తెలంగాణా నోటిఫికేషన్స్
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో...
-చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తమ సంస్థలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
-వివరాలు: అసిస్టెంట్ పోస్టు
-మొత్తం పోస్టులు -750(ఎస్సీ-111,ఎస్టీ-52,ఓబీసీ-182,జనరల్-405). వీటిలో తమిళనాడుకు-145, మహారాష్ట్ర-128, కర్ణాటక-63, కేరళ-42 తెలంగాణ-26, ఆంధ్రప్రదేశ్‌కు-24 పోస్టులను కేటాయించారు.
-వయసు: జూన్ 30 నాటికి 18 - 28 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత/60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత(ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ 50 శాతం) అధేవిధంగా ఏ రాష్ర్టానికి దరఖాస్తు చేస్తే ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ భాషను రాయడం, మాట్లాడటం రావాలి.
-పేస్కేల్: రూ.7640-21050
-అప్లికేషన్ ఫీజు: రూ.450 (జనరల్), రూ.75 (ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడీ)
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష+ ఇంటర్వ్యూ, ప్రొఫీషియెన్సీ టెస్ట్
-రాతపరీక్ష సిలబస్: రీజనింగ్, ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటి, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్‌ల నుంచి ఒక్కొక్క అంశం నుంచి 40 ప్రశ్నల చొప్పున 200 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తి చేయాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో..
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 7
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: జూలై 20
-రిజిస్ట్రేషన్ పీజు చెల్లించటానికి చివరితేదీ: జూలై 20
-హాల్‌టికెట్స్ డౌన్‌లోడింగ్: ఆగస్టు 20
-ఆన్‌లైన్ టెస్ట్ : ఆగస్టు 30
-వెబ్‌సైట్: www.uiic.co.in
సీఎస్‌ఐఆర్ - ఐఐసీటీలో ఉద్యోగాలు
-హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో కింది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు:
-1. గ్రేడ్ -3 అసిస్టెంట్ (జనరల్) - 4 ఖాళీలు
-అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-2. గ్రేడ్ -3 అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 3
-అర్హతలు: కామర్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-3. గ్రేడ్ -3 అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేస్) - 2
-అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత
-4. జూనియర్ స్టెనోగ్రాఫర్ - 7
-అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి. షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు, కంప్యూటర్‌పై టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్- 40/హిందీ అయితే 35 పదాలు ఉండాలి.
-1, 2, 3 పోస్టులకు కంప్యూటర్‌పై నిమిషానికి ఇంగ్లీష్‌లో 35 పదాలు/హిందీలో 30 పదాలు టైపింగ్ చేయగలగాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రొఫీషియెన్సీ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. స్క్రీనింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు 1, 2, 3 పోస్టులకు రాతపరీక్ష / టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్షలో జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ పై ప్రశ్నలను ఇస్తారు. స్టెనోగ్రాఫర్ పోస్టుకు షార్ట్‌హ్యాండ్ టెస్ట్ నిర్వహించి దానిలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
-వయస్సు: జూలై 31 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 31
-ఫీజు: రూ. 100/-
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కాపీ ప్రింట్‌ను సంస్థ కార్యాలయానికి ఆగస్టు 7లోగా పంపాలి.
-వెబ్‌సైట్: www.iictindia.org
హైదరాబాద్ జిల్లాలో ఉద్యోగాలు
-హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆస్పత్రుల్లో కింది పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు: హాస్పటల్ సర్వీసెస్, జిల్లా కోఆర్డినేటర్ ఈ ప్రకటనను విడుదల చేశారు.
-పోస్టులు: పిడియాట్రీషియన్, స్టాఫ్ నర్సులు(జోన్ -6కు చెందిన వారు అర్హులు), డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్‌టెక్నీషియన్స్ (హైదరాబాద్ జిల్లాలకు చెందినవారు మాత్రమే అర్హులు)
-హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎస్‌ఎన్‌యూ, ఎన్‌బీఎస్‌యూ, ఎన్‌ఆర్‌సీల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
-దరఖాస్తు: సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: జూలై 11
-వెబ్‌సైట్: www.hyderabad.telangana.gov.in
డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో...
-విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ట్రెయినీ మేనేజర్స్, డ్రెడ్జి క్యాడెట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు: ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఈ సంస్థ మినీరత్న హోదా కలిగిన సంస్థ.
