Tuesday, June 30, 2015

భువనగిరి ఫోర్ట్ హిస్టరీ & వెన్నెల వెలుగుల్లో మన భువనగిరి గుట్ట

వెన్నెల వెలుగుల్లో మన భువనగిరి గుట్ట 


Many of India’s past heritage structure have lost their charm with changes in time but to this day they still represent magnificent pieces of architecture. The Bhongir fort in Nalgonda district of Telangana is one such structure. It is a massive impregnable structure erected by Chalukya ruler, Tribhuvanamalla Vikramaditya VI and the fort is named after him. Bhongir fort’s history is traced back to the 10th century. Initially it was called Tribhuvanagiri, renamed later as Bhuvanagiri and eventually it has become Bhongir Fort. The town of Bhuvanagiri/Bhongir derives its name from this splendid fort, which stands on a monolithic rock.
It is spread across an impressive area of 50 acres at a height of around 500 feet over the top an enormous rock formation. It resembles an unusual egg-shape structure along with two main entry points inturn covered with huge rocks. The fort that is encircled in a moat has underground chamber that is believed to be connect Golconda fort located 50 km away. The fort also witnessed a glorious period under queen Rudramadevi and her grandson Prataparudra’s rule.
After scaling the highest point, the Bhongir fort offers a breathtaking panoramic view of the entire region. Visitors can find an impressive collection of armory, stables, trap doors and other tools of historical interest. The fort also has a Hanuman temple and many ponds at the hilltop. Tourism department and adventure enthusiasts offer special trekking tours to ascend the fort. Bhongir fort is considered a popular tourist destination in Telangana and coupled with a thrilling climbing experience, can you ask for more? History exploration and adventure combined into one, Bhuvanagiri is connected well by roads and train. It is located at a distance of 48 km from state capital, Hyderabad.

Yadagirigutta Temple Timings AND Visiting Hours

Yadagirigutta Temple Timings AND Visiting Hours

Yadagirigutta Sri Laxmi Narasimha Swamy Temple is opening at 4.00 a.m. with suprabatham every morning and it will be closed by 9.30 p.m. detail schedule is as follows :

Morning 

Suprabhatam 04-00 am to 4-30 am
Binde teertam 04-30 am to 5-00 am
Bala Bogam 05-00 am to 5-30 am
Nijabhishekam 05-30 am to 6-30 am
Archana 06-30 am to 7-15 am
Darshnams for all 7-15 am to 11-30 am
Maharaja Bogamu 11-30 am to 12-30 am
Darshanams 12-30 am to 3-00-pm 

NOTE : Dwarabandanamu (close) 03-00 pm to 04-00 pm

Evening

Special Darshnams 04-00 pm to 5-00 pm
Darshnamas for all 05-00 pm to 7-00 pm
Aaradhana 07-00 pm to 7-30pm
Archana 7-30 pm to 8-15 pm
Darshnams for all 8-15 pm to 9 -00 pmMaha nivedhana 9-00 pm to 9-30 pm
Shayanostavams 9-30 pm to 9-45 pm
Note : Temple close 9-45 pm

Monday, June 29, 2015

ఈ నెల 5న యాదగిరిగుట్టకు రాష్ట్రపతి రాక....

President of India to Visit Yadagirigutta (Yadadri)


రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 5న యాదగిరిగుట్టను సందర్శిస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గౌరవ రాష్ట్రపతితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు


Friday, June 26, 2015

నేతి విద్యాసాగర్‌



నేతి విద్యాసాగర్


శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్నకిరేకల్
నియోజవర్గంలోని చెర్కుపల్లి గ్రామంలో జన్మించారు.నకిరేకల్లో నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్గా కొనసాగారు తరువాత బంగారు తెలంగాణా ద్యేయంగా టి ఆర్ యస్ పార్టి లో చేరారు 

ఆయన పని ప్రతిభను గుర్తించినన సి ఎం, కె సి ఆర్ గారు ఎం ఎల్ ఎ కోటలోఎమ్మెల్సీగా ఎన్నిక  చేసారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌  సమర్దుడు అని మల్లి శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ గా ఎన్నిక  వార్తలు వేల్లబుచాయి 

MANCHI MAATA


Wednesday, June 24, 2015

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ చరిత్ర

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ 
నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. అనుముల, గుర్రంపోడు, పెద్దవూర, త్రిపురారం, నిడమనూరు మండలాలతో పాటు అదనంగా నాగార్జున సాగర్‌ కూడా కలిసి ఉంది. 1967లో చలకుర్తి నియోజకవర్గం పేరుతో ఏర్పాటు అయ్యింది. అప్పట్లో అనుముల, పెద్దవూర, నిడమానురు, త్రిపురారం, దామరచర్ల అనే అయిదు మండలాలు ఉండేవి. 2009లో నియోజకవర్గాన్ని పునర్విభన చేసి, దామరచర్ల మండలాన్ని తొలగించి, గుర్రంపోడు మండలాన్ని కలిపారు. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 1,51,427 హెక్టార్లు. నియోజకవర్గంలో మొత్తం 97 గ్రామ పంచాయతీలు, 310 అవాస గ్రామాలు, 82 తండాలున్నాయి.
నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 1955 డిసెంబర్‌ 10వ తేదీన ప్రాజెక్టుకు జవహార్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1967 ఆగస్టు 4వ తేదీన ఇందిరాగాంధీ ఎడమ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేశారు. సాగర్‌ ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వల ద్వారా 22 లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని వేల గ్రామాలకు తాగునీరు అందుతోంది. కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సాగర్‌ ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. 1967లో నీటిని విడుదల చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం 1974లో పూర్తి అయింది. 

