Friday, September 11, 2015

Mahabubnagar చూడదగు స్థలములు...


Mahabubnagar చూడదగు స్థలములు  
గద్వాల కోట
 
జి ల్లాలోని వివిధ సంస్థానాల్లో గద్వాల సంస్థానానికి ఎంతో ప్రాముఖ్యత, చరిత్ర ఉంది. ఈ సంస్థానం వైశాల్యం 1200చదరపు మైళ్లు, కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని నడిగడ్డ అని పిలుస్తుంటారు.పెద్ద సోమభూమ భూపాలుడు (సోమనాద్రి) గద్వాల కోటను నిర్మించారు. 17వ శతాబ్దంలో కొంతపాడు గ్రామ నివాసి పెద్దారెడ్డి కర్నూలు మండలానికి నాడేడౌడ్‌గా ఉండేవాడు. ఇతడు పూడూరు నాడేడౌడ్‌ వీరారెడ్డి కుమార్తె బెక్కమాంబను వివాహం చేసుకున్నాడు. వీరికి పెద్దసోమభూపాలుడు జన్మించాడు. ఇతడినే సోమనాద్రి అని పిలిచేవారు. 1663 నుంచి 1712 వరకు 49 సంవత్సరాలు ఈయన యోధునిగా, పరిపాలకునిగా, కవిగా ప్రసిద్దిచెందాడు. సోమనాద్రికి ఇద్దరు భార్యలు అమ్మక్క, రెండవ భార్య లింగమ్మ. మొదటి భార్యకు సంతానంలేదు. రెండవ భార్య లింగమ్మకు ఇద్దరు కుమారులు. రాజా రామభూపాలుడు, రాజా తిరుమల్‌రావు. సోమనాద్రి తన 49ఏళ్ల పాలనలో అత్యంత ధైర్యసాహసాలతో అనేక కార్యాలు నిర్వహించాడు. అందులో భాగంగా పూడూరు కోటకు మరమ్మత్తులు చేయించాడు. కోట మరమ్మత్తు సమయంలో దొరికిన నిక్షేపంతో శత్రువులకు అభేద్యంగా ఉండేలా గద్వాల కోటను నిర్మించాడు. అందులోనే చెన్నకేశవస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. అనంతరం రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. గద్వాల సంస్థానాన్ని పాలిస్తూనే నంద్యాల, సిరిగొప్ప, సిద్దాపురం, అహోబిలం, సిరివెల్ల, బండి ఆత్మకూర్‌ ప్రాంతాల వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. 1709లో కందవోలు నవాబును ఓడించి ఆయన సామ్రాజ్యాన్ని, అతి పొడవైన 32 అడుగుల ఫిరంగిని గద్వాలకు తరలించాడు. ఆ సమయంలోనే ఔరంగజేబు బీజాపూర్‌ రాజధానిని జయించాడు. ఆయనకు సోమనాద్రి సహకారం అందించాడు. దీనికి ప్రతిఫలంగా ఔరంగజేబు సోమనాద్రికి ‘రాజా’ అనే బిరుదుతోపాటు కర్నూల్‌ సీమలోని ఆరు మహలులపై సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఔరంగజేబు మరణానంతరం మొగల్‌ సింహాసనాన్ని బహుదూర్‌షా అధిష్టించాడు. ఇతడు చాలా బలహీనంగా ఉండటంతో దక్కన్‌ ప్రాంతపు సుబేదార్‌ నిజాముల్‌ ముల్క్‌ తనకు తానుగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. 1709 నుంచి 1712 వరకు కర్నూలు దుర్గం సోమనాద్రి అధీనంలో ఉండేది. దీన్ని కూడా స్వాధీన పరుచుకోవాలనే ఉద్దేశ్యంతో నిజాముల్‌ ముల్క్‌ తన సేనాని దిలీప్‌ఖాన్‌ను యుద్దానికి పంపాడు. సోమనాద్రి, దిలీప్‌ఖాన్‌కు కర్నూల్‌ సమీపంలోని నిడుదూరు దగ్గర యుద్దం జరిగింది. ఈ యుద్దంలో సోమనాద్రి మరణించాడు. ఆయన మరణానంతరం భార్య లింగమ్మ పాలన కొనసాగించారు. ఇలా వారి వంశపారపర్యంగా పాలన కొనసాగింది. 1924లో భర్త మహారాజ సీతారాంభూపాల్‌ బహద్దూర్‌ మరణానంతరం భార్య ఆదిలక్ష్మి దేవమ్మ పాలనాబాధ్యతలు చేపట్టారు. అయితే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. నిజాం సంస్థానం భారత యూనియన్‌లో 1948 సెప్టెంబర్‌ 17న విలీనమై, మేజర్‌ జనరల్‌ జయంతినాథ్‌ చౌదరి సైనిక పాలన ఏర్పడింది. 1949లో జాగీర్ధార్ల పాలన రద్దయ్యింది. జాగీర్దార్లందరికీ రాజాభరణాలిచ్చి ఆయా సంస్థానాలను హైదరాబాద్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1663లో పెద్ద సోమభూపాలుడు (సోమనాద్రి) పాలనతో మొదలైన గద్వాల సంస్థానం 1949లో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ పాలనతో ముగిసింది. అంటే గద్వాల సంస్థానానికి సుమారు 286 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. వీరి హయాంలో కవులు, కళాకారులు, పండితులకు విశేష ఆదరణ లభించింది. ప్రతి ఏటా వీరికి ఘనంగా సన్మానాలు జరిగేవి. అందువల్ల గద్వాల సంస్థానానికి ‘విద్వత్‌ గద్వాల’ అనే కీర్తి ప్రతిష్ఠ లభించాయి.
గద్వాలకు ఆపేరెలా వచ్చిందంటే... 
గద్వాల సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. వీరు చెన్నకేశవస్వామిని ఆరాధించేవారు. పూడూరును చాళుక్యులు పాలిస్తుండేవారు. చాళుక్యులు, పల్లవులకు భీకర యుద్దం జరిగింది. ఈ యుద్దంలో సోమనాద్రి వీరచితంగా పోరాడాడు. యుద్దలో ఆయన ఒక గధ, వాలము అనే ఆయుధాలను ప్రయోగించాడు. అందుకే ఆయన నిర్మించిన కోటకు గదవాల... కాలక్రమంలో గద్వాల అనే పేరు వచ్చినట్లు పెద్దలు చెప్పుకుంటుంటారు.