-డ్రెడ్జి క్యాడెట్స్: ఐఎంయూ అనుబంధ కాలేజీల్లో లేదా డీజీ షిప్పింగ్ అనుమతి పొందిన సంస్థల్లో డిప్లొమా ఇన్ నాటికల్ సైన్సెస్ పూర్తి చేసి ఉండాలి.
-ఖాళీల సంఖ్య - 9
-ట్రెయినీ మెరైన్ ఇంజినీర్స్: బీఈ మెరైన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఖాళీల సంఖ్య - 12
-దరఖాస్తు: సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: జూలై 17
-ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా
-వెబ్‌సైట్:www.dredge-india.com
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో...
-పారాదీప్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) అప్రెంటీస్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
-మొత్తం ఖాళీల సంఖ్య - 60
-విభాగాలు: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్)-10, ఫిట్టర్ -5, టెక్నీషియన్ అప్రెంటీస్ కెమికల్ - 20, టెక్నీషియన్ అప్రెంటీస్ మెకానికల్ - 10, టెక్నీషియన్ అప్రెంటీస్ ఎలక్ట్రికల్ - 15 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: అటెండెంట్ ఆపరేటర్‌కు ఫుల్‌టైం బీఎస్సీ (ఎంపీసీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. ఫిట్టర్‌కు పదోతరగతితోపాటు ఐటీఐ(ఫిట్టర్) పూర్తిచేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్‌కు సంబంధిత విభాగంలో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత.
-వయస్సు: జూలై 31 నాటికి 18 - 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్రెంటీస్‌షిప్ కాలవ్యవధి: కొన్నింటికి 18 నెలలు, మరికొన్నింటికి 12 నెలలు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష + ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.. చివరితేదీ: జూలై 25
-వెబ్‌సైట్: www.paradiprefinery.in
హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో....
-హర్యానా రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని ఇరిగేషన్, జలవనరుల శాఖలో ఖాళీగానున్న 946 ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
-వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య: 946
-సివిల్-918, ఎలక్ట్రికల్-42, మెకానికల్-27, హార్టికల్చర్-6
-అర్హత: 17 - 42 ఏండ్ల మధ్య ఉండాలి
-పేస్కేల్: రూ.9300-34800+ గ్రేడ్ పే రూ. 4000
-అప్లికేషన్ ఫీజు: రూ.150 (జనరల్), రూ.75( జనరల్ మహిళలు), రూ.75(ఎస్సీ/ఎస్టీ), రూ.18 (ఎస్సీ/ఎస్టీ మహిళలు)
-విద్యార్హత: సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్/డిప్లొమా/స్టేట్ బోర్డు నిర్వహించిన మూడేండ్ల నేషనల్ సర్టిఫికెట్ సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్‌లో(థియరిటికల్) ఇంజినీరింగ్ కోర్సులో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్య్వూ.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 3న ప్రారంభం
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: ఆగస్టు 24
-రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఆగస్టు 27
-వెబ్‌సైట్: www.hssc.gov.in
తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్‌లో సీశాట్
-హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ నిర్వహించే సీశాట్ -2016 కోచింగ్ కోసం అర్హులైన ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
-వివరాలు: రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ ఈ స్టడీ సర్కిల్‌ను నిర్వహిస్తుంది.
-అర్హతలు: రాష్ట్రంలోని 10 జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు.
-అభ్యర్థులు యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌కు అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఎస్సీ/ఎస్టీలకు అయితే రూ.2 లక్షలు మించరాదు. ఓబీసీలయితే రూ.లక్ష దాటరాదు. అభ్యర్థులు ఎటువంటి ఉద్యోగం చేస్తూ ఉండరాదు. అదేవిధంగా ఏ విద్యాసంస్థలో విద్యను అభ్యసిస్తూ ఉండరాదు. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా పీజీ/ప్రొఫెషనల్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్.
-దరఖాస్తు: సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా స్వయంగా రాసిన దరఖాస్తుతో ఫొటోలు, సర్టిఫికెట్స్‌ను జతచేసి పంపాలి.
-చివరితేదీ: జూలై 31
-ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
-రాతపరీక్ష తేదీ: ఆగస్టు 16
-వెబ్‌సైట్: www.tsstudycircle.in
No comments:
Post a Comment