Saturday, September 26, 2015

నేటి గ్లోబలైజేషన్ యుగంలో ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలంటే సబ్జెక్ట్

నేటి గ్లోబలైజేషన్ యుగంలో ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలంటే సబ్జెక్ట్

నాలెడ్జ్‌తోపాటు వాటిని వ్యక్తీకరించగలిగే కమ్యూనికేటివ్ స్కిల్స్ తప్పనిసరి. ఒక భాషా శాస్త్రవేత్త చెప్పినట్లు Communication is the life blood of all the organizations అనే విషయాన్ని మరచిపోకూడదు. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్ పోటీని తట్టుకొని నిలబడాలంటే language Skills పట్ల స్పష్టమైన అవగాహన, పట్టు అవసరం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దాదాపు అన్ని రకాల గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ కూడా తప్పనిసరి చేశారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల భావ ప్రసరణ నైపుణ్యాలను ఎంత సులభంగా స్పష్టంగా విషయాలను తెలియచేయగలరో అంచనా వేస్తారు. కనుక నిత్యజీవితంలోనూ, వృత్తిపరమైన జీవితంలోనూ అవసరమైన ఒక విడదీయరాని భాగమైన కమ్యూనికేటివ్ స్కిల్స్ (భావ ప్రసరణ నైపుణ్యాలు) ప్రాధాన్యత మరింత సందర్భోచితం. ఈ క్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్‌కు సంబంధించిన ప్రాథమిక భావనలను అర్థం చేసుకుందాం.

కమ్యూనికేషన్ అంటే..?

నాగరికత ప్రారంభమైన నాటినుంచి నేటివరకు మానవ జీవితంలో అంతర్భాగంగా కమ్యూనికేషన్ (సమాచార ప్రసరణ) కొనసాగుతోంది. ఒక వ్యక్తిలోని ఆలోచనలు, అభిప్రాయాలు, కోరికలు, అమూర్త భావాలను ఇతరులకు శాబ్ధిక (Verbal), అశాబ్ధిక (Non-Verbal) రూపంలో చేరవేసే ప్రక్రియనే కమ్యూనికేషన్ అనవచ్చు. Sender (సమాచారాన్ని ఇచ్చేవాడు), Receiver (సమాచారాన్ని గ్రహించేవాడు) మధ్య అర్థవంతమైన ఆలోచనల పరస్ఫర చర్యనే మనం స్థూలంగా సమాచార ప్రసరణగా అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఇంట్లో, ఆఫీసులో, విద్యా సంస్థల్లో విషయ మార్పిడి చేస్తూనే ఉంటాం. అయితే మనం చేసే Communication ఎంత Effectiveగా ఉంటే అంత ఎక్కువ మందికి విషయాన్ని అర్ధం చేయించగలం, వారి నుంచి సహకారం పొందగలం, ఎంత విజ్ఞాన సంపత్తి మన మెదడులో ఉన్నప్పటికీ సరైన విధంగా ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయగల Effective Communicative tools లేనట్లయితే మన విజ్ఞానం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
జార్జ్ టీ వర్ధమాన్ అనే అంతర్జాతీయ కమ్యూనికేటివ్ ట్రైనర్ ప్రకారం కమ్యూనికేషన్స్ అంటే Effective communication is purposive sym-bolic interchange resulting in workable Understanding and agreement between the sender and the receiver.
వాస్తవానికి కమ్యూనికేషన్ అనే పదం కమ్యూనికేర్ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనికేర్ అంటే To Share (పంచడం), To import (అందించడం), To commune (తెలియచేయడం) అని అర్థం. భారతీయ సామాజిక జీవన విధానంలో విషయాన్ని పదిమందికి తెలపడమనేది తరతరాలుగా కొనసాగుతున్నది. కానీ నేటి యువత పట్టాలకు ఇస్తున్న ప్రాధాన్యం భావప్రసరణ నైపుణ్యాలకు ఇవ్వడం లేదు. మన భావాలను సరైన రీతిలో ఇతరులకు తెలియపరచగలిగినప్పుడే విజయపథంలో దూసుకుపోగలం.

కమ్యూనికేషన్ దశలు 
సాధారణంగా సమాచార ప్రసరణలో ఐదు ముఖ్యమైన దశలున్నాయి. అవి ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగిఉంటాయి. అవి..

Ideation
ఈ దశలో కావాల్సిన ఆలోచనలను (Ideas)ను ఏర్పరచుకోవడం, వాటిని సరైన రీతిలో సెలక్ట్ చేయడం వంటివి జరుగుతాయి. ఏరకమైన విషయాన్ని Present చెయ్యాలో చేసే దశ. సమాచారాన్ని పంపేవారి Knowledge, అనుభవాలు, శక్తి సామర్ధ్యాలు ఈ దశలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.

Encoding
ఇది అవసరమైన సమాచారాన్ని అవసరమైన రీతిలో Logical and coded రూపంలోకి మార్చే దశ. సమాచారాన్ని Encode చేసేటప్పుడు Sender, Receiver మధ్యఉన్న భౌతిక సంబంధం ముఖ్యమైన అంశం. సాధారణంగా మాతృభాషలో (First Language) సంభాషణ Informalగానూ, వాడుక పదాలతో నిండి ఉంటుంది. వివిధ రకాల అకడమిక్ పరమైన, వ్యాపార పరమైన సన్నివేశాలలో మర్యాదపూర్వక భాష ( Formal Language)ను ఉపయోగించడం అవసరం. ఉదాహరణకు హిందీ అర్థం చేసుకోలేని వారికి హిందీలో సమాచారం పంపడం వల్ల దాన్ని అర్ధం చేసుకోవడానికి సమయం పడుతుంది. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది.

