Thursday, September 17, 2015

ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని ప్రీమియంలో 50శాతం సబ్సిడీ అమలుచేస్తుంది....




వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పాడి పశువుల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. మూడు ఎకరాల భూమి సాగు చేసినా, రెండు పాడిగేదెలు సాదినా వచ్చే ఆదాయం ఒకేలా ఉంటుంది. పాడిపశువులకు ఒక్కోసారి రోగాలు వచ్చి మృత్యువాత పడితే నెలవారీగా వచ్చే ఆదాయం కోల్పోవడంతో పాటు ఆ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లుతుంది. అందుకే పాడిపశువులపై ఆధారపడిన రైతుల మేలుకోసం ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని ప్రీమియంలో 50శాతం సబ్సిడీ అమలుచేస్తుంది. పాడి పశువులకు బీమా చేయిస్తే పోషకులు ధీమాగా ఉండొచ్చని తెలిపారు. పాడి పశువులు, మేలుజాతి ఆవు దూడలకు బీమా పథకాల గురించి ఆయన వివరించారు. 

సునందిని పథకం..


* కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన ఆడ దూడలకు సునందిని పథకం కింద దాణా సరఫరాతో పాటు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. 3 నుంచి 4 నెలల వయసున్న దూడలకు ఈ పథకం వర్తిస్తుంది.
* రూ.5250 విలువ గల 300కిలోల దాణా 50శాతం రాయితీ కింద అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75శాతం రాయితీ కింద ఏడాది పాటు అందిస్తారు. ఇందులో భాగంగానే దూడతో పాటు పోషకుడికి రూ. 650 ప్రీమియం కలిగిన బీమా ఉచితంగా వర్తింపజేస్తారు. దూడ మృతి చెందితే దాని వయస్సును బట్టి నిర్ధేశిత మొత్తాన్ని అందిస్తారు. 
* పోషకుడు మూడేళ్లలోపు ప్రమాదానికి గురై మరణిస్తే రూ.లక్ష వరకు చెల్లిస్తారు. హెల్త్‌కేర్ కింద రూ. వంద విలువ గల నట్టల నివారణ, బలం మందులను దూడలకు అందిస్తారు.
* బీమా సౌకర్యం దూడ 32నెలల వయసు లేదా అది తొలిసారి ఈనిన సమయం ఏది ముందు అయితే అంత వరకు వర్తిస్తుంది. 

* పశుసంవర్థకశాఖ పాడి పశువులకు ఏడాది లేదా మూడేళ్ల కాలపరిమితి 
బీమా పథకాలను అమలు చేస్తున్నది.
* రూ. 10వేల నుంచి రూ.60వేల విలువ గల పశువులకు బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నది.
* పశువుల ధర, ఏడాది కాలానికి, మూడేళ్ల కాల పరిమితికి రైతులు ప్రీమియం చెల్లించి నష్టం జరిగినప్పుడు లబ్ధి పొందవచ్చును.

Cattle insurance

No comments:

Post a Comment