Tuesday, June 23, 2015

నల్గొండ జిల్లా చరిత్ర

నల్గొండ జిల్లా చరిత్ర
ల్గొండ జిల్లా చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం. క్రీస్తు శకం 225 నుంచి 300 వరకు పరిపాలించిన ఇక్ష్వాకుల వైభవాన్ని చాటిన ప్రాంతం. శాతవాహన, ఇక్ష్వాకులు, రాష్ట్రకూటులు, విష్ణుకుండిన, చాళుక్య, కాకతీయ, పద్మనాయక, కుతుబ్‌షాహీ, ఆసఫ్‌ జాహీ, ఆధునిక రాజకీయ పరిపాలన అంతటికీ ఇది ఒక ప్రదర్శనశాల. మహాకవులు, పోరాటయోధులు, సాహితీవేత్తలు పుట్టిన గడ్డ నల్గొండ. జిల్లా పుట్టు పూర్వోత్తరాలు
గ్రంథాలయ ఉద్యమాలకు, భూదానోద్యమాలకు, తెలంగాణా సాయుధ పోరాటాలకు, విప్లవోద్యమాలకు పుట్టినిల్లయిన నల్గొండ జిల్లా ఎన్నెన్నో మార్పులతో 1905లో ప్రత్యేకంగా ఏర్పడింది. పట్టణం ప్రాఖ్ద్మీ;న నామం నీలగిరి. రెండు నల్లరాతి కొండల నడుమ ఉన్న ప్రదేశం కావడంతో దీనికి నీలగిరి అని పేరు వచ్చింది. నీలగిరి క్రమంగా నల్లకొండ.. నల్లగొండ... నల్గొండగా స్థిరపడింది. 1961 దాకా జిల్లా ఎల్లల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.
చారిత్రక అంశాలు
జిల్లా ప్రాఖ్ద్మీ;న కాలం నుంచి చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. క్రీస్తు పూర్వం రెండున్నర వేల ఏళ్ల నాటి నాగరికత, సంస్కృతులను ఇముడ్చుకున్న జిల్లాకు 4500 ఏళ్ల చరిత్ర ఉంది. జిల్లాలోని నదీలోయ ప్రాంతాల్లో ఆది మానవుడు సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. తొలి శతాబ్దం కన్నా ముందు ఇక్కడ ఉన్నత మానవ నాగరికత విలసిల్లినట్లు ఎన్నో చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. శాతవాహనులకు పూర్వం జిల్లాలో బౌద్ధం, జైనం పరిఢవిల్లింది. కొలనుపాకలోని జైన దేవాలయం, నాగార్జున సాగర్‌ విజయపురిలోని బౌద్ధారామాలు, విశ్వవిద్యాలయ శిథిలాలు, ఆచార్య నాగార్జునుని కృషి ఆనవాళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, బాదామీ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, కాయస్తులు, కుందూరు చోళులు, రెడ్డి వంశీయులు, పద్మనాయకులు, గజపతులు, బహమనీ గోల్కొండ సుల్తానులు, అసఫ్‌జాహి వంశీయులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. జిల్లాలోని తుమ్మలగూడెం విష్ణుకుండినుల మొదటి రాజధాని. కొలనుపాక కల్యాణీ చాళుక్యుల రాజధానుల్లో ఒకటి. పానగల్లు కుందూరు చోళుల రాజధాని. ఆమనగల్లు, పిల్లలమర్రి రేచర్ల రెడ్ల రాజధానులు. ఆమనగల్లు, రాచకొండ, దేవరకొండ రేచర్ల పద్మనాయకుల రాజధానులు. ఇలా నల్గొండ అనేక రాజ్యాలకు కేంద్రస్థానంగా ఉంది.
భౌగోళిక పరిస్థితి
జిల్లాకు తూర్పున కృష్ణా, ఖమ్మం జిల్లాలు, పశ్చిమాన మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలు, ఉత్తరాన వరంగల్‌, మెదక్‌ జిల్లాలు, దక్షిణాన గుంటూరు, మహబూబ్‌నగర్‌ జిల్లాలున్నాయి. ఈ జిల్లా నీలగిరిగా పేరొందింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 16.25-17.50 ఉత్తర అక్షాంశ రేఖలకు 78.40- 80.50 పూర్వ దీర్ఘాంశ రేఖలకు మధ్య 14.247 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. 27 మండలాల్లో 858.30 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. భౌగోళిక స్వరూపాన్ని అవలోకిస్తే... నైరుతి-వాయువ్య దిశ నుంచి ఆగ్నేయ, ఈశాన్య దిశకు వాలి ఉంది. అనేక చిన్న, పెద్ద పర్వతాలను తన ఒడిలో దాచుకుంది. సరిహద్దుల విషయానికి వస్తే ఉత్తరాన మెదక్‌, వరంగల్‌ తూర్పున ఖమ్మం, కృష్ణా దక్షిణాన మహబూబ్‌నగర్‌, పశ్చిమాన రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. 6.03 శాతం అడవులున్నాయి. 16 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. జిల్లాలోని ప్రాంతాలన్నీ సముద్ర మట్టానికి 300-900 అడుగుల ఎత్తున ఉంటాయి.
నేలల స్వభావం
జిల్లాలో ఎక్కువగా ఎర్రనేలలు, తోడు ఇసుక నేలలు 47శాతం, నల్లరేగడి 9శాతం, చెలక భూములు 44శాతం ఉన్నాయి. శీతోష్ణస్థితి గమనిస్తే వేసవిలో చాలా వేడిగా ఉంటుంది. వేసవిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. నైరుతీ రుతుపవనాల సమయంలో తప్ప సాధారణంగా వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షాపాతం నైరుతితోపాటు ఈశాన్య రుతు పవనాలు, తుపానుల వల్ల వర్షాలు కురుస్తాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కురిసే వర్షాలే మొత్తం సంవత్సర వర్షపాతంలో 70శాతం ఉంటుంది. జిల్లాలో సంవత్సర సాధారణ వర్షపాతం 741 మిల్లీమీటర్లు.
జిల్లా సహజ వనరులు
సున్నపురాయి నిల్వలకు జిల్లా పెట్టింది పేరుగా నిలిచింది. సున్నపురాయి ఆధారంగానే జిల్లాలో అనేక సిమెంటు పరిశ్రమలు నెలకొన్నాయి. సిమెంటు ఉత్పత్తుల్లో జిల్లా అగ్రభాగాన నిలిచింది. ఈ సున్నపురాయి బూడిద, తెలుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమవన్నె ఇంకా రక్తనీలపు రంగులతో లభిస్తుంది. క్వార్జ్‌ గ్రానైట్స్‌, స్టోన్స్‌, యురేనియం ఖనిజ నిక్షేపాలు కూడా లభిస్తున్నాయి. దేవరకొండ సమీపంలో ఏలేశ్వరం వద్ద కృష్ణానది నల్గొండ జిల్లాలో అడుగుపెట్టి తూర్పు వైపుగా 85 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లాకు వెళుతోంది. జిల్లాలో ప్రధాన పంట వరి కాగా, మెట్ట పంటల విషయంలో దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఆముదం పంటను పండిస్తున్న జిల్లాగా పేరొందింది. ప్రస్తుతం పత్తి పంట సాగు కూడా గణనీయంగా పెరిగింది. సుమారు 2లక్షల సాగు విస్తీర్ణం ఉంది. అదే విధంగా బత్తాయి, నిమ్మ తోటల పెంపకంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలోనే రైస్‌ మిల్లు పరిశ్రమలకు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత వస్త్రాలు పోచంపల్లి కేంద్రంగా ఉత్పత్తి అవుతున్నాయి. నాణ్యమైన పాల ఉత్పత్తులకు కూడా జిల్లా పేరుగాంచింది. మత్స్య సంపదకు కొదవలేదు. గీత వృత్తిపై లక్షలాది మంది వృత్తిదారులు ఆధారపడి జీవిస్తున్నారు. పశుసంపద కూడా గణనీయంగా ఉంది. మేకలు, గొర్రెల పెంపకంలో కూడా జిల్లా ప్రసిద్ధి గాంచింది.
సామాజిక విశేషాలు
నల్గొండ జిల్లా భిన్న సంస్కృతుల సమ్మేళనం.భిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉన్నప్పటికి ఇక్కడి ప్రజలు ఐకమత్యంగా ఉంటారు. జిల్లా జనాభా 32 లక్షలకు పైగా ఉంటుంది. ఇందులో 4.32 లక్షలకు పైగా పట్టణ ప్రాంతాలలో ఉండగా 28 లక్షల మందికి పైగా గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు. ప్రధాన జీవనాధారం వ్యవసాయం. జనాభాలో దాదాపు 56 శాతం వరకు వెనుకబడిన కులాల వారే! ఎస్సీలు 17.72 శాతం, ఎస్టీలు 10.55 శాతం ఓసీలు 10 శాతం, మైనారిటీలు 6 శాతం వరకు ఉన్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. అక్షరాస్యత 57.2 శాతం.
పోరాటాల ఖËËల్లా నల్లగొండ
నిజాం నిరంకుశ, పాశవిక, అరాచక చర్యలకు వ్యతిరేకంగా తుపాకులు చేతపట్టి, గళాలు విప్పి, ప్రజల వెన్నుతట్టి వీరోచితంగా పోరాటం నడిపించిన జిల్లా నల్లగొండ. ఉద్యమాలే వూపిరిగా, పోరాటమే లక్ష్యంగా నిజాం గుండెల్లో నిద్రపోయేలా ఉద్యమించిన ఘనచరిత్ర నల్లగొండకు ఉంది. నిజాం ముష్కరపాలనకు చరమగీతం పాడేందుకు సర్వస్వం ఒడ్డిన పోరాటయోధులు పుట్టినది నల్లగొండ జిల్లాలోనే.
