Thursday, July 2, 2015

తెలంగాణ గ్రూప్స్ కరెంట్ అఫైర్స్

తెలంగాణ

ఇంధన భద్రతలో ఉత్తమ రాష్ట్రంగా...


- ఇంధన భద్రత, పరిపాలన, సుస్థిరత పరంగా భారత్‌లోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు పునరుత్పాదక విద్యుత్ ప్రోత్సాహక సంఘం (రెపా)2015 పురస్కారం లభించింది. రెపా సుస్థిర ఇంధనం, విద్యుత్ పై వెలువరిస్తున్నఎనర్షియా జర్నల్ ఈ అవార్డునిస్తోంది.
- మార్చ్ 29న పదవీకాలం ముగిసిన బి.వెంకట్రావ్ స్థానంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు.
-సిద్దిపేట మండలంలో చేపట్టిన తడ్కపల్లి రిజర్వాయర్‌కు కొమురవెల్లి మల్లన్న సాగర్‌గా పేరు పెట్టారు. దీనిని రూ. 3 వేల కోట్లతో చేపడుతున్నారు. 

జాతీయం

అధిక ఇనుము గల సజ్జ వంగడం ధనశక్తి


- అధిక ఇనుముతో ఎక్కువ దిగుబడినివ్వగల సజ్జ వంగడం ధనశక్తిని ఇక్రిశాట్ సృష్టించింది. దేశంలో 79 శాతం పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్న నేపథ్యంలో సాధారణ సజ్జ కన్నా 11 శాతం అత్యధిక ఇనుముతో ఈ వంగడాన్ని సృష్టించారు. క్లినికల్ ట్రయల్స్‌గా మహారాష్ట్రలో 246 మంది పిల్లలకు ఈ ఆహారాన్ని ఇవ్వగా 4 నెలల కాలంలో వారు రక్తహీనతను అధిగమించారు. 

ప్రారంభమైన కైలాస యాత్ర


- కైలాస మానససరోవర్ యాత్రను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రెండు మార్గాల్లో ప్రారంభించారు. జూన్ 11న ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ కనుమ ద్వారా, జూన్ 16న సిక్కింలోని నాథులా కనుమ ద్వారా యాత్రను ప్రారంభించారు. మే నెలలో ప్రధాని నరేంద్రమోడీ చైనాలో పర్యటించిన సందర్భంగా నాథులా ద్వారా యాత్రకు ఆ దేశం అంగీకరించింది. 

ఇక అందరికీ ఇల్లు


- పట్టణ ప్రాంత పేదల కోసం జాతీయ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 2022 నాటికి అందరికీ ఇల్లు పథకాన్ని కేంద్రం జూన్ 17న ప్రారంభించింది. ఈ పథకాన్ని దేశంలోని 4041 నగరాలు, పట్టణాల్లో 3 దశల్లో 4 విధాలుగా అందిస్తారు. తొలి విధానంలో ప్రైవేట్ డెవలపర్ల భాగస్వామ్యంతో చేపట్టే స్లమ్స్ పునరభివృద్ధి ప్రణాళిక కింద లబ్దిదారుడికి సగటున రూ. లక్ష కేంద్ర గ్రాంట్‌గా అందిస్తారు. రెండో విధానంలో గృహ EMIల్లో 6.5 శాతం వడ్డీ రాయితీని ఇస్తారు. 3వ విధానంలో ప్రభుత్వ, ప్రైవేట్ గృహ నిర్మాణ పథకాల్లో 35 శాతం ఆవాసాలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తే.. ప్రతి లబ్ధిదారుడికి 1.5 లక్షల కేంద్ర సాయం అందిస్తారు. 4వ విధానంలో లబ్ధిదారుడే సొంత గృహాన్ని నిర్మించుకుంటే 1.5 లక్షల కేంద్ర సాయం లభిస్తుంది.

బెంగాల్లో డీఆర్‌డీఓ కొత్త పరిశోధన కేంద్రం


- పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయ స్థలంలో జగదీష్ చంద్రబోస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పేరుతో రక్షణ పరిశోధనా కేంద్రాన్ని డీఆర్‌డీఓ నిర్మించనుంది.

సౌరవిద్యుత్ లక్ష్యం ఐదు రెట్లు పెంపు


- జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సౌర కార్యక్రమం కింద 2022 నాటికి లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ లక్ష్యాన్ని జూన్ 17న కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గత లక్ష్యం 20 వేల మెగావాట్ల కన్నా ఇది ఐదు రెట్లు అధికం.

ఇక బ్యాంకుగా బంధన్


- సూక్ష్మ రుణాల సంస్థ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFS)ప్రతిపాదిత బ్యాంకుకు ఆర్‌బీఐ నుంచి పూర్తి స్థాయి లైసెన్స్ లభించింది. ఈ బ్యాంకు కార్యకలాపాలు ఆగస్టు 23 నుంచి ప్రారంభమవుతాయి. కోల్‌కతా కేంద్రంగా 2006లో ప్రారంభమైన బీఎఫ్‌ఎస్‌కు 22 రాష్ర్టాల్లో 2,200 కార్యాలయాలు, 10 వేల కోట్లకుపైగా రుణ ఖాతాలు ఉన్నాయి. బీఎఫ్‌ఎస్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఘోష్.

