బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్, విలన్ గా రానా, హీరోయిన్స్ గా అనుష్క, తమన్నా నటించినప్పటికీ.. కథను నడిపించే కీలకమైన శివగామి పాత్రలో.. ఎంతగానో మెప్పించారు రమ్యకృష్ణ. ఈ సినిమా తర్వాత.. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ రమ్యకృష్ణను దృష్టిలో ఉంచుకుని పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నారట దర్శకులు. కల్పిత పాత్రలే కాదు.. ఇటీవల సినీ, రాజకీయ నేతల జీవిత కథలు కూడా సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో... పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్స్ కు రమ్యకృష్ణను పరిశీలిస్తున్నారట. ఈ నేపథ్యంలో.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతోందట రమ్యకృష్ణ!
ఓ సినీనటిగా, ఆపై రాజకీయ వేత్తగా జయలలితకు తమిళనాట ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ప్రస్తుతం తమిళనాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జయలలిత జీవితం.. హంగు ఆర్భాటాలే కాదు.. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో మలుపులు. రీసెంట్ గా కుంభకోణాల్లోనూ జయలలిత కారాగారవాసం చేశారు. ఇక ఇంతటి సినీరాజకీయవేత్త జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించాలని.. తమిళనాట ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. జయలలిత వంటి పవర్ పుల్ రోల్ పోషించేందుకు సరైన నటి లభించలేదట. తాజాగా బాహుబలి చిత్రంలో ఓ వైపు వాత్సల్యం.. మరోవైపు కార్యదీక్ష, ఇంకోవైపు రౌద్రం.. ఇలా అన్నింటిని కలగలిపి శివగామిగా అద్భుతమనిపించిన రమ్యకృష్ణ నటన చూశాక.. జయలలిత పాత్రకు రమ్యనే కరెక్ట్ అనే డిసెషన్ కు వచ్చారట సదరు ఫిల్మ్ మేకర్స్. ఎలాగూ ప్రస్తుతం అమ్మ ప్రభుత్వమే నడుస్తోంది కనుక.. సినిమా కూడా పాజిటివ్ యాంగిల్ లోనే తెరకెక్కిస్తారు. మరి.. జయలలిత పాత్రలో నటించేందుకు రమ్యకృష్ణ ఓకే చెపుతుందో లేదో చూడాలి..!
see more in http://www.andhrajyothy.com/Artical?SID=132579
No comments:
Post a Comment