రవి అస్తమించని బ్రిటిష్‌ పాలన అంతమొందినా నైజాం నవాబు సర్వ స్వతంత్రుడనని ప్రకటించుకొని తెలంగాణ ప్రజలపై రాక్షసంగా హింసాకాండ సాగించారు. అనేకమంది ప్రజలు దోపిడీ, దౌర్జన్యాలు, అక్రమాలకు గురై జీవచ్ఛవాలయ్యారు. నిజాం ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం శ్రమించినా కష్టజీవులకు పూటగడవడం కష్టమైంది. నైజాంకు గులాములైన జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండేలు, సర్ధేవ్‌ముఖ్‌లు ప్రజలు చేత వెట్టి చాకిరి చేయించారు. ఆభరణాలకు అప్పులిచ్చి వడ్డీ, చక్రవడ్డీలు కలిపి ప్రజలను పీల్చి పిప్పి చేశారు. వీరికి తోడు నైజాం తన పోలీసులనే కాక ఖాసీం రజ్వీతో 50వేల మంది రజాకార్లను తయారు చేసి ప్రజలపైకి వదిలాడు. వీరంతా గ్రామ గ్రామాన ప్రజలపై పడి దోపిడీని యధేచ్ఛగా కొనసాగించారు. ప్రతిఘటించిన వారిని తుపాకీ గుళ్లకు బలిచేశారు. ఇలాంటి నీచ నికృష్టమైన నైజాం పాలనను తుదముట్టించడానికి అనేకమంది నాయకులు సాయుధ పోరుకు సన్నద్ధులయ్యారు. తొలుత నల్గొండ జిల్లా కొలనుపాకలో ఆంధ్ర మహాసభలో చురుకుగా పాల్గొన్న ఆరుట్ల లక్ష్మి నర్సింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి 1935, 36 సంవత్సరాల మధ్యకాలంలో జాగీర్ధారీ వ్యతిరేక పోరాటాలు నిర్వహించారు. పన్నులు చెల్లించమని సహాయ నిరాకరణ ఉద్యమాలను నడిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా బెల్లం కొండయ్య అనే రైతు నాయకత్వంలో తిరుగుబాటు చేసినందుకు నైజాం ప్రభుత్వం రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి బెల్లం కొండయ్య, రాంచంద్రారెడ్డి మద్దిపాపిరెడ్డిపై అనేక కేసులు పెట్టినా అవి నిలువలేదు. వీరి పోరాటాల స్ఫూర్తితో నిరంకుశ సంకెళ్లను తెంచేందుకు సమాయత్తమయ్యారు. రావి నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆంధ్ర మహాసభ అప్పులు, భూమిశిస్తు చెల్లించవద్దని విప్లవాత్మకమైన తీర్మానాన్ని చేసింది. దీనికి తోడు కమ్యూనిస్టులు రంగ ప్రవేశం చేసి ప్రజలకు అండగా నిలిచారు. ఈ తీర్మానాలతో కోపోద్రిక్తులైన రజాకార్లు పన్నులు చెల్లించని ప్రజలను కాల్చిచంపారు. స్త్రీలను చెరిచారు. ప్రజా ఉద్యమాలను అణచడానికి సూర్యాపేట తాలూకా బాలెంల గ్రామంపై దాడిచేసి ఇద్దరు కమ్యూనిస్టు కార్యకర్తలను హతమార్చారు. 1946లో పాత సూర్యాపేటపై దాడిచేసి సరసాని నర్సయ్యను చంపారు. ఇంకా దేవరుప్పల, కామారెడ్డిగూడెం, పులిగడ్డల మల్లారెడ్డిగూడెంలపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో 390మంది రైతులు హతులయ్యారు. 64మంది మహిళలను చెరిచారు. ఈ సంఘటనలో నాలుగు వేలమంది రైతులను అరెస్టు చేశారు. ఈ ఘోరకృత్యాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దాం మొయినుద్దీన్‌ 1947 సెప్టెంబర్‌లో నైజాం పాలనను అంతమొందించేందుకు సాయుధ పోరుకు పిలుపునిచ్చారు. పార్టీ యంత్రాంగాన్ని రహస్య పద్ధతుల్లో నిర్మాణంచేసి పోరాటాలకు వ్యూహాలను పన్నారు. గెరిల్లా దళాలు నిర్మించి దాడులు సాగించారు. గ్రామాల్లో గెరిల్లా దళాలే పరిపాలన సాగించాయి. జాగీర్దారుల ఆధీనంలో ఉన్న 10-12 లక్షల ఎకరాల భూములను ప్రజలకు పంచారు. నైజాంల దొంగ నిల్వలను వెలికితీసి ప్రజలకు పంపిణీ చేశారు. ‘గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడతాం కొడుకో నైజాం సర్కరోడా’ అంటూ మహిళలు సైతం పోరాటాలకు పిలుపునిచ్చారు.
ముందుకురికిన మల్లు స్వరాజ్యం
నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా కొత్తగూడెం గ్రామంలో జన్మించిన మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించారు. ఆమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఆమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పారు. ఆరుట్ల కమాలాదేవి కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొని ఫ్యూడల్‌ సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ 1946-48లో రహస్య జీవితాన్ని గడిపారు. సూర్యాపేట తాలూకా కొత్తగూడెం గ్రామంలో జన్మించిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి నిజాం పాలనకు వ్యతిరేకంగా జిల్లాలో అనేక ఉద్యమాలు కొనసాగించారు. బొమ్మగాని ధర్మభిక్షం, మల్లు వెంకట నర్సింహారెడ్డి వంటి యోధులు తమ పంథాల్లో ఉద్యమాలను కొనసాగించారు. మునగాల, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సిరిపురం, నడిగూడెం, తాడ్వాయి, కొలనుపాక, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, కడివెండి ప్రాంతాల్లో వెట్టిచాకిరీ, జాగీర్దారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. ఫలితంగా పదివేల గ్రామాల్లో ప్రజా రాజ్యానికి పునాదులు వేశారు. తమను ఆర్థికంగా సామాజికంగా ఛిన్నాభిన్నాం చేసిన ప్రభువుపై సామాన్య ప్రజలు చేసిన తిరుగుబాటు హైదరాబాద్‌ సంస్థానంలో నాటి దేశ్‌ముఖ్‌, జాగీర్ధారుల వ్యవస్థను కుప్పకూల్చింది. 1920లోనే విస్నూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పేద ముస్లిం రైతు షేక్‌ బందగీ పోరాటం చేసి వీరమరణం పొందాడు. ఆపై 1930 తరవాత విస్నూరు దేశ్‌ముఖ్‌ మరింతగా రెచ్చిపోయి నైజాం ఫర్మానాలకు అనుగుణంగా లెవీ ఇవ్వని రైతాంగంపై నిర్బంధకాండ, అక్రమ కేసులు, తమ అనుయాయులతో దాడులకు పాల్పడడం మొదలుపెట్టాడు. అదే క్రమంలో అప్పటి నల్గొండ జిల్లా పరిధిలోని కడవెండిలో రైతాంగం ఇళ్లలో చొరబడి అక్రమంగా ధాన్యాన్ని లెవీ రూపంలో దోచుకుపోయాడు. పాలకుర్తిలో రజక స్త్రీ అయిలమ్మ పంట పొలంపైకి తన అనుయాయులను పంపి పంటను కోసుకుపోయే ప్రయత్నంచేసి విఫలమయ్యాడు. సంఘంగా ఏర్పడిన గ్రామస్థులు అయిలమ్మ పంటను కోసి ధాన్యాన్ని ఆమె ఇంటికి చేర్చిన వైనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బాటలు వేసింది.
దొడ్డి కొమరయ్య బలిదానం... ఉప్పొంగిన జన కెరటం
1946 జులై 4న కడవెండి గ్రామంలో సంఘం కార్యకలాపాలు పెరుగుతున్నాయని గమనించిన విస్నూరు దేశ్‌ముఖ్‌ కడవెండికి తన అనుయాయులను పంపి సంఘం కార్యకర్తల ఇళ్లపై రాళ్లు వేయించారు. దీనికి ప్రతిగా గ్రామస్థులు కర్రలు, వడిసెలలు, కారంపొడి చేతబూని నినాదాలు చేస్తూ భారీ ­రేగింపునకు సిద్ధమయ్యారు. ఈ వూరేగింపు వూరి ప్రధాన కూడలిలో ఉన్న జమిందారు ఇంటికి వచ్చే సరికి పాకల్లో మాటువేసి ఉన్న జమీందారు కిరాయిమూకలు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ­రేగింపునకు నాయకత్వం వహిస్తున్న గ్రామ సంఘం నాయకుడు దొడ్డి కొమరయ్య పొట్టలో తుపాకీ గుళ్లు దూసుకుపోయాయి. దీంతో కొమరయ్య అక్కడికక్కడే నేలకొరిగి మరణించారు. ఈ మరణం తెలంగాణా రైతాంగంలో అగ్నికణాన్ని మండించింది. వూరూరా ఉద్యమ దళాలు ఏర్పడి నైజాం పాలనకు తెరదించేందుకు కారణమైంది. ఆయన అన్న దొడ్డి మల్లయ్య కాలిలోకి, మంగలి కొండయ్య నుదుటికి, ఆయన సోదరుడు నర్సయ్య ముంజేయి నుంచి తూటాలు దూసుకుపోయాయి. అయినా ప్రజలు భయకంపితులై పారిపోకుండా రక్తానికి రక్తం అన్న నినాదాలు చేస్తూ జమిందార్‌ భవనాన్ని చుట్టిముట్టి కాల్పులకు దిగిన కిరాయి మూకలకు బుద్ధిచెప్పి, జమిందార్‌ ఇంటికి నిప్పంటించే యత్నం చేశారు. అదే సమయంలో 60మంది రిజర్వు పోలీసులు చేరుకొని ప్రజలను శాంతింపజేశారు. దొడ్డి కొమరయ్య మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆయన అంతిమ యాత్రకు వేలాదిమంది ప్రజలు కడవెండికి చేరుకొని భారీ వూరేగింపు, నినాదాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. రకరకాల హింసలు, దౌర్జన్యాలు జరిగినా.. జమిందారుకు తలవంచి బతికేది లేదని ప్రకటిస్తూ ఆ మరుసటి రోజు నుంచి జమిందారుకు చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను నిలిపివేశారు. దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణలో నిద్రాణమై ఉన్న ఆగ్రహాన్ని ప్రజ్వరిల్లచేసి తొలుత నల్గొండ జిల్లాలో రైతాంగ తిరుగుబాటుకు అగ్గిని రాజేసింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో రైతాంగ ఉద్యమం మరింత ఉద్ధృతమై