Transmission 
ఇది 3 ముఖ్యమైన విషయాలను సూచిస్తుంది. అవి..
1. Proper Time (when to communicate)..
2. Proper Place (where to communicate)
3. Proper way (How to communicate)
ఉదాహరణకు ఆఫీస్‌లో బాస్ చెప్పిన విషయం సరిగ్గా అర్ధంకానప్పుడు దానిని ఒక Doubtగా ఉంచుకోవడంకంటే పై 3 రకాల సందర్భాలను బట్టి నివృత్తి చేసుకోవడం ద్వారా సరైన రీతిలో ప్రతిస్పందించవచ్చు.

Decoding
గ్రహించిన సమాచారాన్ని ఆలోచనల రూపంలోకి మార్చిన తర్వాత Receiver అర్ధం చేసుకొనే దశ. గ్రహించిన సమాచారాన్ని అర్ధం చేసుకోవడం, అనుసంధానించడం, విశ్లేషించడం అనేవి ఈ దశలోని ఉపభాగాలుగా ఉంటాయి. అయితే మౌఖిక సమాచారం (Oral Communication..) లో Listening and Understanding (వినడం, అర్ధ చేసుకోవడం) ప్రధాన భాగాలుగా ఉంటే, Written communicationలో Reading and Understanding (చదవడం, అర్ధం చేసుకోవడం) ప్రధాన అంశాలు.

Feedback
ఇది కమ్యూనికేషన్ ప్రక్రియలో చివరి దశ. సమాచారాన్ని గ్రహించిన వారి చర్య, ప్రతి చర్యలు (Action and Reaction) గ్రమించిన సమాచారం ఆధారంగా Sender తెలుసుకుంటాడు. అంటే Information Senderకు ఒక Responseలాగా ఉపయోగపడుతుంది. Sen-der తాను పంపిన సమాచారం ఎంతమేరకు Receiverకు అర్ధమయ్యిందో తెలుసుకోవడం ద్వారా తన లోటుపాట్లను గ్రహించవచ్చు.

కమ్యూనికేషన్ పద్ధతులు
ఒక వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారాన్ని పంపే పద్ధతులు

Down ward communication
ఏదైనా ఒక విషయాన్ని ఒక క్రమ నిచ్చెన మెట్ల (Hierarchy) పద్ధతిలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు చేరవేయడం. ముఖ్యంగా బ్యూరోక్రసిలోనూ, వివిధ సంస్థల్లోనూ ఈ రకమైన సమాచార ప్రసారాన్ని గమనించవచ్చు. ఉదా: ఒక కంపెనీ జనరల్ మేనేజర్ తన కింది స్థాయి బ్రాంచి మేనేజర్లకు విషయాన్ని పంపించడం. వివిధ రకాలైన Notes, notices, memos టెలిఫోన్ సంభాషణలు, E-mail లాంటివి.

Upward communication
ఇది కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారులకు చేరవేసే కమ్యూనికేషన్. వివిధ విషయాలకు సంబంధించిన Feedbackను పై స్థాయి వారికి అందచేస్తారు. 
ఉదా: వివిధ రకాల Proposals పంపడం, సలహాల బాక్స్, ఫిర్యాదులు స్వీకరించడం లాంటివి.

Horizontal communication
ఒక సంస్థకు సంబంధించిన Work Cultureకు చెందిన విషయం. Team work, Group coordinationకు సంబంధించిన విషయాలను గురించి తెలుపుంది. ఒక స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తుల మధ్య ఈ రకమైన కమ్యూనికేషన్ జరుగుతుంది.

Diagonal communication
ఇది ఆధునిక శాస్త్ర సాంకేతికత, నిర్వహణకు సంబంధించిన అంశాలపై దృష్టిపెడుతుంది. ప్రధానంగా మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీసుకరావాల్సిన మార్పులకు సంబంధించిన అంశాలను ఇది వివరిస్తుంది.
ఇవి మౌఖిక భావనలు ప్రాథమిక అంశాలుగా కమ్యూనికేషన్ సిస్టంలో ఉంటాయి. సరైన వైఖరుల్ని అభివృద్ధి చేసేదిగా కమ్యూనికేషన్ ఉండాల్సిన అవరసరం ఉంది.

ఇండియా గురించి మనకెంత తెలుసు...?