కోయిల్‌సాగర్‌
పా లమూరు పట్టణ ప్రజలకు, దేవరకద్ర, నారయణపేట నియేజకవర్గాల్లోని 50వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. మహబూబ్‌నగర్‌జిల్లా దేవరకద్ర మండలంలోని ఈప్రాజెక్టు చుట్టూఉన్న ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.హైదరాబాద్‌ నుంచి 135కిలో మీటర్లు, జిల్లా కేంద్రం నుంచి 34 కిలో మీటర్లు దూరంలో ఉన్న కోయిల్‌సాగర్‌ చేరుకునేందుకు దేవరకద్ర వరకు రైలు, బస్సుసౌకర్యలు ఉన్నయి. దేవరకద్ర నుంచి 12 కీలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రైవేటు వాహనాల్లో ప్రాజెక్టు వద్దకు చేరుకోవచ్చు.
చి ప్రత్యేకత: ఆనకట్ట పోడవు 1036 మీటర్లు, ఈ డ్యాం ఎత్తు 27-28 మీటర్లు కలిగి ఉంది. ఇక్కడ ఉన్న అతిథి గృహం , గుట్టల మధ్య జలసవ్వడి , ప్ర¾కృతి అందాలు, మత్స్యపరిశ్రమలో విత్తన ఉత్పత్తి కోసం ఉంచిన వివిధ రకాల చేపలు, తామర అందాలు పర్యటకుల మదిని దోచుకుంటాయి.
ప్రాజెక్టుకు ఎడమ వైపున అభయ అంజనేయస్వామి ఆలయం. అక్కడి నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నరాజమూర్‌లో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి (రాజామూరయ్య)ఆలయం పర్యటకులను ఆకర్షిస్తోంది.

