Friday, September 11, 2015

EastGodavari చూడదగు స్థలములు


EastGodavari చూడదగు స్థలములు 
పచ్చని ప్రకృతి ఒడి...మారేడుమిలి ్ల









రాజమండ్రికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది మారేడుమిల్లి. జిల్లాలో ఉన్న తూర్పు కనుమల్లోని అత్యంత ఎతై్తన ప్రాంతం. ఎకో టూరిజంలో భాగంగా వనసంరక్షణ సమితి, అటవీశాఖలు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు చేపడుతున్నాయి. అందులో భాగంగా ‘వాల్మీకి వ్యాలి వన విహారస్థలి’ పేరుతో మారేడుమిల్లి మన్యంలో చేపట్టిన ప్రాజెక్టు సందర్శకులను ఎంతో ఆకర్షిస్తోంది.

ఇందుకోసం మారేడుమిల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పర్యాటకస్థలాలుగా తీర్చిదిద్దింది. ఇక్కడకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో జలతరంగిణి జలపాతం ఉంది. ఎతై్తన కొండలమీద జాలువారే జలపాతం ఈ ప్రాంతానికో ప్రత్యేక ఆకర్షణ. ఇది కిందకు జారి సెలయేరులా ప్రవహించే దృశ్యం అపురూపంగా అనిపిస్తుంది. 
ఈ కొండప్రాంతంలోని మరో ఆకర్షణ...16మ కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార, అమృతధార అనే జంట జలపాతం. అక్కడికి వెళ్లేందుకు కిలోమీటర్లు అడవిలో నడవాలి. మారేడుమిల్లికి 10 కిలోమీటర్ల దూరంలోని మదణ్‌కుంజ్‌ పిక్నిక్‌ ప్రదేశంగా ప్రసిద్ధి. అక్కడ పైన్‌ చెట్లు ఆకాశాన్ని తాకుతున్నట్లుగాఉంటాయి.
నందనవనం
ఇక్కడ చూడదగ్గ మరోప్రదేశం పాములేరు. ఇది కూడా మారేడుమిల్లి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ ప్రవహించే పాములేరు వాగు చెంతకు అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. కార్తీకమాసంలో ఈ ప్రాంతం సందర్శకులతో కళకళలాడుతుంటుంది. ఇక్కడే జంగిల్‌స్టార్‌ నేచురల్‌ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. వేటపట్ల ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడి విశేషాలను వివరించేందుకు వనసంరక్షణసమితి సభ్యులు సిద్ధంగా ఉంటారు. ఈక్యాంపులో గడిపేందుకు 20 మందిని ఓబ్యాచ్‌గా చేసి వాళ్లకు గుడారాలు ఇస్తారు. వీటిలో ఓరాత్రి గడపవచ్చు. పర్యాటకుల కోరిక మేరకు క్యాంపు ఫైర్‌ని కూడా ఏర్పాటుచేశారు. తరువాత చూడదగ్గది నందనవనం. ఇక్కడ కాలువలమీద వెదురు వంతెనలు నిర్మించారు. పర్యాటకులు సేదతీరేందుకు వెదురు గుడిసెల్ని నిర్మించి వాటిని వెదురు ఫర్నీచర్‌తో అలంకరించారు. పుష్పాంజలి ఉద్యానవనం, కాఫీ, రబ్బరు,. మిరియాలు, కమలాతోటలు, ఔషధమొక్కలు ఈ ప్రాంతంలోని అదనపు ఆకర్షణలు. బోడికొండల దగ్గర సహససిద్ధంగా పెరిగే వాలిసుగ్రీవనం సైన్సు విద్యార్థులకు ఎంతో బాగుంటుంది. ఇక్కడ సుమారు 125 జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. అందుకే బొటానికల్‌టూర్‌కిఇక్కడకు వస్తుంటారు.
బొంగుచికెన్‌ 
వెదురు చికెన్‌కు ఈ ఏజెన్సీ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. కోడిముక్కలకు మసాలా, పచ్చిమిర్చి మిశ్రమాల్ని పట్టించి, ఒక వైపు తెరిచిన వెదురుబొంగులో ఉంచి అడ్డాకులతో మూతిని మూసి నిప్పులమీద సుమారు గంటసేపు కాల్చుతారు. ఇది రుచిలోనే కాదు,, ఆరోగ్యానికీ మంచిదట. అందుకే ఇక్కడికి వచ్చే చికెన్‌ప్రియులు దీన్ని అస్సలు మిస్‌ కారు. పర్యాటకుల కోసం డీలక్స్‌, బైసన్‌ పొదరిళ్లు, కంటైనర్‌ కాటేజీలు, ఏసీలున్న హిల్‌టాప్‌ ఇళ్లూ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గిరిజనులే గైడ్‌లు. ఆహారపు ఏర్పాట్ల నుంఖ్ద్మీ; అన్ని పనులూ చేసి పెడతారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. దాంతో ఆస్ట్రియా, ఫ్రాన్స్‌, చైనా, అమెరికాల నుంచి పర్యాటకులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఈప్రాజెక్టు కారణంగా గిరిజనులకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ లబ్ధి చేకూరుతోంది.