ఇండియా గురించి మనకెంత తెలుసు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన మాతృదేశం ఘనత ఎటువంటిదో తెలుసా? భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి. వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ నిజాలు మీకోసం...
1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.
2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.
3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.
4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.
5. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు.
6. భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు.
7. మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది.
8. యూఎస్, జపాన్ ల తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే.
9. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఓట్లు వేసిన వారి సంఖ్య 54 కోట్లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మొత్తం జనాభా కన్నా ఇదే అధికం.
10. మరో ఏడాది నాటికి ప్రపంచంలోని కార్మిక శక్తిలో 25 శాతం ఇండియా నుంచే వెళుతుందని అంచనా.
11. జాతీయ క్రీడ అంటూలేని దేశాల్లో ఇండియా ఒకటి
12. ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.
13. అన్ని యూరోపియల్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే.
14. ప్రపంచ తొలి యూనివర్శిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి 10,500 మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి.
15. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.
16. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు.
17. వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.
18. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది.
19. ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియానే.
20. 1990లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది. ఆ దేశాల్లో ఉన్న సుమారు 1.7 లక్షల మందిని 488 ఎయిర్ ఇండియా విమానాలు 59 రోజులు శ్రమించి దేశం దాటించాయి.
21. ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి దళాల్లో అత్యధికులు భారతీయులే.
22. గడచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశంపైనా దాడి చేయలేదు.
23. 1896 వరకూ ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి.
24. చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే.
25. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు.
26. ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే.
27. ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా, అవి ప్రయాణించే దూరం చంద్రడికి, భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం.
28. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే.
29. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.
30. ఇసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయాలో ఉంది. దాని పేరు మౌలినాంగ్. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతమూ మేఘాలయాలో ఉంది. అదే చిరపుంజి. ఇక్కడ ప్రతియేటా సరాసరిన 467 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.
31. అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు.
32. పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది.
33. సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.
34. ఆల్ జీబ్రా, త్రికోణమితిలను ప్రపంచానికి అందించింది ఇండియానే.
35. మానవ చరిత్రలో తొలి వైద్య విధానం 'ఆయుర్వేద'ను అందించింది ఇండియానే.
ఇవే కాదు, ఇంకెన్నో ఘనతలను ఇండియా సాధించింది, సాధిస్తూ ఉంది

NEW GOVERNMENT JOBS IN TELANGANA

తెలంగాణ స్టేట్ నార్తర్న్‌ పవర్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ లిమిటెడ్‌లో 164 ఖాళీలు


పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 164
విభాగాలు: ఎలక్ట్రికల్-159, సివిల్ -03, సీఎస్‌/ ఐటీ-02.
అర్హతలు: బీఈ/ బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ సివిల్/ సీఎస్‌/ఐటీ).
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబ‌ర్ 29.
చివరితేది: అక్టోబరు 15.
రాత పరీక్ష తేది: నవంబరు 8.


తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్‌లో(జెన్‌కో) 856 ఖాళీలు
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 856
విభాగాలు: ఎలక్ట్రికల్ 419, మెకానికల్ 195, ఎలక్ట్రానిక్స్ 70, సివిల్ 172.
అర్హతలు: ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబరు 8
చివరితేది: అక్టోబరు 28
రాత పరీక్ష తేది: నవంబరు 14


తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్‌లో(ట్రాన్స్‌కో) 206 ఖాళీలు
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 206
విభాగాలు: ఎలక్ట్రికల్ 184, సివిల్ 22.
అర్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు చెల్లింపు ప్రారంభం: అక్టోబరు 5
రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబరు 6
చివరితేది: అక్టోబరు 26
రాత పరీక్ష తేది: నవంబరు 29


ఈఎస్‌ఐసీలో ఖాళీలు
-హైదరాబాద్ నాచారంలోని ఈఎస్‌ఐసీ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్/ హాస్పిటల్‌లో కింది ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
-పీడబ్ల్యూడీల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా వీటిని భర్తీ చేస్తున్నారు.
-పోస్టు: నర్సింగ్ ఆర్డర్లీ 
-పే బ్యాండ్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1800
-మొత్తం ఖాళీలు - 5. వీటిలో హెచ్‌హెచ్ -2, వీహెచ్ - 3 కేటగిరీలకు కేటాయించారు. పై కేటగిరీ అభ్యర్థులు లభించని పక్షంలో వేరే కేటగిరీ వికలాంగ అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
-ఇతర కేటగిరీ వికలాంగ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: సైట్ చూడవచ్చు
-చివరితేదీ: అక్టోబర్ 31





