ఒక వరం. రేణిగుంట-కోడూరు మార్గంలో జిల్లా సరిహద్దు ప్రాంతం ఈ గ్రామం. ప్రకృతి ప్రియులైన ఆంగ్లేయులు 1920లో ఇక్కడ ఈ ప్రాంతాన్ని గుర్తించారు. అప్పటి బ్రిటిష్ ఉద్యోగి కెనత్ ఆండర్సన్ రైల్వే స్టేషన్‌కు సమారు 0.5 కిలోమీటర్ దూరంలో ఒక అందమైన గుట్టను చూశారు. దీనిపై ఆయన ఈ అందమైనభవంతిని నిర్మించారు. అప్పట్నించి అది అంగ్లేయులు అందమైన విహార కేంద్రంగా పేరుగాంచింది. మామండూరు గ్రామం అటవీప్రాంతంలో ఉండడంతో ఇక్కడ గాలి, వాతావరణం అన్ని స్వచ్ఛంగా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని ఇటీవలే ఎకో టూరిజం కింద చేర్చి ఇక్కడ అనేక అభివృద్ధి పనులు చేశారు అటవిశాఖ అధికారులు. పర్యాటకుల బస కోసం ఇక్కడ పలు గుడిసెలు నిర్మించారు. ఇవి మనకు అటవీ సంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా ఉంటాయి. ఈ బంగ్లా సమీపంలో చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బంగ్లానే కాకుండా ఇక్కడికి సమీప ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి ఇటివలే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి
.
చూడదగ్గ ప్రదేశాలు
మామండూరు అటవి ప్రాంతంలో బంగ్లానే కాకుండా పలు అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో బ్రహ్మదేవుని గుండం, కల్లెటి కోన, తూంబురతీర్థం, పెద్దయేరు వంక, బావికాడలైను ఈ ప్రాంతాలు ఈ వేసవిలో బాగుంటాయి. ఇవి జలపాతాలు కావడంతో ఈ ప్రాంతం చల్లగా ఆహ్లదంగా ఉంటుంది. దీనితో పాటు చాకిరేవుబాణ, రింగురోడ్డు, బండ్లవిరుసు, అవ్వతాతగుట్టలు, స్వామిపాదాలు ఈ ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి.
మార్గాలు
తిరుపతి నుంచి కోడురూ, కడప బస్సులు ఇక్కడ మామండూరులో నిలుస్తాయి. ఇంటర్‌సీటి ప్యాసింజర్ రైళు ఇక్కడ రైల్వేస్టేషన్‌లో ఆగుతుంది. ఇక్కడ్నించి కాళినడకన ఈ బంగ్లాను చేరుకోవచ్చు.
ఎకో టూరిజంలో భాగంగా ఇక్కడ హరిణి అనే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన శాఖహార భోజనం ఇక్కడ మనకు మంచి రుచిలో లభ్యమౌతుంది. |
|
No comments:
Post a Comment