తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావంతో కొలువులపై దృష్టి సాధించింది సర్కార్. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. వివిధ శాఖల్లో మొత్తం 4,077 పోస్టులను ఫిల్అప్ చేయనుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలవడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాల ఆవిర్భావంకు ముందే కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది. రెవెన్యూ పోలీస్ డిపార్ట్‌మెంట్స్‌లోనే అత్యధిక పోస్టులు భర్తీ కానున్నాయి. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఈ నియామకాలను భర్తీ చేయనుంది. ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
కొత్తగా మంజూరు చేయనున్న 4,077 పోస్టుల్లో అత్యధికంగా 2,109 పోస్టులు రెవెన్యూ విభాగానికి చెందినవే
ఇందులో 104 తహసీల్దార్, మరో 104 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులున్నాయి..ఇవి ఇంకా పెరిగే అవకాశం
శాఖల వారీగా పోస్టుల వివరాలు
…. విద్యాశాఖ పరిధిలో 85 మండలాల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులు
ఆర్ అండ్ బీలో ఉద్యోగాలు
…. ఈఈ పోస్టులు-4
… సూపరింటెండెంట్-4
… జూనియర్ అసిస్టెంట్- 4
…. అగ్నిమాపక విభాగం- 54
… వ్యవసాయ శాఖ-25
పోలీస్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
ఇక రాష్ట్రంలో కొత్తగా సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త పోలీస్ స్టేషన్లు కూడా వచ్చాయి. దీంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా హోం శాఖ ప్రతిపాదించిన 1,800 పోస్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
No comments:
Post a Comment