Friday, September 25, 2015

నవ్వకుండా ఉండగలర ఛాలెంజ్


మన రాజకీయ నాయకుడొకాయన ఓ సారి అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఓ రాజకీయ నాయకుడు అతన్ని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. మన నాయకుడు ఆయనకున్న విశాలమైన భవనాలు, ఇంటి ముందు కావాల్సినంత ఖాళీ స్థలం, ఖరీదైనా ఫర్నీచర్ అన్నీ చూసి ముచ్చట పడి…
“మీ కొచ్చే కొద్దిపాటి జీతాలతో ఇంత ఇంటిని, వస్తువులను ఎలా సంపాదించగలిగారు” అని అడిగాడు.
దానికి ఆ సెనేటర్ నెమ్మదిగా నవ్వి అతన్ని కిటికీ దగ్గరికి తీసుకెళ్ళాడు.
“అదిగో ఆ నది కనిపిస్తోందా?”
“కనిపిస్తోంది”
“దాని మీద వంతెన కనిపిస్తోందా?”
“కనిపిస్తోంది”
“10%” అన్నాడు.
మన నాయకుడు అర్థమైందన్నట్లుగా నెమ్మదిగా తల పంకించాడు.
తర్వాత కొద్ది రోజులకు సదరు అమెరికన్ సెనేటర్ భారత్ కు వేంచేశాడు. అతన్ని మన నాయకుడు తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు.
సెనేటర్ కి మన నాయకుడు ఇల్లు చూడగానే మతిపోయినంత పనైంది. రాజభవనాన్ని తలదన్నే ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన సామాగ్రి, నౌకర్లు, కార్లు…
ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు.
“మీకొచ్చే రూపాయల్లో జీతంతో ఇదెలా సాధ్యం?” అని ప్రశ్నించాడా సెనేటర్.
మన నాయకుడు అతన్ని కిటికీ దగ్గరకు తీసుకెళ్ళి
“అక్కడ నది కనిపిస్తోందా?”
“కనిపిస్తోంది”
“దాని మీద వంతెన కనిపిస్తోందా?”
“అదేంటి అక్కెడ వంతెనే లేదు కదా!!!”
“100%” అన్నాడు నెమ్మదిగా…
ఇప్పుడు దిమ్మతిరగడం సెనేటర్ వంతైంది

శని త్రయోదశి ప్రాముఖ్యత


నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.
జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.
బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాధిపతి లా శని దండన విధిస్తాడు.
శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.
క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది.
ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.
ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లబిస్తుంది.
ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అవి :
నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం
,
శనిత్రయోదశి రోజున
ఉపవాసం ఉండడం
రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం
,
నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం.
నల్ల కాకికి అన్నం పెట్టడం
నల్ల కుక్కకి అన్నం పెట్టడం
నల్లని గొడుగు
నల్లని వస్త్రాలు
తోలు వస్తువులు
నవధాన్యాలు
,
ఇనుము దానం చేయడం.
శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం
,
రవిపుత్రం యమాగ్రజం
,
ఛాయా మార్తాండ సంభూతం
,
తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
ఎవరివద్దనుండి ఇనుము
,
ఉప్పు
,
నువ్వులు
,
నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి
మద్యమాంసాదులను ముట్టరాదు.
వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము.


శనీశ్వర గాయత్రి:
“ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్‌”
(శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను)
ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.
శని మహత్యం:
శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు.
చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి.
శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు.
శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు.
తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

Tuesday, September 22, 2015

TSPSC 3,896 కొత్త పోస్టులు

IR



త్వరలో నాలుగువేలకు పైగా పోస్టుల భర్తీ
-ఐఆర్ బెటాలియన్లలో 3896 పోస్టులు
- గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆర్థిక శాఖ
- టీఎస్‌పీఎస్సీ ద్వారా మరో 283 
- నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
-నవంబర్‌లో పరీక్షలు.
ప్రత్యేక పోలీస్ బెటాలియన్ల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించిన పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అలాగే టీఎస్‌పీఎస్సీ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలలో మరో 283 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తంగా నాలుగువేల మందికి పైగా నిరుద్యోగులకు త్వరలోనే ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటుకానున్న నాలుగు ఇండియన్ రిజర్వు బెటాలియన్ (టీఎస్‌ఎస్పీ)లలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


TSPSCLOGO


ఫలితంగా 3,896 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఈ నాలుగు బెటాలియన్లలో పోలీస్ కానిస్టేబుళ్లతోపాటు సంబంధిత పోస్టుల నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరుద్యోగ యువతకు తీపి కబురు అందిస్తూ నియామకాలకు సంబంధించి ఫైలుకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు నాలుగు బెటాలియన్లలో 3,896 కొత్త పోస్టులను సృష్టించడంతో పాటు నియామకాలను చేపట్టాలని పేర్కొంది. ఒక్కో బెటాలియన్‌లో 974 పోస్టులుంటాయి. 



వీటిలో కొన్ని ప్రమోషన్ల ద్వారా భర్తీ కానుండగా, మరికొన్ని నియామక ప్రక్రియ ద్వారా పూర్తి చేయనున్నట్టు ఆర్థిక శాఖ తన జీవోలో పేర్కొంది. ఇక టీఎస్‌పీఎస్సీ ద్వారా రవాణా, జలమండలి, పురపాలక శాఖలలో 283 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులకు బుధవారం నుంచి దరఖాస్తులు ఆహ్వానించనుండగా, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.


నియామకాలు..ప్రక్రియ


అసిస్టెంట్ కమాండెంట్/డీఎస్పీ హోదా ఉన్న 16 మంది అధికారులను పదోన్నతి ద్వారా లేదా నేరుగా ఎంపిక చేయనున్నారు. అలాగే ఆర్‌ఐ పోస్టులను కూడా నేరుగా లేదా ప్రమోషన్ల ద్వారా నియమించనున్నారు. ఇకపోతే అత్యంత కీలకమైన, క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఒక్కో బెటాలియన్‌లో 633 మంది కానిస్టేబుళ్లను భర్తీ చేయనున్నారు. వీరితోపాటు కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వంటమనుషులు, ఆఫీస్ సబార్డినేట్లు, దోబీలు, బార్బర్లు, స్వీపర్లను కూడా నేరుగా నియమించున్నారు. మినిస్టీరియల్ స్టాఫ్, కమాండెంట్, అదనపు కమాండెంట్, మెడికల్ స్టాఫ్ తదితర విభాగాల్లో పదోన్నతులు, డిప్యుటేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.

