Thursday, July 30, 2015

గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ

గురు సందేశము :
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగాపాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది
భారత దేశములో ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు . పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలము అయినందున ... ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు . అప్పుడు శి్ష్యులు గురుగు దగ్గర వి్జ్ఞాన సముపార్జన చేసేవారు . ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు . ఈ సంప్రదాయమే కాలక్రమేన " గురుపూర్ణిమ " గా మారినది అని చరిత్ర చెబుతోంది .
ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.
వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.
వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి,పరాశరుడు. వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వ్యాప్తిచేయమని ఆదేశించాడు.
గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని,వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.
ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.
ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.
"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నకస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.

Sunday, July 26, 2015

Police Department New Building in Telangana







CM Sri K Chandrashekar Rao has instructed the Police Department to construct a state-of-the-art Command & Control Centre.
This would come up at Banjara Hills. It will consist of two buildings - one 24 floors and the other 16 floors. Both would be connected by a skywalk.
Detailed Press Note at the end of the album.

తొలి ఏకాదశి విష్ణువు ఆరాధనకు అత్యంత విశిష్టవంతమైన రోజు



27-7-2015, సోమవారం, తొలి ఏకాదశి
ఆషాఢ శుద్ద ఏకాదశికి శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పేర్లు. విష్ణువు ఆరాధనకు అత్యంత విశిష్టవంతమైన రోజు. సమస్త సృష్టికి స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచే వైకుంఠంలో పాలసముద్రంలో ఆదిశేషుని పడుకుని మీద యోగనిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆషాఢ శుద్ద ఏకాదశి నుంచే విష్ణువు శయనిస్తాడు కనుక దీనికి శయన ఏకాదశి అని పేరు.
అసలు విష్ణువుకు నిద్ర అనేది ఉంటుందా? స్వామి నిద్రపోతే, బ్రహ్మాండం ఏమైపోతుంది? ఆర్తుజనులను రక్షించేందుకు ఎవరు ఉంటారు? విష్ణుమూర్తి నిద్రపోవడమేంటని చాలా మంది అనుమానం రావచ్చు. అందరిని కాపాడే ఆ పరమాత్ముడికి నిద్ర ఏంటని అనిపిస్తుంది. విష్ణువు అంటే వ్యాపకత్వం కలిగినవాడని అర్దం. విష్ణువు స్థితి కర్త. అందరిని, అన్నిటిని నడిపించేవాడు, విష్ణువే సమస్త జీవరాశిలో ఉన్న ప్రాణశక్తి. మనలో ఆ శ్రీ మహావిష్ణువు ప్రాణశక్తి రూపంలో స్థితమై ఉండి నడిపిస్తున్నాడు.
దక్షిణాయనంలో, ముఖ్యంగా భారతదేశంలో వానాకాలం, చలికాలం ఉంటాయి. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమి పూర్తిగా చేరకుండా మేఘాలు, మంచు మొదలైనవి అడ్డుపడతాయి. అందువల్ల శరీరంలో ఉన్న జీవక్రియలు మందగిస్తాయి, ప్రాణశక్తి తగ్గిపోతుంది. అదే మన అందరిలో ఉన్న విష్ణువు యొక్క నిద్ర, ఆఖిల జగత్తును ఏలే విష్ణువు యొక్క యోగ నిద్ర.
ఇదే కాదు, దక్షిణాయనం ఉపాసనా కాలం. ఈ 6 నెలలు భగవదుపాసన చేయాలి. ఎవరైతే ఈ సమయంలో శాస్త్రనియమాలను పాటిస్తూ, ఉపాసన చేస్తారో వారిని యెడల అపారమైన అనుగ్రహాన్ని వర్షించడం కోసం విష్ణుమూర్తి బాహ్యనేత్రాలను మూసి, అంతఃనేత్రాల ద్వారా చూస్తుంటాడు. ధర్మాన్ని అనుషిటించేవారికి సకల శుభాలు చేకూరుస్తాడు.
ఈ ఏకాదశి నుంచి అనేక పండుగుల, పర్వటి రోజులు ఉంటాయి. ఇది అన్నిటికంటే ముందు వస్తుంది కనుక తొలి ఏకాదశి అని పేరు. ఈ తొలి ఏకాదశి రోజున అందరు తప్పకుండా పేలాల పిండిని విష్ణువుకు సమర్పించి నైవేధ్యంగా తినాలి. ఈరోజున చేసే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం, శ్రీ విష్ణుసహస్రనామ పారయణం, ఏకాదశి వ్రతం విశిష్టఫలాన్ని, విష్ణు సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాయి.
నమోస్తు అనంతాయ సహస్ర మూర్తయే, సహస్రపాదాక్షి శిరోరుబాహవే,
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్రకోటి యుగధారిణే నమః
అంతటా వ్యాపించినవాడు, అంతము లేనివాడు, అనంతుడు, అనేక రూపాలలో దర్శనమిచ్చేవాడు, అనంతమైన బాహువులు, కన్నులు, పాదాలు కలిగిన విరాట్ పురుషుడు, లెక్కలేనన్ని పేర్లతో పిలువబడేవాడు, శాశ్వతమైనవాడు, సహస్రకోటి బ్రహ్మాండాలను ధరించి, రక్షించి, పోషిస్తున్న శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తున్నాను.
ఈ రోజున తప్పక దగ్గరలో ఉన్న శ్రీ మహా విష్ణువు ఆలాయన్ని, శ్రీ మహా విష్ణు అవతారం కొలువై ఉన్న ఆలయాన్ని సందర్శించండి.
ఓం నమో నారాయణాయ

