Saturday, July 4, 2015

వేమన పద్యాలు షేర్ చేయండి.. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు కాచి యతకవచ్చు క్రమము గాను మనసు విరిగెనేని మరి చేర్చరాదయ విశ్వధాభిరామ, వినుర వేమ

ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచి యతకవచ్చు క్రమము గాను
మనసు విరిగెనేని మరి చేర్చరాదయ
విశ్వధాభిరామ, వినుర వేమ
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
ఫురుషులందు ఫుణ్య పురుషులు వేరయ
విశ్వధాభిరామ, వినుర వేమ

కనక మృగము భువిని కలదు లేదనకను
తరుణి వీడి చనియె దాశరధుడు
బుద్ధిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వధాభిరామ, వినుర వేమ

గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వధాభిరామ, వినుర వేమ

ఆత్మశుద్ధి లేని అచారమది ఏల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ది లేని శివ పూజలేలర
విశ్వధాభిరామ, వినుర వేమ

ఆల్పుడెపుడు పల్కు ఆడంబురము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగునా
విశ్వధాభిరామ, వినుర వేమ


ఆనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ, వినుర వేమ

అనువు గాని చోట అధికులమనరాదు
కొంచమైన నదియు కొదవ గాదు
కొండ అద్దమందు కొంచమై ఉండదా
విశ్వధాభిరామ, వినుర వేమ

చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీటబడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తిగలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వధాభిరామ, వినుర వేమ

ఆపదైన వేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటు తనము
పేదవేళ జూడు పెండ్లము గుణము
విశ్వధాభిరామ, వినుర వేమ

వేషభాషలెరిగి ఖాషాయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వధాభిరామ, వినుర వేమ

చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
కంటిలొన నలుసు కాలి ముల్లు
ఇంటిలోన పోరు ఇంతింత గాదయ
విశ్వధాభిరామ, వినుర వేమ

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమతప్పు లెరుగరు
విశ్వధాభిరామ, వినుర వేమ


మేడి పండు చూడ మేలిమైయుండు
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వధాభిరామ, వినుర వేమ


ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా
నలుపు నలుపే గాని తెలుపు కాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా
విశ్వధాభిరామ, వినుర వేమ


No comments:

Post a Comment