మండలి డిప్యూటి చైర్మన్ గా నేతి విద్యాసాగర్ గారిని ప్రకటించిన సిఎమ్ కెసిఆర్ ...


మండలి డిప్యూటి చైర్మన్ గా నేతి విద్యాసాగర్  గారిని ప్రకటించిన సిఎమ్ కెసిఆర్ 

జాతీయ ఎన్‌క్రిప్షన్‌ ముసాయిదా అమల్లోకి వస్తే తిప్పలు తప్పవు..


మీ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది...చూసి... తర్వాత డిలేట్‌ చేశారు...అది సర్వ సాధారణంగా జరిగే విషయమే. అయితే ఇకపై అలా చేస్తే శిక్షార్హులు అవుతారు. కేంద్రం ప్రతిపాదించిన జాతీయ ఎన్‌క్రిప్షన్‌ విధానం అమల్లోకి వస్తే ఇదే జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటికే రాద్దాంతం చెలరేగడంతో కేంద్రం వాట్సాప్‌, సోషల్‌ మీడియాకు ఎన్‌క్రిప్షన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. 

స్నేహితుల మధ్య ఎస్‌ఎమ్‌ఎస్‌లు, వాట్సప్‌ మెసేజ్‌లు గూగుల్‌ హ్యాంగవర్స్‌లో సందేశాలు సర్వ సాధారణం. కేంద్రం ప్రతిపాదించిన ఎన్‌క్రిప్షన్‌ విధానం ముసాయిదా యదాతథంగా అమలు అయితే సామాన్య జనానికి అనేక తిప్పలు తప్పవు. భారత్‌లో ఎన్‌క్రిప్షన్‌ సందేశాలు పంపండంలాంటి సేవలు అందించే సంస్థలు ఏవైనా సరే కేంద్రంతో ఒప్పందం కుదుర్చు కోవాలని కొత్త విధానంలో ప్రతిపాదించారు. అయితే ఎన్‌క్రిప్షన్‌ సందేశాలన్నింటిని కనీసం 90 రోజులు ఫోన్‌లో భద్రపరచుకోవాలని స్పష్టం చేశారు. 

కేంద్రం ప్రతిపాదనతో ఇప్పటికే నెటిజన్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. భారీ స్థాయిలో అభ్యంతరాలు రావడంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. జాతీయ ఎన్‌క్రిప్షన్‌ పాలసీ నుంచి వాట్సప్‌, సోషల్‌ మీడియాను కేంద్రం మినహాయించింది. అయితే ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ఇతర సందేహాలను మాత్రం 90 రోజుల పాటు భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. 

Monday, September 21, 2015

TS Transco Genco 1422 AE Jobs Latest Notification 2015

TS Transco  Genco 1422 AE Jobs Latest Notification 2015.

Job Category:  Assistant Engineer in TS Transco.
AE (Electrical) -184 Posts
TRANSCO AE (Civil)- 22 PostsIn TS Genco
GENCO AE (Electrical) – 419 Posts
GENCO AE (Civil) – 172 Posts
GENCO AE (Electronics) – 70 Posts
GENCO AE (Mechanical) – 195 Posts in SPDCL and NPDCL
SPDCL – 201 Posts
NPDCL – 159 Posts
Total AE (Electrical) : 962 Posts
Number of Posts: 1422
Location: Telangana
Education Qualification: The Candidates need to  have the qualifications as mentioned by the organization for each and every Posts
Age Limit: Minimum of 18 Years and Maximum of 35 Years
Pay Scale: Refer the Official  Notification
Selection Criteria: Written Examination and Interview
Application Fee: As per the Norms of the Organization.
TSPSC AE Online Application Form 2015
How to Apply : Through Online Mode only
Important Dates:
NPDCL Exam Date: 8th November 2015
GENCO Exam Date: 14th November 2015
SPDCL Exam Date: 22nd November 2015
TRANSCO Exam Date: 29th November 2015
                  click here to :   Transco Official website
                  click here to TS Genco Official website

Staff Selection Commission (SSC)1327 posts New Recruitment 2015...


Name : SSC

Total No. of Posts : 1327 posts

Name And No. of Posts :
1. Canal Patwari :- 892 posts
2. Gram Sachiv :- 435 posts

Qualification : Candidates should have done 10th / 12th Pass or its equivalent qualification from a recognized university.

Age Limit : Candidates age should be between 17 – 42 Years. Age relaxations will be applicable as per the rules.

Selection Process : All Eligible Candidates will Be Selected Based on Their Performance In Written Exam, Interview .

Pay Scale: Rs. 5200/- – 20200/- With 1900/- Grade Pay .
http://www.hssc.gov.in before or on 21-10-2015. last date

Sunday, September 20, 2015

అమ్మ ప్రేమ......

