హైదరాబాద్ :గణేశ్ మండపాల ఏర్పాటు దరఖాస్తు ఫారాలు హైదరాబాద్ పోలీస్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అయితే, వీటితో ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. గతేడాది దరఖాస్తు చేసుకున్న ఫారాలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచారని సోమవారం ఆయన విలేకరులకు చెప్పారు.
http://www.hyderabadpolice.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లి దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు గత సంవత్సరం దరఖాస్తు చేసుకున్న అసోసియేషన్ ఫారాలు కూడా ఉంటాయి. అదే అసోసియేషన్ పేరుతో ఈ ఏడాది కూడా దరఖాస్తు చేసుకుంటే దానిని డౌన్‌లోడ్ చేసుకొని కావాల్సిన మార్పులు చేసి కూడా దరఖాస్తు చేసుకునే వీలుంది.
ఇక గ్రామాల్లో వినాయకుడు మండపాల కొరకు మండల పోలీస్ స్టేషన్ లలో ముందస్తు దరఖాస్తు చేస్కోవలెను
please click on G + button which is on top or right side on amazon ad.. for follow us
ఇక గ్రామాల్లో వినాయకుడు మండపాల కొరకు మండల పోలీస్ స్టేషన్ లలో ముందస్తు దరఖాస్తు చేస్కోవలెను
please click on G + button which is on top or right side on amazon ad.. for follow us
No comments:
Post a Comment