పోయింది. తుంగతుర్తి, ఆలేరు, నోముల, కొలనుపాక, వంగపల్లి తదితర ప్రాంతాల్లో ప్రజా దళాలు విరుచుకుపడి నైజాం మూకలను నరకయాతన పెట్టాయి. తమపై పెరిగిపోతున్న నిర్బంధాన్ని మరింత పకడ్బందీగా ఎదుర్కొనేందుకు గ్రామ దళాలు, నిర్మూలన దళాలు, గెరిల్లా దళాలు అనే మూడు రకాల సైన్యాలను ఏర్పాటు చేశారు. సాయుధ దళాల నిర్మాణం తరవాత రావులపెంట పోలీసు క్యాంపుపై తొలిదాడి చేసి ఆయుధాల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆపై కోటపాడు, ముస్త్యాలపల్లి, చింతలమ్మగూడెం, కందకట్ల, మామిళ్లగూడెం, బిక్కుమళ్లలో దళాలు విరుచుకుపడుతుండగా మరో పక్క నైజాం సైన్యాలు సైతం ఉద్యమాన్ని అణిచివేసేందుకు తుపాకులు ఎక్కుపెట్టాయి. అప్పటి భువనగిరి తాలూకాలోని పులిగిళ్ల గ్రామంలోనే 22మందిని రజాకార్‌ సైన్యం హత్య చేసింది. ఆపై వెల్మజాల, రేణికుంట, పాతర్ల పహడ్‌, రాపోక, సోలిపేట, ఎర్రబెల్లి, అమ్మనబోలులో రజాకార్ల కాల్పులకు పెద్ద సంఖ్యలో సాయుధ వీరులు అమరులయ్యారు. ఒకవైపు అమరుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజా ఉద్యమం మరింత పతాకస్థాయికి చేరి పదివేల గ్రామాలు ప్రజా రాజ్య స్థాపన దిశగా పయనించాయి.
నైజాం నవాబు పీచమణిచేందుకు ఉవ్వెత్తున ఎగిసిన రైతాంగ సాయుధ పోరాటానికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహిస్తే... స్టేట్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పిల్లలమర్రికి చెందిన ఎమ్మెత్తుల కేశవరావు ఆధ్వర్యంలో సత్యాగ్రహ పోరాటాలు సాగాయి. భారతదేశానికి విముక్తి కోసం మహాత్మాగాంధీ అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఉరకలు పెట్టిస్తే హైదరాబాద్‌ సంస్థానంలో నైజాంకు వ్యతిరేకంగా రైతు కూలీలను ఏకం చేసి వారిలో చైతన్యపు అగ్ని కణాల్ని రగిల్చిన ప్రజాతంత్ర ప్రజాస్వామ్య కూటమి (పీడిఎఫ్‌) జిల్లా గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.
ఎర్రజెండాకు జనం అండదండలు
రామానంద తీర్థ ఆధ్వర్యంలో స్టేట్‌ కాంగ్రెస్‌ సైతం సత్యాగ్రహాలతో నైజాం వ్యతిరేక పోరాటాలు చేసినా అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. దీంతో నల్గొండ జిల్లా కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా మారింది. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జనం అన్నింటా ఎర్రజెండాకే పట్టం కట్టారు. తొలి ఎన్నికల్లో తొమ్మిది శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులు బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన తెలంగాణా సాయుధ పోరాట వీర సేనాని రావి నారాయణరెడ్డి 88శాతం ఓట్లతో భారతదేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించి అందరి చూపులు నల్గొండపై మళ్లించారు. అదే ఎన్నికల్లో ఆయన భువనగిరి శాసనసభ నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించిన తరవాత రాజీనామా చేశారు. 1952 ఎన్నికల్లో ఆలేరు స్థానం నుంచి మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలిగా వీరనారి ఆరుట్ల కమలాదేవి శాసనసభలో అరంగ్రేటం చేశారు. 1957 ఎన్నికలతో పాటు 1962 ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుల విజయయాత్రలను ఎవరూ అడ్డుకోలేకపోయారు. అదే సమయంలో ఆదిలాబాద్‌ జిల్లా వాంఖిడికి చెందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ 1957 ఎన్నికల్లో చిన్న కొండూరు శాసనసభ స్థానం నుంచి పోటీచేసి స్వల్ప మెజార్టీతో విజయం సాధించి జిల్లాలో కాంగ్రెస్‌ ఉనికిని నిలిపారు. 1962 ఎన్నికల్లో సూర్యాపేట ద్విసభ నియోజకవర్గం నుంచి ఎం.రంగారెడ్డి, హుజుర్‌నగర్‌, మిర్యాలగూడ నుంచి అక్కిరాజు వాసుదేవరాజు, తిప్పన చిన్న కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. మిగతా స్థానాలను కమ్యూనిస్టులు ఎగరేసుకుపోయారు. 1964లో ఉభయ కమ్యూనిస్టుల మధ్య ఏర్పడిన ఖ్ద్మీ;లిక జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి దోహదపడింది. అయినా.. 1967 జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ రథసారథి సీపీఎం నేత నర్రా రాఘవరెడ్డి, భీంరెడ్డి నర్సింహ్మరెడ్డి విజయ ఢంకా మోగించారు. 1978 ఎన్నికల్లో తెలంగాణా సాయుధ పోరాట వీరనారి, సీపీఎం కేంద్ర నాయకురాలు మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
‘భూదాన్‌’ ఉద్యమానికి నాంది పలికిన పోచంపల్లి
విత్తనం నాటితే మహా వృక్షమవుతుంది. ఓ స్ఫూర్తివంతమైన వ్యక్తిచెప్పిన మాట మహా ఉద్యమానికి దారి తీస్తుంది. అలాంటిదే పోచంపల్లిలో చోటుచేసుకొని ఆ వూరు నేటికీ ప్రపంచంలోనే కలికి తురాయిగా మిగిలింది. వంద ఎకరాల భూదానంతో మొదలైన భూదాన విప్లవం లక్షల ఎకరాలు మించినా నేటికీ అప్రతిహతంగా ముందుకు సాగుతూనే ఉంది. ఈ భూదానోద్యమానికి వెదిరె రామచంద్రారెడ్డి ముందడుగు వేస్తే ఈ నడకకు లయనేర్పి పలువురికి మేలు చేసేలా చేసింది ఆచార్య వినోభాబావే.
వినోభాబావే పోచంపల్లి రాక: స్వాతంత్య్రం అనంతరం మహత్మాగాంధీ మరణంతో ఆయన ఆశయ సాధన కోసం ప్రియశిశ్యుడైన వినోభాబావే సిద్ధమయ్యారు. పౌనార్‌ ఆశ్రమాన్ని వీడి దేశమంతటా పాదయాత్రలు చేపట్టడానికి పయనమయ్యాడు. అదే సమయంలో శ్రీరామకృష్ణ దూత్‌ ఆహ్వానం మేరకు 1951లో హైద్రాబాద్‌లో గల శివరాంపల్లిలో జరిగిన అఖిల భారత సర్వోదయ సమ్మేళనానికి హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న హత్యలు, దోపీడీలు, దౌర్జన్యకాండల గూర్చి తెలుసుకున్నారు. ఈ సంఘటనలకు కారణాలు తెలుసుకొని పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి 1951 ఏప్రిల్‌ 18న ఉదయం పోచంపల్లి చేరుకున్నారు.
1951 ఏప్రిల్‌ 18 దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజవుతుందని ఎవరూ వూహించి ఉండరు. అదొక అసంకల్పిత సంఘటన. పోచంపల్లికి చేరుకున్న ఆచార్య వినోభాబావేకు అశేష జనవాహిని స్వాగతం పలికారు. దళితవాడ సమీపంలోని చెరువు కట్ట వద్ద గల జువ్విచెట్టు కింద ఏర్పాటుచేసిన వేదికపై సమావేశమయ్యారు. వినోభాబావే దళితుల యోగక్షేమాలు అడిగే క్రమంలో భూమిస్తే సాగు చేసుకొని జీవిస్తాం అనే మాట వినపడింది. ఆ ఒక్క మాట ఓ మహా ఉద్యమానికి తెరలేపింది. అదే సాయంకాలం వినోభాజీ భూస్వాములు ముందుకొచ్చి భూమి దానమివ్వగలరా అని కోరారు. అంతే వెంటనే వెదిరె రామచంద్రారెడ్డి అనే భూస్వామి సేద్యయోగ్యమైన వంద ఎకరాల భూమిని దానం ఇస్తానని ప్రకటించారు. అదే నిండు సభలో దానం రూపేణా లభించిన భూమిని వినోభాబావే దళితులకు పంచి ఇచ్చి భూదానోద్యమానికి అంకురార్పణ చేశారు. అప్పటినుంచి పోచంపల్లి పేరు భూదాన్‌ పోచంపల్లిగా మారింది.
రెండో జన్మస్థలంగా చెప్పుకున్న వినోభాబావే: మహాత్మాగాంధీ తర్వాత చరిత్రలో నిలిచిన వ్యక్తి వినోభాబావే. భూదానోద్యమానికి సారధ్యం వహించి ప్రపంచ చరిత్రలో స్థిరస్థానాన్ని సంపాదించారు. తనను కార్మోన్ముకుడిగా చేసిన పోచంపల్లి తనకు రెండో జన్మస్థలం అని ఆయన చెప్పుకున్నారు. పోచంపల్లికి రాక పూర్వ వినోభాబావే దేశంలో ప్రముఖ నాయకులలో ఒకరిగా భావించబడేవారు. కానీ పోచంపల్లికి వచ్చిన తర్వాత భూదానోద్యమ పితగా ప్రపంచంలో సమ సమాజ నిర్మాతగా ఎంతో ఖ్యాతి గడించారు.
అదే స్ఫూర్తితో: భూదాన్‌పోచంపల్లిలో జరిగిన భూదానోద్యమ స్ఫూర్తితో భూదాన ఉద్యమం ఒక స్పష్టమైన కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమం వేలాది కార్యకర్తలను ఆకర్షించింది. 1970 వరకు దాదాపు 40 లక్షల ఎకరాల భూమి భూదానోద్యమంలో లభించింది. వివిధ రాష్ట్రాల్లో లక్షల ఎకరాల భూమిని భూస్వాములు సేకరించి భూమి లేని పేదలకు పంచడం జరిగింది. నేటికీ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంతటి మహోద్యమానికి స్ఫూర్తినిచ్చిన భూదాన్‌ పోచంపల్లిలో ప్రతి ఏడు ఏప్రిల్‌ 18న భూదాన్‌ జయంతి సెప్టెంబర్‌ 11న వినోభా జయంతి ఉత్సవాలను స్థానిక వినోబా సేవా సంఘం వారు నిర్వహిస్తారు. ఈ మహా పురుషులిద్దరి సంస్మరణార్థం 1996 సెప్టెంబరు 11న వారి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