Thursday, July 23, 2015

కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొడుతోంది



బంగారం కొందామా.. వద్దా? ధర పెరుగుతున్నా.. తగ్గుతున్నా బంగారం గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటారు. ముఖ్యంగా పసిడితో


బంగారం కొందామా.. వద్దా?
ధర పెరుగుతున్నా.. తగ్గుతున్నా బంగారం గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటారు. ముఖ్యంగా పసిడితో
see this link 
http://www.eenadu.net/specialpages/siri/Siriinner.aspx?qry=sp-siri2

చనిపోయిన మనిషి ఆత్మ బయటికి వెళ్ళిన దృశ్యం

Russian scientist Konstantin Korotkov claims he can photograph the human spirit as it leaves a man or woman’s body at the moment of their death by using something called a bioelectrographic camera.


You’ve probably seen death depicted in movies or TV with a spirit leaving the physical body behind, but did you know that this Hollywood gimmick is actually based on science?
Russian scientist Konstantin Korotkov claims he can photograph the human spirit as it leaves a man or woman’s body at the moment of their death by using something called a bioelectrographic camera. Korotkov, who teaches physics at the St. Petersburg State Technical University in Russia is known for his pioneering research on human energy field.

In the video below, which was posted to YouTube by HumansAreFree.com, Korotkov explains how he believes that the souls of humans never really leave the earth, and they can be seen in photographic reminders. So, next time you get a strange “mistake” in your photograph, just remember that it could be a loved one paying you a special visit.
Pretty freaky, isn’t it?! Check out the photograph that claims to have taken at the moment of a man’s death… just know, it might haunt you!

మేరా భారత్ మహాన్….. ఎందుకంటే……!


మేరా భారత్ మహాన్….. ఎందుకంటే……!
1. 38% అమెరికా డాక్టర్లు భారతీయులే
2. అమెరికాలోని 12% సైంటిస్టులు భారతీయులే...
3. ప్రపంచంలోని 28% IBM ఉద్యోగులు భారతీయులే...
4. 36% నాసా ఉద్యోగులు భారతీయులే...
5. 17% INTEL ఉద్యోగులు భారతీయులే...
6. 34% మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు భారతీయులే...
7. సంస్కృతమే చాలా యురోపియన్ భాషలకు మూలం...
8. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సంస్కృతమే కంప్యూటర్ భాషకు అత్యంత అనుకూలమయిన భాష
9. చదరంగాన్ని కనుగొన్నది.. భారతదేశంలోనే...
10. హాట్ మెయిల్ ను కనుగొన్నది.. రూపొందించింది.. భారతీయుడే(సబీర్ భాటియా)
11. సున్నాను కనుగొన్నది భారతీయులే.(ఆర్యభట్టుడు)..
12. సంఖ్యా శాస్త్రాన్ని కనుగొన్నది భారతీయులే...
13 బీజ గణితం కనుగొన్నది భారతీయులే...
14. మాత్రికలని, త్రికోణమితిని కనుగొన్నది భారతీయులే...
15. మన కంప్యూటర్ పని చేయటానికి ఉపయోగించే... పెంటియం చిప్ ను కనుగొన్నది.. భారతీయుడే(వినొద్ దాం)
16. యురోపియన్ల కంటే ముందుగా పై (3.14) విలువను ఖచ్చితంగా కనుగొన్నది... బుద్దన (6వ శతాబ్దంలోనే)
17. 2600 సంవత్సరాల క్రితమే శుశ్రుతుడు.. శస్త్ర చికిత్సను కనుగొన్నాడు... ఆ కాలంలోనే కృత్రిమ అవయవాల ఏర్పాటు, మూత్రాశయంలోని రాళ్ళను తొలగించే పద్ధతులు భారతీయులకు తెలుసు...
18. భారత దేశమే ప్రపంచంలోని 4 వ అతి పెద్ద సైన్యాన్ని కలిగిన దేశం.
అందుకే… మేరా భారత్ మహాన్