 

ఇది నిజంగా జరిగిన సంఘటన......రోడ్డుమీద వెళుతున్న నన్ను ఓ తల్లి ఇలా పలకరించింది......
" ఈ ఫోనులో ఎలా మాట్లాడాలో కాస్త చెప్పమ్మా! " అంటూ.....
నేను ఆ ఫోనును నా చేతిలోకి తీసుకుని." అమ్మా! ఈ ఫోనులోని ఆకుపచ్చ బటన్ను నొక్కితే
కాల్ చేసినవారితో మాట్లాడవచ్చు.....ఎర్ర బటన్ను నొక్కితే కాల్ ఆగిపోతుందమ్మా! " అని చెప్పాను
దానికి ఆ తల్లి " ఈ ఫోనును నా కొడుకు కొనిచ్చాడమ్మా! వాడు విదేశాలలో ఉన్నాడు. నెలకు
ఒకసారి నాతో మాట్లాడుతాడు..." అని ఎంతో సంతోషంగా చెప్పింది. మళ్ళీ వెంటనేఇలా అడిగింది నన్ను..........
....." నాకొడుకు 2 నెలలుగా నాతో మాట్లాడలేదు....

.ఒకసారి ఈ ఫోన్లో తను నాకు
ఫోను చేశాడేమో కాస్తచెప్పమ్మా!" అంటూ తన కొడుకు పేరు చెప్పింది......
" అలాగే పెద్దమ్మా!" అంటూ ఫోనుని తీసుకుని చూశాను......ఏ కాల్ అందులో లేదు....నీ కొడుకు
కాల్ చేయలేదు అని చెప్పడానికి మనసురాక........
.ఇలా అబద్దం చెప్పాను.......
" అయ్యో! మీ కొడుకు కాల్ చేశాడమ్మా! కానీ నీవే తొందరలో పచ్చ బటను నొక్కబోయి
ఎర్ర బటను నొక్కేసి ఉంటావు.........భలే దానివి పెద్దమ్మా! నీవు " అని చెప్పాను.
అప్పుడు ఆ తల్లి మొహంలో తన కొడుకు కాల్ చేశాడన్న ఆనందం.....మాట్లాడలేకపోయానే అన్న
బాధ మిళితమైంది......." వాడికేమైనా అయిందేమో అని అన్నంకూడా సహించడంలేదమ్మా!
చల్లని కబురు చెప్పావు" అంది ఆ తల్లి......
"ఇంతకీ ఈ రోజైనా కడుపునిండా అన్నం తిను పెద్దమ్మా! రేపు నీ కొడుకు నీ ముందుకొచ్చి
నిలబడితే తనని గట్టిగా కౌగలించుకుని నీ సంతోషన్ని చూపాలంటే నీవు ఆరోగ్యంగా ఉండాలికదా!"
అన్నాను నేను.......దానికి ఆ పెద్దమ్మ నీవు చెప్పింది నిజమే! ఖచ్చితంగా తింటా అంటూ
ముందుకు వెళ్ళిపోయింది.......
తల్లికి దూరంగా వేరే ప్రాంతాలలో ఉన్న బిడ్డలెవరైనా సరే! దయచేసి మీ తల్లితో మాట్లా్డండి....
" అమ్మా" అన్న పిలుపుకోసం నీ కన్నతల్లి ఎదురుచూస్తుంటుందనీ గుర్తుంచుకోండి......
మీరు ఎంత పెద్దవారైనా మీరు తిన్నారా లేదా అని .కాల్ చేయకుంటే మీకేమైనా అయిందేమో
అని తల్లడి్ల్లే మీ తల్లి ఉందని మరువకండి.......
.మీరు ఎంత బిజీగా ఉన్నా సరే! తల్లితో
రెండు నిమిషాలు మాట్లాడి చూడండి ఆమెకే కాదు మీరుకూడా ఎంత సంతోషంగా ఉంటారో ఓ సారి
ఆలోచించండి......." అమ్మా! " అన్న పిలుపుకు మీరు దూరమై.....ఆ తల్లిని దూరంచేసుకోకండి......
ప్లీజ్........ప్లీజ్.....దయచేసి అమ్మకు కాల్ చేయడం మాత్రం మానకండి..........ప్లీజ్........

Saturday, September 19, 2015

రాముడు ఎప్పుడు పుట్టాడో సీతాదేవిని హనుమంతుడు ఎప్పుడు కలిశాడో కూడా చెప్పేస్తున్నారు..




రాముడు ఎప్పుడు పుట్టాడో ఘడియలు, విఘడియలతో సహా తమకు తెలుసంటున్నది ఒక పరిశోధన సంస్థ. రామాయణం, మహాభారతం పుక్కిటి పురాణాలు కావని, వాస్తవంగా జరిగినవేనని బల్లగుద్దిమరీ చెప్తున్నది! అంతేకాదు.. అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు ఎప్పుడు కలిశాడో కూడా చెప్పేస్తున్నారు. వీరి లెక్కల ప్రకారం రాముడు క్రీస్తు పూర్వం 5114 సంవత్సరంలో జనవరి 10వ తేదీన మధ్యాహ్నం 12.05 గంటలకు జన్మించాడు.



అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు క్రీస్తుపూర్వం 5076వ సంవత్సరం సెప్టెంబర్ 12న కలిశాడని ఆ సంస్థ లెక్కవేసింది. ఇక మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3139, అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైందని పేర్కొంది. రుగ్వేదం నుంచి.. రోబోటిక్స్‌దాకా అనే పేరుతో ఒక ఎగ్జిబిషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ అనే సంస్థ ఢిల్లీలోని లలిత కళా అకాడెమీలో ఏర్పాటు చేసింది. గురువారం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని సంస్థను కోరామని చెప్పారు.


