నల్గొండ జిల్లా నాగార్జున సాగర్

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. అనుముల, గుర్రంపోడు, పెద్దవూర, త్రిపురారం, నిడమనూరు మండలాలతో పాటు అదనంగా నాగార్జున సాగర్ కూడా కలిసి ఉంది. 1967లో చలకుర్తి నియోజకవర్గం పేరుతో ఏర్పాటు అయ్యింది. అప్పట్లో అనుముల, పెద్దవూర, నిడమానురు, త్రిపురారం, దామరచర్ల అనే అయిదు మండలాలు ఉండేవి. 2009లో నియోజకవర్గాన్ని పునర్విభన చేసి, దామరచర్ల మండలాన్ని తొలగించి, గుర్రంపోడు మండలాన్ని కలిపారు. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 1,51,427 హెక్టార్లు. నియోజకవర్గంలో మొత్తం 97 గ్రామ పంచాయతీలు, 310 అవాస గ్రామాలు, 82 తండాలున్నాయి.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 1955 డిసెంబర్ 10వ తేదీన ప్రాజెక్టుకు జవహార్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1967 ఆగస్టు 4వ తేదీన ఇందిరాగాంధీ ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వల ద్వారా 22 లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని వేల గ్రామాలకు తాగునీరు అందుతోంది. కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సాగర్ ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 1967లో నీటిని విడుదల చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం 1974లో పూర్తి అయింది.
No comments:
Post a Comment