కోరంగి అభయారణ్యం 
జిల్లాలోని సముద్ర తీర జీవావరణ వ్యవస్థలో ఈ అభయారణ్యం ఓ ముఖ్యమైన భాగం. తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, యానాం ప్రాంతాల్లో ఉన్న ఈ అభయారణ్యంలో విస్తృతంగా మడ అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నారు.

. పాపికొండలు
అఖండ గోదావరి తూర్పు కనుమలను ఛేదించే ప్రాంతమే పాపికొండలు. దీని పేరు వినని పర్యాటకులుండరు. దట్టమైన అడవులు, గిరిజన సంస్కృతి, గోదావరి అందాలకు నెలవీప్రాంతం. పర్యాటకులకు రాజమండ్రి నుంచి విస్తృత ఏర్పాట్లు ఉన్నాయి.

కడియం
అక్షరాలా ఆరు వేల ఎకరాల వనం. నర్సరీల అందాలతో అలరారుతోంది. ఎన్నో రకాల మొక్కలు, పూలను ఇక్కడే సృష్టిస్తున్నారు. రాజమండ్రికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దిండి రిసార్ట్స్‌
గోదావరి సముద్రంలో సంగమించే సమీపంలో అందాల కోనసీమలో ఈ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేశారు. కేరళకు ఏ మాత్రం తీసిపోని అందాలు ఇక్కడ ఉన్నాయి. రాజోలు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. హౌస్‌బోట్లు అదనపు ఆకర్షణ

ఆదుర్రు బౌద్దకేంద్రం
దక్షిణ భారత దేశంలో పేరెన్నికగన్న బౌద్ధక్షేత్రం.

. రాజమండ్రి, కాకినాడ నగరాలు
ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు నెలవు. అటు గోదావరి, ఇటు సముద్ర తీర అందాలు, నగర జీవితం, పలు పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి.
.
ధవళేశ్వరం బ్యారేజీ
చూసి తీరాల్సిన కట్టడం. లక్షల ఎకరాలకు జీవధార నందించే ఈ బ్యారేజీ ఓ చారిత్రక ఆణిముత్యం. రాజమండ్రికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. 

బాలయోగి ఘాట్‌... స్టేడియం... 
అమలాపురంలో లోక్‌సభ మాజీ స్పీకరు దివంగత జి.ఎం.సి.బాలయోగి స్మృత్యర్ధం ఘాట్‌, స్టేడియంలను ప్రభుత్వం నిర్మించింది. ఈ రెండు కలిపి సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. దీంట్లో ఘాట్‌ను పార్కుగా రూపొందించి అక్కడ బాలయోగి జ్ఞాపకార్ధం ఓ స్థూపం ఏర్పాటుచేశారు. సందర్శకుల కోసం కొన్ని సౌకర్యాలు కల్పించారు. దీనిని ఆనుకునే స్టేడియం ఉంది. దీంట్లో అధునాతనమైన జిమ్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టు, స్కేటింగ్‌ రింగ్‌ ఉన్నాయి. వివిధ క్రీడలకు సంబంధించిన శిక్షణ అక్కడ ఇస్తున్నారు. జిల్లా క్రీడా సంస్థ ఆధ్వర్యంలో ఈ స్టేడియం పనిచేస్తుంది. వేసవిలో వివిధ క్రీడలలో యువతకు శిక్షణ ఇస్తూంటారు. ఇటీవలే ఈ రెండింటిని కేంద్ర మంత్రి మల్లిఖార్జునఖర్గే ప్రారంభించారు.

No comments:

Post a Comment