Wednesday, October 5, 2016

వాస్తు - గాలి, వెల్తుర్లు...


                                        వాస్తు గాలివెల్తుర్లు



మనం మళ్ళీమళ్ళీ చెప్పుకుంటున్నట్లుగా వాస్తు అంటే కేవలం వంటిల్లు ఎటువైపు ఉండాలి,పూజ గది ఏ దిక్కున ఉండాలి లాంటి అంశాలు మాత్రమే కాదువాస్తులో పిల్లర్లునీళ్ళ సంపుల దగ్గరనుంచి గోడకు వేసే రంగుల వరకూ అనేక విషయాలను ప్రస్తావించారు.
ఇప్పుడు మనం వాస్తులో గాలివెల్తుర్ల గురించి తెలుసుకుందాంవాస్తు శాస్త్రంలో గాలీ వెల్తుర్లకు చాలా ప్రాధాన్యత ఉంటుందినిజమే మరిఇంట్లోకి గాలీ వెల్తురు లేకపోతే అసలది ఇల్లెలా అవుతుంది?! చెట్టు తొర్రలోనోకొండ గుహలోనో ఉన్నట్లు ఉండదూ?! ఇంట్లోకి గాలీ వెల్తురు గనుక రాకపోతే తాజాదనం ఉండదుఊపిరాడదువిసుగుచిరాకుఅసహనం కలుగుతాయి.గాలి ప్రాణాన్ని కాపాడుతుందితాజా గాలి లేకుంటే అనారోగ్యాల బారిన పడతాముకనుక కిటికీలుదర్వాజాలు తగినన్ని ఉండటముఅవి సరైన దిశలో ఉండటం వల్ల బయటి నుండి స్వచ్చమైన గాలి లోనికిలోపలి గాలి బయటకు వెళ్ళి ఇంటి వాతావరణం తేటగాపరిశుభ్రంగా ఉంటుంది.
వాస్తు శాస్త్రం పరిపూర్ణంగా తెలిసినవారు ఇంటిని ఖచ్చితంగా రోడ్డు కంటే ఎత్తులో నిర్మిస్తారు.ఇల్లు కనుక రోడ్డు కంటే మెరకలో లేకుండా పల్లంలో ఉంటే వర్షం పడినప్పుడు ఇంట్లోకి నీళ్ళు రాకుండా ఉండటమే కాకుండా గాలీ వెల్తురూ మెరుగ్గా లోనికి వస్తాయి.
కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఇళ్ళను గమనించినట్లయితే చిన్న కిటికీ కూడా కనిపించదుఅలాంటి గదుల్లో పట్టపగలు కూడా చిమ్మచీకటి తాండవిస్తుందిఏ వస్తువు ఎక్కడ ఉన్నదో కనిపించకపోవడమే కాదుఅసలు కాసేపు కూడా ఉండలేముపొదుపు పేరుతో వాస్తు విరుద్ధంగా నిర్మిస్తున్న కొన్ని ఆధునిక గృహాల్లో సైతం లైటు వేస్తేనే వెలుగుఫాను ఉంటేనే గాలి చందంగా ఉంటున్నాయిఇవి ఆరోగ్యకరమైన ఇళ్ళు కావని గుర్తించాలిఅందుకే వాస్తు శాస్త్రకారులు పుష్కలంగా గాలీవెల్తురూ వచ్చేందుకు వీలుగా పెద్ద కిటికీలను ఏర్పాటు చేస్తారు.
పూర్తిగా చెక్క అమర్చిన కిటికీల కంటే చెక్క ఫ్రేముకు అద్దాలు బిగించిన తలుపులు అమర్చుకోవడం శ్రేష్ఠంవర్షం పడుతున్నప్పుడు లేదా గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు కిటికీలు మూసి ఉంచినా వెల్తురు వచ్చే అవకాశం ఉంటుంది.
గాలీ వెల్తురు వచ్చే అవకాశం లేకుంటేతాజా గాలి రాదులోపలి కలుషిత గాలి బయటకు పోదుదాంతో విసుగ్గాఅసహనంగా ఉంటుందిత్వరగా అలసిపోయినట్లు అవుతుంది.చీటికిమాటికి కోపం ముంచుకొస్తుందిశారీరక ఆరోగ్యం పాడవుతుందిమానసిక అశాంతి కలుగుతుంది.
ఇంట్లోకి గాలీ వెల్తురూ పుష్కలంగా రాకుంటే నీరసం ఆవరించినట్లుగా ఉంటుందిఇల్లు కళ తప్పుతుందిఅందుకే చీకటి గదుల్ని జైళ్ళ తో పోలుస్తారుస్వేచ్చ లేనట్లుగా,నిరాశానిస్పృహలు ఆవరించినట్లుగా ఉంటుందిపెద్ద కిటికీలు ఉండటం వల్ల బయటి ప్రపంచం కూడా తెలుస్తుంది.
వాస్తు శాస్త్రీయం Vastu is Scientific
వాస్తు గురించి అనేక తర్జనభర్జనలు ఉన్నాయి. "ఈ వాకిలి ఇటువైపే ఎందుకు ఉండాలి,మరోవైపు ఎందుకు ఎండకూడదు..", "వంటిల్లు ఆగ్నేయం దిశలో లేకపోతే ఏమౌతుంది" - లాంటి వాదాలు అనేకం వింటూ ఉంటాం. "ఇండిపెండెంట్ ఇల్లయితేసరే కావలసినట్లు కట్టించుకోవచ్చుకానీ ఫ్లాట్స్ లో వాస్తు ఎలా సాధ్యం?!" అని తల పంకించేవాళ్ళు, "ఆఫీసుల్లో చెప్పిన చోట కూర్చుని పని చేయడం లేదూ.. అక్కడ కూడా వాస్తు గురించి మాట్లాడితే ఉద్యోగం ఊడుతుంది" - అని ఛలోక్తులు విసిరేవాళ్ళు, "ఇంకా నయంరైల్లో కూడా ఈ డైరెక్షన్లోనే వెళ్తాను అంటారేమో" - అంటూ జోకులు వేసేవాళ్ళు ఎదురౌతుంటారు.
రోజంతా పనుల వత్తిడితో నలిగిపోయివిసిగిపోయిన మనంఏదో వంకన కాసేపు కులాసాగా నవ్వుకోడానికి చూస్తాంఅలాంటి చతురోక్తులకు వాస్తు కూడా ఒక టాపిక్ అయితే పరవాలేదు.కానీ వాస్తును చప్పరించితీసిపారేస్తేఆనక మనమే బాధపడాల్సి వస్తుందిఏది ఎటువైపు ఉండాలోఅది అటువైపే గనుక ఉంటే మేలు జరుగుతుందిఉండకూడని వైపు కిటికీలు,దర్వాజాలు గట్రా వాస్తు విరుద్ధంగా ఉంటే ఫలితాలు నెగెటివ్ గానే ఉంటాయి.
భూమికి ఆకర్షణ శక్తి ఉందిభూమి తనచుట్టూ తాను తిరుగుతుందిసూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుందిఈ నేపథ్యంలో భూమి చుట్టూ ఉండే గ్రహాలూనక్షత్రాల ప్రభావం భూమి మీద పడుతుంటుందిఅందుకే ప్రతిదానికీ "ఇదిలా ఉండాలిఅంటూ నియమాలు నిర్దేశించారుఆ నియమాలను పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయి.

