ఏడాది ఏప్రిల్ నాటికల్లా 360 టోల్ ప్లాజాలలో ఈ-టోలింగ్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో తెలిపారు. ఇది అమలైతే.. ఇక వాహనాలు టోCల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. వాటికి ముందుండే ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ల ద్వారా టోల్ గేట్ వద్ద కట్టే రుసుము మొత్తం కట్ అవుతుంది. ముందుగా రీచార్జి చేసుకున్న కార్డుల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
ప్రీపెయిడ్ సిస్టమ్ రీఫిల్లింగ్ కోసం ఏయే బ్యాంకులు దీన్ని అమలుచేస్తాయన్నది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం దేశంలో 96వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, రాబోయే మూడు నెలల్లో వీటిని 1.52 లక్షల కిలోమీటర్లకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు.
No comments:
Post a Comment