భూదానోద్యమానికి ఆద్యుడు రామచంద్రారెడ్డి
జమిందారులైన వెదిరె నరసింహారెడ్డి, లక్ష్మీ నరసయ్యలకు రామచంద్రారెడ్డి జన్మించారు. రామచంద్రారెడ్డి ప్రాథమిక విద్యను హైదరాబాద్‌లో పూర్తిచేసి ఉన్నత విద్యకోసం పూణే వెళ్లారు. ఫెర్గూసం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించి 1929లో న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. అప్పటి నిజాం ప్రభుత్వంలో జనగాం తహశీల్దార్‌గా కొంతకాలం పాటు పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరవాత కొంతకాలం నల్గొండలో న్యాయవాదిగా పనిచేశారు. పోచంపల్లి గ్రామంలో చదువుకొనేందుకు పాఠశాల లేని సమయంలో సొంత ఖర్చుతో ఉపాధ్యాయుణ్ని నియమించి విద్యాబోధన చేయించారు. ఆనాడు ఉన్న వెట్టి చాకిరి దురాచారాన్ని స్వయంగా నిర్మూలించారు. గ్రామంలో అజాత శత్రువుగా ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తూ గ్రామ ప్రజలతో ప్రేమగా ‘భాయిసాబ్‌’గా అని పిలిపించుకొన్న ఉదార స్వభావులు రామచంద్రారెడ్డి. ఆయనకు మరాఠీ, పార్శీ, ఉర్దూ, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం ఉంది. ఇతడు 1976లో జరిగిన భూదాన రజత ఉత్సవాల్లో భూదాన జ్యోతిని చేతబూని పాదయాత్రలో పాల్గొన్నారు. 1979లో జరిగిన గోవధ నిషేధ ఉద్యమంలో భూదాన పోచంపల్లి నుంచి కేరళ రాష్ట్రానికి వెళ్లిన పాదయాత్ర బృందానికి నాయకత్వం వహించారు. 1986లో తన భార్య మరణంతో మానసికంగా కుంగిపోయిన రామచంద్రారెడ్డి తన 82వ ఏట 1987 డిసెంబర్‌లో స్వర్గస్తులైనారు. ఈయన త్యాగాలకు గుర్తుగా పోచంపల్లిలో వినోభా ఆశ్రమానికి ఎదురుగా పద్ధెనిమిది అడుగుల ఏకశిల భూదాన స్థూపం నిర్మించారు. తుంగతుర్తిలోని స్వాతంత్య్ర సమరయోధులు
తుంగతుర్తి ప్రాంతం సాయుధ పోరాట వీరులకు పురిటిగడ్డ. మండలంలోని కొత్తగూడెంలో పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులకు పుట్టినిల్లు. గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఐదుగురు పోరాటంలో చురుకుగా పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. వారిలో ప్రముఖుడు స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆయన సోదరీమణులు శశిరేఖ, మల్లుస్వరాజ్యం, సోదరుడు కుశలవరెడ్డి, వారి బావలు దాయం రాజిరెడ్డి, మల్లు వెంకటనర్సింహారెడ్డి, ప్రియంవదలు ఉన్నారు. వీరితో పాటు కొత్తగూడెం గ్రామస్థులు సుమారు 20 మందికి పైగా పోరాటంలో వారి అడుగుజాడల్లో నడిచారు. ఉద్యమ స్ఫూర్తినిచ్చిన వీరితో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో అనేక మంది స్వాతంత్య్ర, సాయుధపోరాటంలో చురుకుగా పాల్గొని అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. వీరిలో మెంతబోయిన గంగయ్య కొత్తగూడెం, పాటి యల్లారెడ్డి వెల్గుపల్లి, గనె వెంకన్న, ఎండీ యూసఫ్‌అలి, ఎర్ర మల్లయ్య, వర్ధెల్లి రాములు, వీరబోయిన పిచ్చయ్యలు పాల్గొన్నారు. వీరితో పాటు సుమారు వంద మంది స్వాతంత్య్ర, సాయుధపోరాటయోధులున్నారు.
పోచంపల్లి డిజైన్‌లకు పేటెంట్‌ హక్కు
మగువల మనసు దోచే ఖ్ద్మీ;రల్లో పోచంపల్లి పట్టు ఖ్ద్మీ;రకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ విదేశాల్లో సైతం పోచంపల్లి వస్త్రాల, డిజైన్‌ల పట్ల మగువలు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆ ఘనతే పోచంపల్లి వస్త్రాల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. వస్త్రాల తయారీ విశిష్టతను గుర్తించిన ప్రభుత్వం ‘పోచంపల్లి డిజైన్లకు 2003లో పేటెంట్‌ హక్కును కల్పించింది’. దీంతో చేనేత ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావడంతో నేత కార్మికుల ప్రతిభకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించింది. టై అండ్‌ డై డిజైన్ల ప్రత్యేకత
టై అండ్‌ డై అంటే కట్టడం, రంగులు అద్దడం. ఈ విధానంతో దారం దారం కలిపి పలు రంగుల్లో పట్టుఖ్ద్మీ;రను తయారు చేస్తారు. నిలువు పేక, అడ్డం పేక డిజైన్లు చేసే ఘనత పోచంపల్లి వస్త్రాలకే దక్కుతుంది. కుటుంబం మొత్తం 64 గంటలు నిరంతరంగా పని చేస్తేనే ఒక ఖ్ద్మీ;ర తయారవుతుంది. చేనేత వస్త్రాలతో ఖ్ద్మీ;రలే కాకుండా బెడ్‌షీట్లు, డ్రెస్‌ మెటిరియల్స్‌, బ్యాగులు, దివాన్‌సెట్లు తయారు చేసి కార్మికులు తమ పనితనాన్ని చాటుకున్నారు.
విదేశాలకు ఎగుమతులు
పోచంపల్లి వస్త్రాలు 1986 నుంచే పోచంపల్లి, కొయ్యలగూడెం, పుట్టపాక గ్రామాల నుంచి మలేషియా, సింగపూర్‌, బంగ్లాదేశ్‌, లండన్‌, జర్మనీ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యేవి. విదేశాల్లో వినియోగదారులకు కావాల్సిన డిజైన్లను ఆర్డర్‌ చేసుకొని మరీ ఎగుమతులుచేసేవారు. ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం డ్రెస్‌ మెటీరియల్సే. ప్రతి రోజు పోచంపల్లి వస్త్రాలు 4 లారీల నిండా మద్రాస్‌ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం దేశ విదేశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి వస్త్రాలను విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా కూడా విక్రయాలు జరుగుతున్నాయి. చేనేత పార్కు
చేనేత పరిశ్రమను విస్తరింపజేయాలనే సదుద్దేశంతో 2008లో రూ.47 కోట్లతో మండల పరిధిలోని కనుముకులలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేనేత పార్కును ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా చేనేత వృత్తిపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు వృత్తిలో శిక్షణ అందించి ఉపాధిని కల్పిస్తున్నారు.
విదేశీయులకు పాఠాలు
చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని స్వయంగా అధ్యయనం చేయడానికివిదేశీయులు సైతం పోచంపల్లిని సందర్శిస్తుంటారు. చేనేత మగ్గాలపై వస్త్రాల తయారీ విధానాన్ని చూసి ఆశ్చర్య చకితులౌతారు. వస్త్రాలను సైతం ధరించి ముచ్చట తీర్చుకుంటారు. నేత కార్మికుల పనితనానికి ముగ్థులౌతారు.
పోచంపల్లి పట్టుఖ్ద్మీ;రకు ఆద్యుడు కర్నాటి అనంతరాములు
పోచంపల్లి వస్త్రాన్ని మొదటగా ‘పగిడి’ అనేవారు. 1944లో మొదటిసారిగా ప్రత్యేక శైలిని ఉపయోగించి పోచంపల్లి ఖ్ద్మీ;రలకు ఆద్యుడైనవ్యక్తి పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు. 1955లో ఆలిండియాహాండ్లూమ్‌ బోర్డు ఛైర్మన్‌ కమలాబాయి ఛటోపాధ్యాయ పోచంపల్లిని సందర్శించి కాటన్‌పై పోచంపల్లి డిజైన్‌లను చూసి సిల్క్‌లో ప్రవేశ పెట్టాలని కోరింది. 1956లో ఆప్కో వారు కర్నాటి అనంతరాములును బెనారస్‌ పంపి చేనేతలోని మెళకువలను నేర్పించారు. తిరిగి వచ్చిన తరువాత నేతకై పట్టుదారం లేదని గ్రహించాడు. ముంబాయిలో ముడిసరుకు పట్టుదారాన్ని తీసుకొని ఆర్డర్‌పై ఖ్ద్మీ;రలను తయారు చేసేవారు. 1956లో మొదటిసారిగా కర్నాటి అనంతరాములు పోచంపల్లి పట్టుఖ్ద్మీ;రను తయారు చేశారు. అప్పుడు ఖ్ద్మీ;ర ఖరీదు రూ.70. 1974లో పట్టుదారానికి రంగుల అద్దకం తెలుసుకొనేందుకు తంజావూరు వెళ్లి సుమారు 8 నెలలు ఆ కళను ఆకళింపు చేసుకొని తిరిగి వచ్చారు. 1960లో లేపాక్షి సంస్ధ పెద్దనాయుడమ్మ ఆధ్వర్యంలో సుమారు 15 మగ్గాలపై ఖ్ద్మీ;రలతయారీ ప్రారంభించారు. పోచంపల్లి ఖ్ద్మీ;రలను ముంబైలో ముఖ్యంగా గుజరాతీలు ఎంతో ఇష్టపడేవారు.