కొల్లాపూర్‌ సురభి సంస్థానం
క్రీ. శ. 9వ శతాబ్ధం నుంచి క్రీ.శ. 20వ శతాబ్ధం వరకు సురభి సంస్థానాదీశుల పరిపాలన సాగింది. మొదటగా జటప్రోలు సంస్థానంగా తర్వాత కొల్లాపూర్‌ను సంస్థానంగా చేసుకొని పరిపాలన చేశారు. ఒకవైపు కృష్ణానది, మరోవైపు నల్లమల అటవీ ప్రాంతం హద్దులుగా ఉన్నాయి. నిజాం నవాబు కింద సామంత రాజులుగా కొనసాగారు. వీరి హయాంలో శైవ, వైష్ణవ క్షేత్రాలను విరివిగా నిర్మించారు. మాధవనాయుడి పరిపాలనలో జటప్రోలులో నాయుడిపేట, మదనగోపాలస్వామి, మంచాలకట్టలో మాధవస్వామిదేవాలయం, సింగోటంలో శ్రీవారి సముద్రం చెరువు, మూకగుళ్లను నిర్మించారు. వెంకటకృష్ణారావు పరిపాలనలో మొట్టమొదటి సౌత్‌ఇండియన్‌ ఏరోప్లేన్‌ కొల్లాపూర్‌లో నడిపారు. మద్రాస్‌ నుంచి బెంగళూర్‌కు ఎయిర్‌ట్యాక్స్‌ విమానం నడిపారు. నేటికీ కొల్లాపూర్‌ కోట భవనంలో ఆనాడు వాడిన వస్తువులు చెక్కుచెదరలేదు. రాజులు వేటాడిన జంతువుల తలలు, చర్మాలు కోట భవనంలో భద్రపరిచారు. రాజావెంకట లక్ష్మారావు చిత్రపటం ఆకర్షణీయంగా ఉంది. వీరి హయాంలో మామిడితోటల సాగు చేశారు. 1945లో వెంకటజగన్నాథరావు కొల్లాపూర్‌ సంస్థానాన్ని భారతప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రస్తుతం వారి కుమారుడు రాజా ఆదిత్యావెంకట లక్ష్మారావు ఆలయాలన్నింటికీË వంశపారంపర్య ధర్మకర్తగా కొనసాగుతున్నారు.

పర్యాటక కేంద్రం పిల్లలమర్రి
జి ల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది పిల్లలమర్రి. పట్టణ ప్రజలకు.. విద్యార్థులకు విహార కేంద్రంగా విరాజిల్లుతోంది. పిల్లల మర్రికి దాదాపు 700 ఏళ్ల చరిత్ర ఉంది. 5 ఎకరాల విస్తీర్ణంలో మొదలెక్కడో.. కొమ్మెక్కడో తెలియకుండా ఓ.. మహావృక్షంగా ఏర్పడింది. ఈ మర్రిచెట్టుఇక్కడ మొలవడానికి రెండు కారణాలు ఉన్నాయి. గతంలో ఆశన్న (హసన్‌), వూశన్న (హుసెన్‌) అనబడే ఇద్దరు అన్నదమ్ములు అటవీ ప్రాంతంలో మర్రివిత్తనం నాటారని, ఆ విత్తనమే పెరిగి పెద్దదై ఇలా వృద్ది చెందిందని ప్రచారంలో ఉంది. ఈ చెట్టునీడలోనే గతంలో పెద్దఎత్తున పీర్ల పండుగ నిర్వహించేవారట. హసన్‌, వూసెన్‌ మరణానంతరం వారి మృతదేహాలు ఈ మర్రిచెట్టు క్రింద సమాధి చేశారని మరోచరిత్ర కూడా ప్రచారంలో ఉంది. గతంలో ఈ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం, ఇక్కడే గిరిజనులు స్థానం ఏర్పరుచుకోవడం. వాళ్ల పిల్లలు మర్రిచెట్టు క్రింద ఆటలాడుతూ వూయలలూగుతూ వచ్చారు. పిల్లలు చేరడం మొదలు పెట్టడంతో పిల్లలమర్రిగా ఈ చెట్టు ప్రసిద్ది చెందింది. పర్యటక కేంద్రంగా.. : పురావస్థుశాఖ, అటవీశాఖ అధికారులు పిల్లలమర్రిని 1976లో తమ పరిధిలోకి తీసుకున్నారు. అప్పటి జిల్లా కలెక్టర్‌ కాశీపాండ్యన్‌ పిల్లలమర్రిని పరిశీలించి ఈ ప్రాంతాన్ని విహార కేంద్రంగా అభివృధ్ధిచేశారు. పురావస్తుశాఖ మ్యూజియం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో 16వ శతాబ్దపునాటి శిలావిగ్రహాలు ఉన్నాయి. 1983లోకంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఇక్కడ రాజరాజేశ్వరీదేవి ఆలయం కూడా నిర్మించి అందులో కృష్ణాతీరంలో నీట మునిగిన అమ్మవారిని ప్రతిష్టించారు.