అమెరికా నుంచి ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేసిన ఒక సాఫ్ట్‌వేర్, పరిశోధన సహాయంతో తాము గ్రహాల గమనాలను అంచనా వేసి ఈ తేదీలను రూపొందించామని సంస్థ డైరెక్టర్ సరోజ్ బాల చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌ను ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణగోపాల్‌తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. మహాభారతం, రామాయణం ఉనికిపై ప్రశ్నలకు ఈ ఎగ్జిబిషన్ శాస్త్రీయ సమాధానాలు ఇస్తుందని కేంద్ర మంత్రి మహేశ్‌శర్మ చెప్పారు.



ఒక ముస్లిం అయి ఉండి కూడా అబ్దుల్ కలాం జాతీయవాదిగా ఉన్నారంటూ గతంలో మహేశ్‌శర్మ చేసిన వ్యాఖ్య వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాకేశ్ తివారీ, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దినేశ్ సింగ్‌లను ఆహ్వానించినప్పటికీ వారు హాజరుకాకపోవడం విశేషం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కూడా ఆహ్వానించామని, అయితే ఆమె స్పందించలేదని సంస్థ డైరెక్టర్ సరోజ్ బాల చెప్పారు. రాముడు జన్మించినప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉందనే విషయం పురాణాల్లో ఉందని, దాని ఆధారంగా తాము సాఫ్ట్‌వేర్‌లో మ్యాపింగ్ చేసినప్పుడు సంవత్సరం, నెల, తేదీ, సమయం తెలిసిపోయాయని తెలిపారు. ఇదే పద్ధతిలో పాండవుల వనవాసం, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టిన రోజులు కూడా కనిపెట్టామని చెప్పారు.

గోవింద నామ స్మరణం చేస్తే 10 రూపాయలు టాక్ టైం ఫ్రీ hurry.......

బ్రంహోస్సవాల   సందర్బంగా  రూపాయలు 10. టాక్ టైం ఫ్రీ 

ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ఆఫర్ 

తిరుమల బ్రంహోస్సవాల   సందర్బంగా ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ దేశంలోని ప్రతి వ్యక్తి మోబైల్ కు రూపాయలు 10 ఉచిత టాక్ టైం అందిస్తుంది బుధవారం నుంచి ఈ నెల 24 వరకు ఇది వర్తిస్తుందని ఈ సంస్థ చైర్మన్ ప్రమోద్ సస్త్రేన పేర్కొన్నారు తిరుమలలోని t .t d. చైర్ర్మన్ కార్యాలయంలో బుధవారం ఈ సౌకర్యాన్ని చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి ప్రారంబించాడు అందరు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేకోవాలని అన్నారు ప్రతిఒక్క బక్తుడు గోవింద నామ స్మరణం చేయాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించనున్నారు 

మొబైల్ వినియోగదారుడు ఫోన్ లో గోవింద అనే పదాన్ని టైపు చేసి స్పేస్ యిచ్చి ఆపరేటర్ పేరు టైపు చేసి 9963900600 కి sms చేస్తే వెంటనే 10 టాక్ టైం లబిస్తుంది అన్నారు 

Ex : Airtel వినియోగదారులు GOVINDA AIRTEL అని టైపు చేసి sms చేయాలనీ కోరారు 

Very useful to Group 1, 2,3 Telangana Movement History

Telangana Movement History, In December 1953, the States Reorganization Commission was appointed to prepare for the creation of states on linguistic lines. The commission, due to public demand, recommended disintegration of Hyderabad state and to merge Marathi speaking region with Bombay state and Kannada speaking region with Mysore state. The States Reorganisation Commission (SRC) discussed the pros and cons of a merger between Telugu speaking Telangana region of Hyderabad state and Andhra state. Para 374 of the SRC report said “The creation of Vishalandhra is an ideal to which numerous individuals and public bodies, both in Andhra and Telangana, have been passionately attached over a long period of time, and unless there are strong reasons to the contrary, this sentiment is entitled to consideration”.
Discussing the case of Telangana, para 378 of the SRC report said “One of the principal causes of opposition of Vishalandhra also seems to be the apprehension felt by the educationally backward people of Telangana that they may be swamped and exploited by the more advanced people of the coastal areas.” In its final analysis SRC recommended against the immediate merger. In para 386 it said “After taking all these factors into consideration we have come to the conclusions that it will be in the interests of Andhra as well as Telangana, if for the present, the Telangana area is to constitute into a separate State, which may be known as the Hyderabad State with provision for its unification with Andhra after the general elections likely to be held in or about 1961 if by a two thirds majority the legislature of the residuary Hyderabad State expresses itself in favor of such unification.”
After going through the recommendations of the SRC, the then Central Government led by Jawaharlal Nehru decided to merge Andhra state and Telangana to form Andhra Pradesh state on 1 November 1956 after providing safeguards to Telangana in the form of Gentlemen’s agreement.