వాస్తులో కిటికీల నియమాలు Vastu and Windows
ఇంటికి ముఖద్వారంప్రహరీ గేటులు ఎంత ముఖ్యమో కిటికీలు కూడా అంతే ముఖ్యంఇంటి సైజుగదుల సంఖ్యను బట్టి కిటికీలు ఏర్పాటు చెసుకోవాల్సి ఉంటుందిఒకే గది ఉన్న ఇల్లు అయితే ఒకే ఒక్క కిటికీ ఉండొచ్చుఅలా ఒక్క కిటికీ మాత్రమే ఉంచడంలో దోషం ఏమీ లేదు.ఇల్లు కాస్త పెద్దది అయినప్పుడు 14 కిటికీలు అవసరం కావచ్చుకనుక అవసరాన్ని బట్టి ద్వారాలుకిటికీల సంఖ్య ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుందిఅయితేవాస్తులో ఎన్ని కిటికీలు ఉండాలిఎటువైపు ఉండకూడదు అనే అంశాలకు సంబంధించి కొన్ని నియామాలు ఉన్నాయి.ఆ నియమాలను ఉల్లంఘించకుండా గృహ నిర్మాణం చేసుకోవాలి.
వాస్తు ప్రకారం ఇంటికి 1, 2, 4, 8, 12, 14 చొప్పున కిటికీలు ఉండాలి.
కిటికీలు తూర్పుపడమరఉత్తరదక్షిణ – ఇలా ఏ దిక్కున అయినా ఉండవచ్చుఅయితే నైరుతి వైపు మాత్రం కిటికీలు ఏర్పాటు చేయకూడదు.
నైరుతి వైపు గనుక కిటికీలు ఉంటే కుటుంబసభ్యులకుముఖ్యంగా ఇంటి యజమానికి ఆందోళన తప్పదు.
నైరుతిలో గనుక కిటికీ ఉంటే నడుంనొప్పిమెడనొప్పి లాంటి అనారోగ్యాలు వస్తాయి.
కీళ్ళవాతం వచ్చే అవకాశం ఉంది.
ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి.
వృత్తి వ్యాపారాల్ల్లో లాభాలు ఆర్జించినప్పటికీ ఏదో నెపాన వచ్చిన సొమ్మంతా పోతుంది.
సాఫీగా జరిగిపోవాల్సిన విషయాలు కూడా సమస్యాత్మకంగాబాధాకరంగా మారతాయి.
vastu and fresh air, vastu windows and doors, Vastu rules and windows number, no window in Nairuthi side,vastu and lighting, indian architecture and windows, indian vastu doors and windows rules, indian vastu scientific,  
                      click more

No comments:

Post a Comment