ఏర్పాటైన ఐఎన్‌ఐపీ


- అణువిద్యుత్ కేంద్రాల్లో ప్రమాదం సంభవిస్తే పరిహారం కోసం ఇండియన్ న్యూక్లియర్ ఇన్సూరెన్స్ (ఐఎన్‌ఐపీ) ఫూల్‌ను రూ. 1500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం జూన్ 13న ప్రకటించింది. ఈ తరహా బీమా నిధిని ఏర్పాటు చేసిన దేశాల్లో భారత్ 27వది. 

అంతర్జాతీయం

చైనాలో యోగా కళాశాల


- చైనాలోని కున్మింగ్‌లో యున్నాన్ మింజు విశ్వవిద్యాలయంలో భారత్-చైనా యోగా కళాశాలను జూన్ 12న కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ప్రారంభించారు. దీంతోపాటు చైనాలో రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంత్యుత్సవాలను కూడా ప్రారంభించారు.

స్కూల్స్ ఎల్మౌలో జీ7 సదస్సు


- జర్మనీలోని బవారియాలో ఉన్న స్కూల్స్ ఎల్మౌలో జూన్ 7, 8 తేదీల్లో జీ7 సదస్సు జరింది. ఈ సందర్భంగా 2100 నాటికి కర్బన ఇంధన వినియోగం నిలిపివేయాలని సభ్యదేశాలు నిర్ణయించాయి. ఈ సమావేశానికి రష్యా మినహా మిగిలిన 7 అగ్రశేణి దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు పాల్గొన్నాయి. జీ7 ఆరోగ్య మంత్రుల సదస్సు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనుంది.

చమురు ఉత్పత్తిలో అమెరికా ఫస్ట్


- బ్రిటీష్ పెట్రోలియం ఆయిల్ అండ్ గ్యాస్ విడుదల చేసిన నివేదికలో 2014లో చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 2014లో ఎక్కువ రిఫైనరీ సామర్థ్యంగల దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా భారత్ నాలుగో ప్లేస్‌లో ఉంది. 

మోర్సీకి మరణశిక్షకు కోర్టు ఓకే


- ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి విధించిన మరణశిక్షను కైరో కోర్టు నిర్ధారించింది. 2011లో జైలుపై దాడిచేసి ఖైదీలను విడిపించిన కేసులో మోర్సీతోపాటు ముస్లిం బ్రదర్‌హుడ్ నేత బేదీ, మరో వంద మంది ఇస్లామిస్టులకు కూడా మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షలను సమీక్షించే గ్రాండ్ ముఫ్తీని సంప్రదించి ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

వెలుగులోకి కొత్త మట్టిజీవి


- కళ్లు, కాళ్లు లేకుండా పచ్చిక బయళ్లు మట్టిలో నెమ్మదిగా పాకుతూ వెళ్లే ఒక జీవిని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని అంగుళాల పరిమాణంలో గల ఈ జీవికి ఫికస్ యక్యూస్టెర్రా అని పేరుపెట్టారు.

భద్రతా మండలి విస్తరణకు సిఫార్సు


-అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మెడలీన్ అల్‌బ్రైట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి విస్తరణకు సిఫార్సు చేసింది. 14 మంది సభ్యులున్న ఈ కమిటీలో శ్యామ్‌శరణ్ (భారత్)కూడా ఉన్నారు. ఏడాది కాలానికి గాను డెన్మార్క్ రాజకీయవేత్త మోజెన్స్ లీకెటాఫ్ట్ ఐరాస సాధారణ సభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

గ్లోబల్ వెల్త్ నివేదిక-2015


-బోస్టన్ కన్సల్టెన్సీ గ్లోబల్ వెల్త్ 2015-విన్నింగ్ ద గ్రోత్ పేరిట ఆల్ట్రా హై నెట్‌వర్ట్ కుటుంబాలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో నిలిచింది. 5201 కుటుంబాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా (1037), యునైటెడ్ కింగ్‌డమ్ (1019), భారత్ (928)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

వార్తల్లో వ్యక్తులు

IICT డైరెక్టర్‌గా చంద్రశేఖర్


- హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT)నూతన డైరెక్టర్‌గా శ్రీవారి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు.

21st సెంచరీ ఫాక్స్ సీఈఓగా జీమ్స్ మర్దోక్


- ఎంటర్‌టైన్ మెంట్ సంస్థ ట్వంటీ ఫస్ట్ సెంచరీఫాక్స్ సీఈఓగా జేమ్స్ మర్దోక్ జూలై 1న బాధ్యతలు చేపడతారు.