Burgula Ramakrishna Rao A Congres Leader, he was the First and last Cheif Minister of the Hyderabad State before it was merged with the Andhra State in 1956 to form the current state of Andhra Pradesh . he died in 1967

K. Chandrasekhar Rao leader of the regional Party, Telangana Rastra Samithi, he spearheaded the movement. having fulfilled the primary objective of his party. Rao is widely expected to merge it with congress 

M. Kodandaram, As convener of the all-Party Telangana Joint Action Committee, Kodandaram has been leading the civil society struggle for statehood. he is also a political science professor in Osmania university. which was the hub of the movement 

Following is a brief Telangana Movement History

  1. The region, now being called Telangana, was part of the erstwhile Hyderabad state which was merged into the Indian Union on 17 September, 1948.
  2. Central government appointed a civil servant, M K Vellodi, as the first Chief Minister of Hyderabad state on 26 January 1950. In 1952, Burgula Ramakrishna Rao was elected Chief Minister of Hyderabad state in the first democratic election.
  3. Andhra was the first state to be carved out (from erstwhile Madras state) on linguistic basis on 1 November, 1953. It had Kurnool town (in Rayalaseema region) as its capital after the death of Potti Sriramulu who sat on a 53-day fast-unto-death demanding the new state.
  4. The proposal for amalgamation of Hyderabad state with Andhra state came up in 1953 and the then Chief Minister of Hyderabad state, Burgula Ramakrishna Rao, supported the Congress central leadership’s decision in this regard though there was opposition in Telangana region.
  5. Accepting the merger proposal, Andhra assembly passed a resolution on November 25, 1955 promising to safeguard the interests of Telangana.
  6. An agreement was reached between Telangana leaders and Andhra leaders on February 20, 1956 to merge Telangana and Andhra with promises to safeguard Telangana’s interests. A “Gentlemen’s Agreement” was then signed by Bezawada Gopala Reddy and Burgula Ramakrishna Rao to the effect.
  7. Eventually, under the States Re-organisation Act, Telugu-speaking areas of Hyderabad state were merged with Andhra state, giving birth to the state of Andhra Pradesh on 1 November, 1956.
  8. The city of Hyderabad, the then capital of Hyderabad state, was made the capital of Andhra Pradesh state.
  9. In 1969, an agitation began in Telangana region as people protested the failure to implement the Gentlemen’s Agreement and other safeguards properly.
  10. Marri Channa Reddy launched the Telangana Praja Samiti espousing the cause of a separate state. The agitation intensified and turned violent with students in the forefront of the struggle and about 300 of them were killed in violence and police firing that ensued.
  11. Following several rounds of talks with leaders of the two regions, the then Prime Minister Indira Gandhi came up with an eight-point plan on April 12, 1969. Telangana leaders rejected the plan and protests continued under the aegis of Telangana Praja Samiti.
  12. In 1972, Jai Andhra movement started in Andhra-Rayalaseema regions as a counter to Telangana struggle.
  13. On September 21, 1973, a political settlement was reached with the Centre and a 6-point formula put in place to placate people of the two regions.
  14. In 1985, employees from Telangana region cried foul over appointments in government departments and complained about ‘injustice’ done to people of the region.
  15. The then Telugu Desam Party government, headed by N T Rama Rao, brought out a Government Order to safeguard the interests of Telangana people in government employment.
  16. Till 1999, there was no demand from any quarters for division of the state on regional lines.
  17. In 1999, Congress demanded creation of Telangana state. Congress was then smarting under crushing defeats in successive elections to the state Assembly and Parliament with the ruling Telugu Desam Party in an unassailable position.
  18. Yet another chapter opened in the struggle for Telangana when Kalvakuntla Chandrasekhar Rao, who was seething over denial of Cabinet berth in the Chandrababu Naidu government, walked out of TDP and launched Telangana Rashtra Samiti on 27 April, 2001.
  19. Following pressure applied by Telangana Congress leaders, the Central Working Committee of Congress in 2001 sent a resolution to the then NDA government seeking constitution of a second States Re-organisation Commission to look into Telangana state demand, which was rejected by the then Union Home Minister L K Advani saying smaller states were “neither viable nor conducive” to integrity of the country.
  20. TRS started gradually building the movement for a separate state.
  21. Congress forged an electoral alliance with TRS by promising to create Telangana state.
  22. Congress came to power in 2004, both in the state and at the Centre, and TRS became part of the coalition governments at both places.
  23. Protesting delay in carving out the separate state, TRS quit the coalition governments in the state and at the Centre in December 2006 and continued an independent fight.
  24. In October 2008, TDP changed its stance and declared support for bifurcation of the state.
  25. TRS launched an indefinite hunger-strike on 29 November, 2009 demanding creation of Telangana. The Centre budged and came out with an announcement on 9 December, 2009 that it was “initiating the process for formation of Telangana state”.
  26. But the Centre announced on 23 December, 2009 that it was putting Telangana issue on hold. This fanned protests across Telangana with some students ending their lives for a separate state.
  27. The Centre then constituted a five-member Committee on 3 February, 2010, headed by former judge Srikrishna, to look into statehood demand. The Committee submitted its report to the Centre on 30 December, 2010.
  28. Telagana region witnessed a series of agitations like the Million March, Chalo Assembly and Sakalajanula Samme (general strike) in 2011-12 while MLAs belonging to different parties quit from the House.
  29. With its MPs from Telangana upping the ante, Congress made Union Home Ministry to convene an all-party meeting on December 28, 2012 to find an “amicable solution” to the crisis.