నల్గొండ జిల్లా ప్రముఖుల సమాచారం

నర్రా రాఘవరెడ్డి
‘వట్టిమర్తికి చెందిన రాఘవరెడ్డి నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా సీపీఎం నుంచి ఎన్నికయ్యారు. సీపీఎం శాసనసభా పక్ష నేతగా ¹Øడా వ్యవహరించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేసిన నాయకుడిగా పేరుంది. ప్రస్తుతం వట్టిమర్తిలోని ఆయన సొంత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
’ఫోన్‌ నెంబర్‌: 9440076116
గుత్తా సుఖేందర్‌రెడ్డి
‘ఉరుమడ్లకు చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి తెదేపా నుంచి మదర్‌ డెయిరీ ఛైర్మన్‌గా, ఏపీ డెయిరీ ఛైర్మన్‌గా, ఒక పర్యాయం ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఫోన్‌నెంబర్‌: 9493037016
చెరుపల్లి సీతారాములు
‘నేరడకు చెందిన చెరుపల్లి సీతారాములు సీపీఎం జిల్లా కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్నారు.
ఫోన్‌ నెంబర్‌: 9490098333
కాసం వెంకటేశ్వర్లు
‘పెద్దకాపర్తికి చెందిన కాసం వెంకటేశ్వర్లు ఏబీవీపీ సంఘ నాయకుడుగా ఉస్మానియా యూనివర్శిటీలో పని చేసి భాజపాలో చేరారు. . బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. ప్రస్తుతం భాజపా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్నారు.
ఫోన్‌ నెంబర్‌: 9848073236
సుంకరి మల్లేష్‌గౌడ్‌
‘ఉరుమడ్లకు చెందిన మల్లేష్‌గౌడ్‌ డీసీసీ అధ్యక్షునిగా పని చేశారు.ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్నారు.
’ఫోన్‌నెంబర్‌: 9848143533
ప్రొఫెసర్‌ ఎం.ఎన్‌రెడ్డి
‘చిట్యాలకు చెందిన ఎంఎన్‌రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీలో జియాలజీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1988-89లో అంటార్కిటికా ఖండానికి దేశం నుంచి వెళ్లిన శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడుగా ఉన్నారు. భూదాన్‌పోచంపల్లిలోని శ్రీరామానందతీర్ధ గ్రామీణ సంస్థ ఛైర్మన్‌గా, ఐఐటీ(ఢిల్లీ) బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌లో సభ్యుడుగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.
’ఫోన్‌నెంబర్‌: 9848304268