కేసీఆర్ మోడల్ హౌస్ !



కేసీఆర్ మోడల్ హౌస్ !
- రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు
- 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం
- కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే.
కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి కేసీఆర్ మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు.
ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది.
నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది.
ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.
చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశా
పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్
ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించా. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. సీఎం కేసీఆర్ కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి కేసీఆర్ మోడల్ హౌస్ అని పేరుపెట్టా.

Wednesday, July 22, 2015

S/o Sathyamurthi cute baby Vernika photos






























లండన్‌లో బోనమెత్తిన స్వామిగౌడ్‌!


తమిళనాడు ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ

బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్, విలన్ గా రానా, హీరోయిన్స్ గా అనుష్క, తమన్నా నటించినప్పటికీ.. కథను నడిపించే కీలకమైన శివగామి పాత్రలో.. ఎంతగానో మెప్పించారు రమ్యకృష్ణ. ఈ సినిమా తర్వాత.. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ రమ్యకృష్ణను దృష్టిలో ఉంచుకుని పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నారట దర్శకులు. కల్పిత పాత్రలే కాదు.. ఇటీవల సినీ, రాజకీయ నేతల జీవిత కథలు కూడా సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో... పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్స్ కు రమ్యకృష్ణను పరిశీలిస్తున్నారట. ఈ నేపథ్యంలో.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతోందట రమ్యకృష్ణ!
ఓ సినీనటిగా, ఆపై రాజకీయ వేత్తగా జయలలితకు తమిళనాట ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ప్రస్తుతం తమిళనాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జయలలిత జీవితం.. హంగు ఆర్భాటాలే కాదు.. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో మలుపులు. రీసెంట్ గా కుంభకోణాల్లోనూ జయలలిత కారాగారవాసం చేశారు. ఇక ఇంతటి సినీరాజకీయవేత్త జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించాలని.. తమిళనాట ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. జయలలిత వంటి పవర్ పుల్ రోల్ పోషించేందుకు సరైన నటి లభించలేదట. తాజాగా బాహుబలి చిత్రంలో ఓ వైపు వాత్సల్యం.. మరోవైపు కార్యదీక్ష, ఇంకోవైపు రౌద్రం.. ఇలా అన్నింటిని కలగలిపి శివగామిగా అద్భుతమనిపించిన రమ్యకృష్ణ నటన చూశాక.. జయలలిత పాత్రకు రమ్యనే కరెక్ట్ అనే డిసెషన్ కు వచ్చారట సదరు ఫిల్మ్ మేకర్స్. ఎలాగూ ప్రస్తుతం అమ్మ ప్రభుత్వమే నడుస్తోంది కనుక.. సినిమా కూడా పాజిటివ్ యాంగిల్ లోనే తెరకెక్కిస్తారు. మరి.. జయలలిత పాత్రలో నటించేందుకు రమ్యకృష్ణ ఓకే చెపుతుందో లేదో చూడాలి..!

see more in http://www.andhrajyothy.com/Artical?SID=132579

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తెల్లకాకి దర్శనమిచ్చింది



శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఓ తెల్లకాకి దర్శనమిచ్చింది. అక్కడ యోగా చేస్తున్న కొంతమంది దీనిని గమనించారు. అయితే అది ఎగరలేక పోతుండటంతో చేతుల్లోకి తీసుకుని సపర్యలు చేశారు. 

largest ISKCON temples in the world


Sri Radha Krishna Temple has deities of Radha and Krishna located at Rajajinagar, in North Bangalore, Karnataka, India.