నేక్‌చంద్ మృతి


- ప్లాన్డ్ సిటీ చండీగఢ్‌లో పనికిరాని వస్తువులతో రాక్‌గార్డెన్‌ను సృష్టించిన నేక్‌చంద్ జూన్ 12న మరణించారు.
ISI డైరెక్టర్‌గా సంఘమిత్ర బంధోపాధ్యాయ
- భారత గణాంకాల సంస్థ (ISI) డైరెక్టర్‌గా సంఘమిత్ర బందోపాధ్యాయ నియమితులయ్యారు. జూలై 31 వరకు పదవీకాలం గల బివుల్ రాయ్‌ని కేంద్రం జూన్ 13న తొలగించడంతో ఈ నియామకం జరిగింది.

క్రిస్టఫర్‌లీ మృతి


- డ్రాకులా పాత్రలకు పేరొందిన బ్రిటీష్ నటుడు క్రిస్టోఫర్ లీ జూన్ 7న లండన్‌లో మరణించారు.
ఆమ్నెస్టీ ఇండియా ఈడీగా ఆకార్‌పటేల్
- లండన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పాత్రికేయుడు ఆకార్ పటేల్ నియమితులయ్యారు. ఇండియా లో ట్రస్ట్ సొసైటీ పుస్తకాన్ని రాసిన ఆయన గుజరాత్ అల్లర్లపై రైట్స్ అండ్ రాంగ్స్ నివేదికకు సహ రచయిత.
- బ్రిటీష్ పార్లమెంట్ హోం అఫైర్స్ సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా లేబర్ పార్టీ ఎంపీ కీత్‌వాజ్ తిరిగి ఎన్నికయ్యారు.
- జూన్ 9న అరేబియా ద్వీపకల్పంలో యూఎస్ డ్రోన్ దాడుల్లో అల్‌ఖైదా అగ్రనేత నాసిర్ ఉల్ ఉహాయషి మరణించాడు.

క్రీడాంశాలు

మెర్సిడెస్ కప్ విజేత నాదల్


- జూన్ 14న మెర్సిడెస్ కప్ (జర్మనీ) ఫైనల్లో విక్టర్ ట్రాయెస్కీ (సెర్బియా)ను ఓడించి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కెరీర్‌లో 66వ టైటిల్ సాధించాడు. డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియో (అర్జెంటీనా) జోడి గెలుచుకుంది. ఫైనల్లో వీరు అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా) బ్రూనె సొరెస్(బ్రెజిల్) జంటను ఓడించారు. 2015లో బోపన్నకు ఇది 4వ డబుల్స్ టైటిల్ కావడం గమనార్హం.

క్రైస్ట్‌చర్చ్ స్కాష్ విజేత డెక్లన్ జేమ్స్


- జూన్ 14న న్యూజిలాండ్‌లో క్రైస్ట్‌చర్చ్ ఇంటర్నేషనల్ స్కాష్ టైటిల్స్‌ను ఇంగ్లండ్ ఆటగాడు డెక్లన్ జేమ్స్ గెలుచుకున్నాడు. జేమ్స్ ఫైనల్లో భారత ఆటగాడు హరీందర్‌పాల్ సంధూను ఓడించాడు.

అవార్డులు

సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్-2014


-సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్- 2014ను నలుగురికి ప్రకటించారు. శాస్త్రీయ సంగీత గాయకుడు విజయ్ కిచ్లే, సంగీత విద్యాంసులు ఆర్.జానకీరామన్, తులసీదాస్ బోర్కర్, దర్శకుడు ఎంఎస్ సత్యూలకు ఈ గౌరవం లభించింది. ఈ అవార్డు కింద రూ. 3లక్షలు నగదు పురస్కారం అందిస్తారు. 

సంక్షిప్తంగా....
- ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్‌లో స్వేచ్చా వాణిజ్య మార్కెట్ ఒప్పందంపై 26 ఆఫ్రికా దేశాలు జూన్ 10న సంతకం చేశాయి.
- 1921-22లో లండన్‌లో అంబేద్కర్ నివసించిన భవంతిని మహారాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల పౌండ్లకు కొనుగోలు చేసింది.

- 67P తోకచుక్క పైనుంచి ఫిలే ల్యాండర్ 7 నెలల తర్వాత జూన్ 13న హలో ఎర్త్ పేరిట సందేశం పంపింది.
- జూన్ 15న భూటాన్ రాజధాని థింపులో భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లతో భారత్ మోటారు వాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
- CWC గ్లోబల్ టాఫ్ 40 మైనింగ్ సంస్థల్లో కోల్ ఇండియా 6వ, ఎన్‌ఎండీసీకి 21వ స్థానం లభించింది.
- చైనాలోని హర్చిన్ నుంచి జర్మనీలోని హంబర్గ్‌కు (9,820 కి.మీ.) గూడ్స్ రైలు ప్రారంభమైంది.
- ప్రవాస భారత మంత్రిత్వ శాఖ నాలుగో మైగ్రేంట్ రీసోర్స్ సెంటర్‌ను చెన్నైలో నెలకొల్పింది. 
- ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌ను వెస్లీహాల్ (వెస్టిండీస్)కు ప్రకటించారు. దీంతో ఈ గౌరవం పొందిన వారిసంఖ్య 80కి చేరింది.

No comments:

Post a Comment