నేతి విద్యాసాగర్‌
శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌నకిరేకల్‌
నియోజవర్గంలోని చెర్కుపల్లి గ్రామంలో జన్మించారు.నకిరేకల్‌లో నివాసం ఉంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
ఫోన్‌నెంబర్‌: 9866319527
నోముల నర్సింహయ్య,
మాజీ శాసన సభ్యుడు, నకిరేకల్‌

నకిరేకల్‌ మండలం పాలెం గ్రామానికి చెందిన నోముల నర్సింహయ్య నకిరేకల్‌ ఎమ్మెల్యేగా రెండు సార్లు ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతూ ప్రస్తుతం నకిరేకల్‌లో నివాసం ఉంటున్నారు. గతంలో సీపీఎం శాసనససభపక్షనేతగా పనిచేశారు.
ఏనుగుల శ్రీనివాస్‌రెడ్డి
ఈయన అమెరికాలోని ఆటా ట్రస్టీగా కొనసాగుతున్నారు. మండలంలోని కొర్లపహాడ్‌ గ్రామంలో జన్మించారు. అమెరికా నుంచి వచ్చిన సమయంలో వివిధ సేవా కార్యక్రమాలునిర్వహిస్తుంటారు.
ఫోన్‌ నెంబర్‌: 0017036085252
పూల రవీందర్‌
శాసనమండలి ఉపాధ్యాయ నియోజవర్గం సభ్యునిగా ఎన్నికైన పూల రవీందర్‌ కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన వారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధ్యాయునిగా పని చేశారు.
ఫోన్‌నెంబర్‌:9866818560.
మూసపాటి కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే నకిరేకల్‌
నకిరేకల్‌లో నివాసం ఉంటున్న మూసపాటి కమలమ్మ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. 1972లో నకిరేకల్‌ శాసనసభ సభ్యురాలిగా ఉన్నారు.. ఈమె హైదరాబాద్‌లో జన్మించారు. నకిరేకల్‌లో నివాసం ఉంటున్నారు.
పాలవరపు లక్ష్మీనర్సయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పాలవరపు లక్ష్మీనర్సయ్య స్వాతంత్య్ర సమర యోధులు. శాలి గౌరారం మండలం ఇటుకుల పహడ్‌లో జన్మించిన ఈయన గత 35ఏళ్ల నుంచి నకిరేకల్‌లో నివాసం ఉంటున్నారు. రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నారు.
వాస్తుశిల్పి, మాజీ ఎంపీ బద్ధం నర్సింహారెడ్డి
నకిరేకల్‌కు చెందిన వాస్తుశిల్పి బద్ధం నర్సింహారెడ్డి(బీఎన్‌రెడ్డి) మిర్యాలగూడ పార్లమెంట్‌ సభ్యునిగా మూడు సార్లు ప్రాతినిధ్యం వహించారు. బిల్డర్‌గా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పేరున్న సీబీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల ఛైర్మన్‌గా ఉన్నారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
స్వగ్రామం:నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలప్రస్తుతం ఈయన నల్గొండ శాసనసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.
ఫోన్‌నెంబర్‌: 9948297777
చిరుమర్తి లింగయ్య
స్వగ్రామం:నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల ప్రస్తుతం ఈయన నకిరేకల్‌ శాసన సభ్యునిగా కొనసాగుతున్నారు
ఫోన్‌నెం:9441025826
బండ నరేందర్‌రెడ్డి
స్వగ్రామం:నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి ప్రస్తుతం ఈయన తెరాస జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.
ఫోన్‌ నెంబర్‌: 9849101188
రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి
స్వగ్రామం: నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ప్రస్తుతం ఈయన జిల్లా తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు.
ఫోన్‌నెంబర్‌:9440166102


మోత్కూరు మండల ప్రముఖులు
మోత్కూరు, న్యూస్‌టుడే:
పేరు: డీవీరాయుడు. ప్రస్తుతం సెర్ఫ్‌ రాష్ట్ర డైరెక్టర్‌. విశ్రాంత కలెక్టర్‌. స్వగ్రామం మోత్కూరు. నిజామాబాద్‌ కలెక్టర్‌గా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అమలు చేయడంలో రాష్ట్రంలో ద్వితీయ బహుమతిని అందుకున్నారు.

