ఒక్క రూపాయికే విమానం ప్రయాణం.. పన్నులు అదనం.. ఎంపిక చేసిన మార్గాలలో మాత్రమే.. అంటూ స్పైస్‌జెట్ స్పైసీ ఆఫర్ ను ప్రకటించేసింది. విమాన ప్రయాణీకులు దీనిని వచ్చే మార్చి వరకూ వినియోగించుకోవచ్చు. తాజాగా స్పైస్ జెట్ ప్రకటించిన ఈ ఆఫర్ కింద బుధవారం ఉదయం 10 గంట ల నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎంపిక చేసిన మార్గాల్లో స్పైస్‌జెట్ కొత్త మొబైల్ యాప్ ద్వారా రూపాయికే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్ వన్‌వే ప్రయాణానికే పరిమితం. రిటర్న్ టికెట్ మాత్రం స్పైస్‌జెట్ నుంచే పూర్తి ధర చెల్లించి బుక్ చేసుకోవాలి. టికెట్ ధర రూపాయే అయినా పన్ను లు, ఇతర ఫీజులు ప్రయాణికులే భరించాలి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయాణించవచ్చు. గత ఏడాది కూడా కంపెనీ ఇలాంటి ఆఫరే ప్రకటించింది. దానికి మంచి ఆదరణ లభించడంతో ఈ సంవత్సరం మళ్లీ అదే ఆఫర్ ప్రకటించినట్టు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఒఒ) సంజీవ్ కపూర్ చెప్పారు. రెడ్ హాట్ స్పైసీ రూ.1 సేల్ ఆఫర్ కింద ఒక మొబైల్ ఫోన్ నుంచి రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ కింద లభించే టికెట్లు పరిమితమని స్పైస్‌జెట్ పేర్కొంది.
copy from http://unewslive.tv/unews-14432-spice-jet-offer-flight-journey-1-rupee.html

No comments:
Post a Comment