పేదల తిరుపతి మన్యంకొండ
తీ రితే తిరుపతి.. లేకుంటే మన్యంకొండ అనే నానుడి వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో ఎప్పటినుంచో వాడుకలో ఉంది. జిల్లాలోనే మన్యంకొండ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ప్రత్యేకత ఉంది. జిల్లాకేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో రాయిచూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై ఈ మన్యంకొండ తిరుమల ఏడుకొండల గిరులను తలపించేదిగా ఉంది. దాదాపు 900 ఏళ్లకిందట అలహరి రామయ్య పూర్వీకులు కొండల మద్య వేంకటేశ్వరస్వామి ఆనవాళ్లు కనుగొని కొండ గుహల మద్య వేంకటేశ్వరుని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. కాలక్రమేణ దేవస్థానం మన్యంకొండగా రూపాంతరం చెంది భక్తుల పూజలు అందుకుంటూ ప్రసిద్ధిచెందింది.ఆదాయం కోటిపైనే.. 
మన్యంకొండ దేవస్థానానికి ఏటా భక్తుల నుంచి రూ.1.50 కోట్ల ఆదాయం వస్తుంది. ఇదంతా కేవలం హుండీ ఆదాయమే. ఖర్చులు.. దేవస్థానం సిబ్బంది జీతభత్యాలు పోను ఇంకా రూ.60 లక్షల వరకూ ఏటా మిగులతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని 700 గ్రాముల బంగారం, 80 కిలోల వెండితో అలంకరిస్తారు
స్థిరాస్థులు : మన్యంకొండ దేవస్థానానికి భక్తుల నుంచి వచ్చే ఆదాయంతో పాటు స్థిరాస్థులు కూడా ఉన్నాయి. దాదాపు 300 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. దాదాపు 200 ఎకరాల వరకు మన్యంకొండ చుట్టుపక్కలే భూములు ఉన్నాయి. మిగతా భూములు చౌదర్‌పల్లి, బస్వాయిపల్లి, డోకూరు, మాచన్‌పల్లి, ఒబులాయపల్లి, గద్దెగూడెం, కోటకదిర గ్రామాల్లో ఉన్నాయి.


సుందర దృశ్యాలు.. నల్లమల అందాలు
న ల్లమల అటవీ ప్రాంతంలో కమనీయ దృశ్యాలు, ఆధ్యాత్మిక ఆలయాలకు కొదువ లేదు. అచ్చంపేట నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న శైవక్షేత్రం ఉమామహేశ్వరం, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. అచ్చంపేటకు 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో సహజ సిద్దంగా ఏర్పడిన పర్హాబాద్‌ వ్యూపాయింట్‌ నుంచి నల్లమల సుందర దృశ్యాలు వీక్షకులను మధురమైన అనుభూతులకు గురిచేస్తాయి. శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న మన్ననూరులో ఏర్పాటు చేసిన మ్యూజియంలో చెంచుల జీవన శైలి, వన్యమృగాల ఆకృతులు కళ్లకు కట్టేలా చూపించారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల మధ్య చెంచుల జీవనం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడకపోయినా ఈ మ్యూజియాన్ని సందర్శిస్తే ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

మల్లెల తీర్థం
అ మ్రాబాద్‌ మండలం మల్లెల తీర్థం క్షేత్రం ప్రకృతి రమణీయంగా ఉంటుంది. 300 అడుగుల ఎత్తయిన కొండపై నుంచి జలపాతం ఎగసి పడుతుంటుంది. అచ్చంపేట నుంచి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వటవర్లపల్లి నుంచి లోపలికి కుడిచింతల బయలు గ్రామం వరకు వెళ్లాలి. శ్రీశైలం రహదారిపై ఉండటంతో రోజూ భక్తులు తరలి వస్తారు. తొలి ఏకాదశి, మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ బస చేసేందుకు వసతులు లేవు. అచ్చంపేట నుంచి ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం ఉంది. శ్రీశైలం వెళ్లే బస్సుల్లో వెళ్లి వటవర్లపల్లిలో దిగి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో అక్కడికి వెళ్లవచ్చు.
లములు

No comments:

Post a Comment