Showing posts with label Ultimate Stories. Show all posts
Showing posts with label Ultimate Stories. Show all posts

Thursday, November 5, 2015

అది ద్వాపరయుగం. కృష్ణార్జును లుకలిసి వెళుతున్నారు


అది ద్వాపరయుగం.
ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు
మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన
చేయసాగాడు. Click here 
మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ
ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.
తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు.
పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు
అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో. లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం
అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర
నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది.
కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం
మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ
ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ
అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది...దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు. అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేలా సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు
నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు.
ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది.
తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి.
పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని
దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు
తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన
అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో
జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు. నిజానికి అది
దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను
పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

Saturday, September 19, 2015

రాముడు ఎప్పుడు పుట్టాడో సీతాదేవిని హనుమంతుడు ఎప్పుడు కలిశాడో కూడా చెప్పేస్తున్నారు..




రాముడు ఎప్పుడు పుట్టాడో ఘడియలు, విఘడియలతో సహా తమకు తెలుసంటున్నది ఒక పరిశోధన సంస్థ. రామాయణం, మహాభారతం పుక్కిటి పురాణాలు కావని, వాస్తవంగా జరిగినవేనని బల్లగుద్దిమరీ చెప్తున్నది! అంతేకాదు.. అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు ఎప్పుడు కలిశాడో కూడా చెప్పేస్తున్నారు. వీరి లెక్కల ప్రకారం రాముడు క్రీస్తు పూర్వం 5114 సంవత్సరంలో జనవరి 10వ తేదీన మధ్యాహ్నం 12.05 గంటలకు జన్మించాడు.



అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు క్రీస్తుపూర్వం 5076వ సంవత్సరం సెప్టెంబర్ 12న కలిశాడని ఆ సంస్థ లెక్కవేసింది. ఇక మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3139, అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైందని పేర్కొంది. రుగ్వేదం నుంచి.. రోబోటిక్స్‌దాకా అనే పేరుతో ఒక ఎగ్జిబిషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ అనే సంస్థ ఢిల్లీలోని లలిత కళా అకాడెమీలో ఏర్పాటు చేసింది. గురువారం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని సంస్థను కోరామని చెప్పారు.


అమెరికా నుంచి ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేసిన ఒక సాఫ్ట్‌వేర్, పరిశోధన సహాయంతో తాము గ్రహాల గమనాలను అంచనా వేసి ఈ తేదీలను రూపొందించామని సంస్థ డైరెక్టర్ సరోజ్ బాల చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌ను ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణగోపాల్‌తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. మహాభారతం, రామాయణం ఉనికిపై ప్రశ్నలకు ఈ ఎగ్జిబిషన్ శాస్త్రీయ సమాధానాలు ఇస్తుందని కేంద్ర మంత్రి మహేశ్‌శర్మ చెప్పారు.



ఒక ముస్లిం అయి ఉండి కూడా అబ్దుల్ కలాం జాతీయవాదిగా ఉన్నారంటూ గతంలో మహేశ్‌శర్మ చేసిన వ్యాఖ్య వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాకేశ్ తివారీ, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దినేశ్ సింగ్‌లను ఆహ్వానించినప్పటికీ వారు హాజరుకాకపోవడం విశేషం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కూడా ఆహ్వానించామని, అయితే ఆమె స్పందించలేదని సంస్థ డైరెక్టర్ సరోజ్ బాల చెప్పారు. రాముడు జన్మించినప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉందనే విషయం పురాణాల్లో ఉందని, దాని ఆధారంగా తాము సాఫ్ట్‌వేర్‌లో మ్యాపింగ్ చేసినప్పుడు సంవత్సరం, నెల, తేదీ, సమయం తెలిసిపోయాయని తెలిపారు. ఇదే పద్ధతిలో పాండవుల వనవాసం, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టిన రోజులు కూడా కనిపెట్టామని చెప్పారు.

Tuesday, September 15, 2015

ఆ పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.

ఆ పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు.
"నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి అప్పగించారాదూ!” అన్నాడు.
భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే ఉంటాయి” అంటూ వరమిచ్చి చక్కాపోయాడు.
ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు.
ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు రైతు.
కురిసింది. ఆగమనగానే ఆగింది.
తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో గాలిని విసరమన్నాడు. విసిరింది.
విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి.
పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది.
కోతల కాలం వచ్చింది.
రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు. లోపల ధాన్యం లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది.
"హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా, ఋతువులకి తగట్టుగా. అయితే పైరు పాడైపోయిందే! ఏం? ఎందుకు?"
భగవంతుడు నవ్వాడు. "నా ఆధీనంలో గాలి బలంగా వీచేది. అప్పుడు అమ్మను కౌగిలించుకొనే పిల్లల్లా నారు వేళ్ళు భూమిలోకి లోతుగా జోచ్చుకొని గట్టిగా పట్టుకొనేవి. వాన తక్కువైనా నీటికోసం వేళ్లను నాలుగు పక్కలకు పాకించేది. పోరాటం అంటూ ఉంటేనే చెట్లు తమను కాపాడుకోవడం కోసం బలంగా పెరుగుతాయి.
అన్ని వసతులు నువ్వే కల్పించేసరికి పైరు సోమరిదయ్యింది. నవనవలాడుతూ పెరిగిందే తప్ప ఆరోగ్యవంతమైన ధాన్యాన్ని అందించాలని దానికి తెలీదు.
"నాకు నీ గాలి, వాన,ఎండ వద్దు. నువ్వే ఉంచుకో". అంటూ రైతు దేవుడిచ్చిన వాటిని తిరిగిచ్చేశాడు.
జీవితం లో అన్నీ చక్కగా అమరిపోతే, అంతకన్నా విసుగు, శూన్యం వేరే ఉండదు. కష్టాలు మిమ్మల్ని అదిమేసటప్పుడే మీలో చాకచక్యం మరింత పెరుగుతుంది. సావాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి



వండెర్ పుల్ బిజినెస్


వండెర్ పుల్ బిజినెస్


ఒక వూళ్ళో చాలా కోతులుండెవి. ఒక రోజు ఒక బిజినెస్ మాన్ ఆ వూరికొచ్చికోతులను వంద చొప్పున కొంటానని ప్రకటించాడు.
అదివిన్న వూరువాళ్ళు " వీదిలో తిరిగే కోతుల్ని వంద చొప్పునెవడు కొంటాడు ..... ఆయనొక పిచ్చివాడు" అని నమ్మలేదు. కానీ ఒకరిద్దరు దాన్ని తేలికగా తీలుకోలేదు. వస్తే వంద లేకపోతే మనది పోయేదేమీలేదు అని ప్రయత్నించారు. వాళు వంద చొప్పున సంపాదించుకున్నారు.

ఆ వార్త వూరంతా గుప్పుమంది. అంతే అందరూ కోతులెనకపడ్డారు. ఖాలీ లేకుండా కోతుల్ని పట్టి వంద చొప్పున సంపాదించారు. కొన్ని రోజుల తరువాత ఆ బిజినెస్ మాన్ రెండొందలని ప్రకటించాడు. అంతే అటూ ఇటూ పరిగెత్తి మరీ మిగిలిన కోతుల్ని పట్టి అమ్మారు.

వూరిలో కోతులు దాదాపుగా అమ్మేసారు. అప్పుడు ఆ బిజినెస్స్ మాన్ ఐదు వందలని ప్రకటించాడు అంతే వూరి వాళ్ళకి నిద్రాహారాలు మర్చిపోయిమరీ కోతులకోసం గాలించి గాలించి మరీ పట్టుకుని అమ్మేసారు. ఇంకా వూళ్ళో బయట కోతులే లేవు.

ఆ సమయంలో బిజినెస్స్ మాన్ ఒక కోతి వెయ్యి రూపాయలు ఇస్తా అని ప్రకటించాడు. కానీ ప్రకటించిన వెంటనే ఆయన అర్జంటుగా సొంతూరు వెళ్ళవలసిన పనిపడంది. బిజినెస్స్ అంతా ఒక్కడే చూసుకునేవాడు. కనుక ఒక అసిస్టెంట్ నియమించి వూరికెళ్ళాడు.

ఇంకేటి వూరివాళ్ళి మంచి నీళ్ళుకూడా త్రాగ మర్చిపోయారు. అసలు వూళ్ళోకోతులే లేవు. మరి కోతికి వెయ్యి అంటె మంచి ఆఫర్ మిస్స్ అవుతున్నామన్న బెంగ పట్టుకుంది.అది పసిగట్టిన అసిస్టెంట్ వూరివాళ్ళతో " ఇక్కడున్న కోతుల్ని నేను మీకు ఏడు వందల చొప్పున మీకు ఇస్తాను. వూరునుండి వచ్చే మా షావుకారుకి మీరు వెయ్యి చొప్పున అమ్మెయ్యండి. మీకు ఒక కోతికి మూడు వందలు లాభం. " అని లోపాయకారి వుపాయం చెప్పాడు.

ఆవార్త వూరంతా పొక్కింది. ఇంకేముంది మంచి బేరం దొరికింది అని ఆ అస్సిస్టెంట్ దగ్గర క్యూ కట్టారు. డబ్బున్నోళ్ళు కోతి మందల్ని కొనేసారు. పేదవాళ్లు పైనాంసియర్స్ దగ్గర అప్పు చేసి మరీ ఏడువందలిచ్చి మరీ కొన్నారు. అలా ఆ అస్సిస్టెంట్ తన దగ్గరున్న మొత్తం అన్ని కోతుల్నీ అమ్మేసాడు.

ఆ బిజినెస్స్ మాన్ ఎప్పుడొస్తాడో తెలీదు... కొన్ని రోజులకి వాడు వస్తాడన్న నమ్మకమూ పోయొంది. కానీ ఆశ చావక ఏడు వందలిపెట్టికొన్న ఆ కోతుల్ని వదల్లేక వాటిని కాపలా కాయలేక వాటిని మేపలేకా సతమత మౌతూ బ్రతికేస్తున్నారు.ఇదే వ్యాపారమంటే ...దాన్నే మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటున్నాం. ఈ వ్యాపారం ఎంతమందినో అప్పులపాలు చేసి రోడ్డునకీడ్చింది కొద్దిమందిని మాత్రమే కోటీశ్వరుల్ని చెసింది.