పేరు: కొప్పుల శ్రీకర్‌రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌ పాస్‌పోర్ట్‌ అధికారిగా పని చేస్తున్నారు. ఢిల్లీలో పాకిస్తాన్‌ రాయబార కార్యాలయంలో డిప్యూటి సెక్రటరీగా పని చేశారు. స్వగ్రామం కొండగడప మోత్కూరు మండలం
పేరు: తీపిరెడ్డి వెంకట్‌రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆదాయ పన్నుల శాఖ కమీషనర్‌గా పని చేస్తున్నారు. ఈయన గతంలో అడిషనల్‌ కమీషనర్‌గా ముంబాయి, పూణే తదితర చోట్ల పని చేశారు. స్వగ్రామం వెల్దేవి. మండలం మోత్కూరు.
పేరు: కె.విద్యాసాగర్‌. ప్రస్తుతం హైదరాబాద్‌ సీఎం కార్యాలయంలో పని చేస్తున్నారు. గతంలో నల్గొండ, హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయాలలో పరిపాలనా అధికారిగా పని చేశారు. స్వగ్రామం అడ్డగూడూరు, మండలంమోత్కూరు.
పేరు: యానాల ముత్యంరెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఏసీపీగా పని చేస్తున్నారు. ఈయన కొంత కాలం స్పెషల్‌పోలీసుశాఖలో డీఎస్‌పీగా పని చేశారు. స్వగ్రామం ముశిపట్ల, మోత్కూరు మండలం.
పేరు: సుద్దాల హన్ముంతు ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాటయోధుడు. స్వగ్రామం. సుద్దాల, మండలం గుండాల.
పేరు: సుద్దాల అశోక్‌తేజ. సినీగేయరచయిత. సుద్దాల హన్ముంతు కుమారుడు. జాతీయ అవార్డు గ్రహీత. స్వగ్రామం సుద్దాల, మండలం గుండాల, ప్రస్తుత నివాసం ఉప్పల్‌,హైదరాబాద్‌
పేరు: మద్దిరంగారెడ్డి. హైదరాబాద్‌ క్రికెట్‌అసోసియేషన్‌ కార్యదర్శిగా, అధ్యక్షునిగా, పలు పదవులు చేపట్టారు. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డుకు వరుసగా మూడు పర్యాయాలు ఉపాధ్యక్షునిగా పని చేసి, ఇటీవలే మృతిచెందారు. స్వగ్రామం మోత్కూరుకు సర్పంచిగా కూడా పని చేశాడు.
పేరు: ప్రొఫెసర్‌ కె.లక్ష్మణ్‌. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌. స్వగ్రామం కోటమర్తి, మండలం మోత్కూరు.
పేరు: చాడ గిరిధర్‌. సినిమా, టీవీ నటుడు. కుబుసం సినిమాతో హీరోగా చిత్రరంగంలో ప్రవేశించాడు. పలుటీవీ సీరియల్లలో నటిస్తున్నారు. స్వగ్రామం చాడ, మండలం ఆత్మకూర్‌(ఎం).
పేరు: ఏలె ధని. సినిమా పబ్లిసిటీ డిజైనర్‌. వందలాది సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. భరతముని అవార్డును వరుసగా ఐదు పర్యాయాలు అందుకున్నారు. స్వగ్రామం. కదిరేనిగూడెం, మండలం ఆత్మకూర్‌(ఎం)
పేరు: సుద్దాల సుధాకర్‌ తేజ. వాస్తుశాస్త్రంలో ప్రావీణ్యం పొంది, హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌ లాంటి వాటికి వాస్తునిపుణుడిగా సూచనలు అందించారు. స్వగ్రామం సుద్దాల, మండలం గుండాల.
పేరు: అశోక్‌రెడ్డి. సినిమా పేరు మూలవిరాట్‌, పలుసినిమాలలో, టీవీ సీరియల్స్‌లో పని చేశారు. టీవీయాంకర్‌గా కూడా పని చేశారు. స్వగ్రామం వస్తకొండూరు, మండలం గుండాల.
పేరు: కె.సీతారాంరాయుడు. అందరూ శీతయ్యపటేల్‌ అంటారు. తెలంగాణ సాయుధపోరాట యోధుడు, ఆశుకవిగా మంచి గుర్తింపు పొందిన కళాకారుడు స్వగ్రామం మోత్కూరు.
పేరు: అనంతుల శేఖర్‌. ధూంధాం శేఖరుగా గుర్తింపు పొందారు. తెరాస రాష్ట్ర కళాకారుల బృందంలో ఒకరు. అనేక ధూం...ధాం కార్యక్రమాలు నిర్వహించారు. స్వగ్రామం చౌళ్లరామారం, మండలం మోత్కూరు.
పేరు:మోత్కూరు నరహరి. ఆంధ్రసారస్వత విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్‌గా పని చేశారు. యుటీఎఫ్‌ రాష్ట్రనాయకుడు స్వగ్రామం బుజిలాపురం, మండలం మోత్కూరు.
పేరు: ఏలె లక్ష్మణ్‌ ప్రముఖ చిత్రకారుడు. అనేక దేశాలలో పెయింటింగ్‌ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. స్వగ్రామం కదిరేనిగూడెం, మండలం ఆత్మకూర్‌(ఎం).
పేరు: ఉత్తేజ్‌. సినీనటుడు, రైటర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌. అనేక చిత్రాలలో నటించారు. స్వగ్రామం సీతారాంపురం, మండలం గుండాల.
పేరు: జిన్నం అంజయ్య రచయిత. అనేక పుస్తకాలు రాశారు. స్వగ్రామంచిత్తాపురం, మండలం వలిగొండ.
పేరు: పి.రమేష్‌ టీచర్‌. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అవార్డులందుకున్నారు. అనేక సేవాకార్యక్రమాలు చేపడుతుంటారు. స్వగ్రామం పాలడుగు, మండలం మోత్కూరు.
పేరు: కాసోజు శ్రీకాంత్‌చారి. తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరుడు. స్వగ్రామం పొడిచేడు, మండలం మోత్కూరు.
పేరు: కాసోజు వెంకటాచారి శ్రీకాంత్‌తండ్రి అమరవీరుల కుటుంబాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
పేరు: సీహెచ్‌ శ్రవణ్‌కుమార్‌. కవి, బొమ్మలు కూడా గీస్తారు. పలుకవితలు పత్రికల్లో అచ్చయ్యాయి. మోత్కూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు.
పేరు: మేరుగు మల్లేషం. గీతకార్మికుడు. రైటర్‌. అనేక పాటలు రాశారు. ఆయన పాటలు సీడీలు, క్యాసెట్లరూపంలో వచ్చాయి. స్వగ్రామం రహీంఖాన్‌పేట, మండలం ఆత్మకూర్‌(ఎం).
పేరు: కల్వల సుధాకర్‌రావు. విశాంత్ర వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌. స్వగ్రామం మోత్కూరు.
పేరు: మోత్కూరు అనంతాచారి. మోత్కూరు అనంతుడుగా అనేక రచనలు చేశారు. పుస్తకాలుగా అచ్చయ్యాయి. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. స్వగ్రామం కొండగడప, మండలం మోత్కూరు.
పేరు: అభినయ శ్రీనివాస్‌. సినీగేత రచయితగా అనేక పాటలు రాశారు. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ పదికి పైగా వచ్చాయి. స్వగ్రామం మోత్కూరు. పేరు: లింగాల సంజీవరెడ్డి. సంజీవగా శ్వేతనాగు, నాగప్రతిష్ట, ఇలవేల్పు, టెర్రర్‌ తదితర సినిమాలకు దర్శకుడు. దామెర్లరామారావుపై తీసిన డాక్యుమెంటరీ ఈయనకు అనేక అవార్డులను తెచ్చిపెట్టిండి. స్వగ్రామం డి.రేపాక, మోత్కూరు మండలం.
పేరు: కల్వల ప్రభాకర్‌రావు. తెదేపా పోలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. 1985లో రామన్నపేట నుంచి తెదేపా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. స్వగ్రామం మోత్కూరు. ఈయన పరమపదించారు.
పేరు: కె.కృష్ణమూర్తి. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతంలో ఎంతో పేరు మోసిన నాయకుడు. భీంరెడ్డినర్సింరెడ్డి సహచరుడు. స్వగ్రామం. నీర్మాల, మండలం దేవరుప్పల, జిల్లా వరంగల్‌. దివంగతులయ్యారు.
పేరు: ఎండీ రహమాన్‌అలీ. రంగస్థల దర్శకునిగా, నటునిగా,వ్యాఖ్యాతగా పేరొందారు. ఈయన దర్శకత్వంలో అనేక నాటకాలు రాష్ట్ర స్థాయిలో బహుమతులందుకున్నాయి. స్వగ్రామం తిరుమలగిరి.
పేరు: ఎండీ నిసార్‌. వృత్తి కండక్టర్‌. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి. అనేక పాటలు రాశారు. కళాకారునిగా ఇతర దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి వచ్చారు. స్వగ్రామం సుద్దాల, మండలం గుండాల
పేరు: దుడ్డు రాంచంద్రం. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌. ఈయన స్వగ్రామం నీర్నముల, రామన్నపేట మండలం.
పేరు: రవ్వా శ్రీహరి. ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్‌. స్వగ్రామం వెలువర్తి, మండలం వలిగొండ.
పేరు: కూరెళ్ల విఠలాచార్యులు. కవి, విమర్శుకుడు. అనేక పుస్తకాలు అచ్చయ్యాయి. స్వగ్రామం వెల్లంకి, మండలం రామన్నపేట.
పేరు: రచ్చ భారతి. సుద్దాల హన్మంతు కూతురు. ప్రజాగాయని స్వగ్రామం ఆత్మకూర్‌(ఎం).
పేరు: ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఎమ్మెల్సీగా పలు మంత్రి పదవులు చేశారు. రెండుసార్లు రామన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా, తెలంగాణ ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా పని చేశారు. స్వగ్రామం అడ్డగూడూరు, మండలం మోత్కూరు.
పేరు: కొమ్ము పాపయ్య. మాజీ మంత్రి, ఎమ్మెల్యే. స్వగ్రామం బొడ్డుగూడెం, మండలం మోత్కూరు.
పేరు: దూదిపాల చిన్నసత్తిరెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు స్వగ్రామం ఖపురాయపల్లి, మండలం ఆత్మకూర్‌(ఎం).
పేరు: అవుసలి రాములు. తెలంగాణ సాయుధపోరాట యోధుడు. స్వగ్రామం కోటమర్తి, మండలం మోత్కూరు.
పేరు: చాకలి అయిలయ్య, తెలంగాణ సాయుధపోరులో దళనాయకునిగా ఈప్రాంతంలో ఉద్యమాన్ని ఉర్రూత లూగించారు. ఇటివలే చనిపోయారు. స్వగ్రామం పల్లేపహాడ్‌, మండలం గుండాల.
పేరు: గుర్రం యాదగిరిరెడ్డి తెలంగాణ సాయుధపోరాటయోధుడు రామన్నపేట నుంచి 1985నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. స్వగ్రామం సుద్దాల, మండలం గుండాల.
పేరు: ఆకుపత్ని శ్రీరాములు. తెలంగాణ సాయుధపోరాటయోధుడు. సినీనటుడు ఉత్తేజ్‌ తండ్రి స్వగ్రామం సీతారాంపురం, మండలం గుండాల.