Saturday, February 20, 2016

బయట వెతుకుతున్నాడు

బయట వెతుకుతున్నాడు
బ్రహ్మ మనిషిని తయారు చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నూరి నూరి నింపాడు.
ఆ తరువాత బ్రహ్మకి భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో..... కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.
"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.
"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు. ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు." అన్నాడు బ్రహ్మ.
"పోనీ ... నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.
"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."
"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.
"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."
అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.
"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం....." అంది.
"భేష్.... మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు. అన్నిటినీ గెలుస్తాడు. కానీ తన లోపలికి వెళ్లలేడు. తనను తాను గెలవలేడు. అక్కడే దాచేద్దాం," అన్నాడు బ్రహ్మ.
అప్పటి నుంచీ బలం తన లోపలే ఉంది. కానీ మనిషి బయట వెతుకుతూనే ఉన్నాడు

Friday, February 19, 2016

మీకు ఎపుడైనా ఒక వాహనం వివరాలు తెలుసుకోవాలంటే ....?




వాహన దారుల ఇక్కట్లకు గుడ్ బై.. టోల్‌గేట్ల వద్ద ఆగక్కర్లేదు!


వాహన దారుల ఇక్కట్లకు గుడ్ బై.. టోల్‌గేట్ల వద్ద ఆగక్కర్లేదు!



ఏడాది ఏప్రిల్ నాటికల్లా 360 టోల్ ప్లాజాలలో ఈ-టోలింగ్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో తెలిపారు. ఇది అమలైతే.. ఇక వాహనాలు టోCల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. వాటికి ముందుండే ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ల ద్వారా టోల్ గేట్ వద్ద కట్టే రుసుము మొత్తం కట్ అవుతుంది. ముందుగా రీచార్జి చేసుకున్న కార్డుల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

ప్రీపెయిడ్ సిస్టమ్ రీఫిల్లింగ్ కోసం ఏయే బ్యాంకులు దీన్ని అమలుచేస్తాయన్నది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం దేశంలో 96వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, రాబోయే మూడు నెలల్లో వీటిని 1.52 లక్షల కిలోమీటర్లకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు.