Showing posts with label Andhra Pradesh Tourism. Show all posts
Showing posts with label Andhra Pradesh Tourism. Show all posts

Friday, September 11, 2015

Guntur చూడదగు స్థలములు ...


Guntur చూడదగు స్థలములు 
జిల్లా పర్యాటకరంగాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా టూరిజం అధికారులు అమరావతి, సూర్యలంక ప్రాంతాల వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు.
విజ్ఞానం.. వినోదం కలబోత హాయ్‌ల్యాండ్‌ 

హాయ్‌ల్యాండ్‌ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న స్వాగత బొమ్మలు 
విజ్ఞానంతోపాటు వినోదం కూడా అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన బుద్ధిజం థీమ్‌ పార్కు హాయ్‌ల్యాండ్‌. విజయవాడ, గుంటూరు నగరాల నడుమ మంగళగిరి మండలం చినకాకాని గ్రామపరిధిలో సువిశాల 40 ఎకరాల విస్తీర్ణంలో హాయ్‌ల్యాండ్‌ను ఏర్పాటు చేశారు. 2010 మే 9న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య హాయ్‌ల్యాండ్‌ను ప్రారంభించారు. సన్‌ప్లాజా, చైనా, కాంబోడియా, థాయ్‌ల్యాండ్‌, టిబెట్‌, బర్మా, ఇండోనేసియా, జపాన్‌ జోన్లుగా నామకరణం చేశారు. ఆయా దేశాల సంస్కృతి ప్రతిబింబించేలా కట్టడాలను తీర్చిదిద్దారు. స్త్రీ, పురుషులు, పిల్లలకు ప్రత్యేకంగా జలక్రీడలు (వాటర్‌గేమ్స్‌) ఉన్నాయి. వేవ్‌పూల్‌, లేజీరివర్‌, రెయిన్‌ డ్యాన్స్‌ వంటివి సరదా కలిగిస్తాయి. రైల్‌ఛేజ్‌, గోస్ట్‌ హంటర్‌, మ్యాజిక్‌ డ్యాన్సర్‌, బఫింగ్‌కార్స్‌, ఫ్లైయింగ్‌ ఎలిఫెంట్‌, ప్రైవేట్‌షిప్‌, క్రేజీజంప్‌ స్వింగ్‌ ఏరియంట్‌, ఫ్యామిలీ ట్రైన్‌, గోకార్టింగ్‌, వీడియోగేమ్స్‌ వినోదాన్ని పంచుతాయి. అన్ని విభాగాలకు మధ్యలో ఫుడ్‌కోర్టు ఉంది. వివిధ రకాల భారతీయ వంటకాలు ఘుమఘుమలాడతాయి. చైనాబజార్‌ తరహాలో షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి. రిసార్ట్స్‌ విభాగంలో మొత్తం 61 అధునాతన కాటేజీలు పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. హాయ్‌ల్యాండ్‌లో ఆయుర్‌సుఖ్‌ ఆరోగ్యగ్రామాన్ని 2011 ఏప్రిల్‌ 9న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సుభోద్‌ కాంత్‌ సహాయ్‌ ప్రారంభించారు. పంచకోశ, పంచకర్మ, త్రికాయ చికిత్సలతో పాటు, యోగా, ఫిజియోథెరపీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 20 లగ్జరీ కాటేజీలు చికిత్సలు పొందే వారికోసం సిద్ధం చేశారు. 

షాపింగ్‌ మాల్స్‌, ఫుడ్‌ కోర్టు
సందర్శన వేళలు 
హాయ్‌ల్యాండ్‌ బుధవారం నుంచి సోమవారం వరకూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తారు. మంగళవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. పార్కులో వాటర్‌ గేమ్స్‌ సాయంత్రం 6 గంటలకు, మెకానికల్‌ రైడ్స్‌ 7 గంటలకు నిలిపేస్తారు.
టిక్కెట్ల ధరలు 
హాయ్‌ల్యాండ్‌లో ప్రవేశానికి (ఒక్కొక్కరికి) రాయల్‌ఫన్‌ ప్యాకేజీ టిక్కెట్‌ రూ.600, మెగా ఫన్‌ ప్యాకేజీ రూ.400, బేసిక్‌ ప్యాకేజీ రూ.250, లేట్‌ఎంట్రీ రూ.100గా నిర్ణయించారు. ప్యాకేజీలో లేని గేమ్స్‌కు ప్రత్యేకంగా టిక్కెట్లు తీసుకోవాలి.

బఫింగ్‌ కార్స్‌లో ఆటలాడుతున్న చిన్నారులు 
చేరుకునేదిలా.. 
విజయవాడ నగరం నుంచి 47 హెచ్‌ సిటీ సర్వీసు చినకాకాని హాయ్‌ల్యాండ్‌ వరకూ నడుపుతున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే బస్సు చినకాకాని హాయ్‌ల్యాండ్‌ వద్ద ఆగుతుంది. అక్కడి నుంచి కిలోమీటరున్నర దూరంలో హాయ్‌ల్యాండ్‌ పార్కు ఉంటుంది. 


ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉండవల్లి గుహలు 

ఉండవల్లి గుహలు
ఏనాడు ఏ శిల్పీ కన్నాడో ఈ కలనూ.. ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఆ కళనూ.. అంటూ ఓ సినీ గేయరచయిత రాసిన మాటలు ఉండవల్లి గుహాలయాలను చూస్తే నిజమేననిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఓ కొండలో ఏకశిలపై చెక్కి ఉన్నాయి. అజంతా, ఎల్లోరా శిల్పాలను తలదన్నే కళా నైపుణ్యం ఉండవల్లి గుహల్లో నిక్షిప్తమై ఉంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత చారిత్రాత్మకమైన ఈ గుహలు క్రీ.శ. 2, 3 శతాబ్దంలో బౌద్ధమత ప్రచారం జరుగుతున్న రోజుల్లో వీటిని నిర్మించారు. ఆనంద గోత్రికులు పరిపాలన కాలంలో, విష్ణుకుండిన రాజు గోవిందరాజవర్మ బౌద్ధ బిక్షువుల కోసం ఈ గుహలను నిర్మించారని ప్రతీతి. నాలుగు అంతస్తులుగా చెక్కిన గుహల్లో 64 స్తంభాలతో ఖానాలుగా మలిచారు. మొదటి అంతస్తులో 14 గుహలున్నాయి. త్రిమూర్తుల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. రెండో అంతస్తులో అనంతశయన శ్రీమహా విష్ణువు ఆలయముంది. ఇందులో ఐదడుగుల వెడల్పు, 19 అడుగుల పొడవుగల అనంత పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం శయనించినట్లు ఉంటుంది. మూడో అంతస్తులో త్రికూటాలయం ఉంది. వీటిపై శిల్పకళలు చాళుక్యుల కాలం నాటివిగా చెబుతారు. ఉండవల్లి నుంచి మంగళగిరిలోని పానకాల లక్ష్మీనృసింహస్వామి కొండవరకు తొమ్మిది కిలోమీటర్లు సొరంగ మార్గం ఉందని చరిత్ర ద్వారా తెలుస్తోంది.. మునీశ్వరులు, బౌద్ధ భిక్షువులు కృష్ణానదిలో స్నానాలు చేసి ఉండవల్లి గుహల్లో నుంచి ఉన్న సొరంగమార్గం ద్వారా మంగళగిరిలోని కొండపైన పానకాలస్వామిని దర్శించుకునేవారని చరిత్ర స్పష్టం చేస్తోంది. 6, 7 శతాబ్దాల కాలం వరకు ఈ గుహలు రాజపోషణలో ఉన్నాయి. 1529లో (16వ శతాబ్దం) శ్రీకృష్ణ దేవరాయల పాలనలోకి వచ్చాయి. ఈ గుహాలయాలు వివిధ రాజుల కాలంలో అనేక మార్పులకు లోనైనట్లు పురావస్తుశాఖ దస్త్రాల్లో ఉంది. ఈ గుహలకు ఉన్న స్తంభాలపై పూర్ణకుంభం చిత్రించి ఉంటుంది. దీనినే అనంతర కాలంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా గుర్తించినట్లు చెబుతారు. 1959లో గుహాలయాలు పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చాయి.

అనంతపద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం
ఉండవల్లి గుహాలయాలకు గుంటూరు, విజయవాడ నగరాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్లు, విజయవాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గుంటూరు నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి చేరి.. అక్కడి నుంచి రాష్ట్ర రహదారి ద్వారా ఉండవల్లి కూడలికి చేరుకుని.. ఎడమ పక్కకు తిరిగి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉండవల్లి గుహలు దర్శనమిస్తాయి. విజయవాడ నుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రకాశం బ్యారేజీ దాటిన తరువాత ఉండవల్లి కూడలి చేరుకుని కుడి వైపునకు మూడు కిలో మీటర్లులోనికి వెళితే ఉండవల్లి గుహలు ప్రత్యక్షమవుతాయి.
సందర్శన వేళలు 
ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం. వివరాలకు పురావస్తు శాఖాధికారి ఫోన్‌ నంబరు 0866-2422763ను సంప్రదించవచ్చు.

భవానీ ద్వీప సందర్శన ఓ మధురానుభూతి 

భవానీ ఐలాండ్‌
గుంటూరు, కృష్ణా జిల్లాలకు సరిహద్దు ప్రాంతమైన కృష్ణానది పరవళ్ళ మధ్యలో భవానీ ద్వీపం విస్తరించి ఉంది. ఈ ద్వీపాన్ని సందర్శించాలంటే మూడు కిలోమీటర్లు కృష్ణానది నీటిలో మెకనైజ్డ్‌ బోట్ల ద్వారా ప్రయాణించాలి. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో పర్యాటక సంస్థ బోటులను ఏర్పాటు చేసింది. ఐలాండ్‌లో ఏసీ కాటేజీలు నిర్మించారు. 26 కాటేజీల్లో 24 ఏసీ, మిగిలినవి ట్రీకాటేజీ (ఒంటి స్తంభం గది)లు నిర్మించారు. యాత్రికులు బస చేసేందుకు అనువుగా వీటిని నిర్మించారు. ఏసీ కాటేజీ అద్దె రూ.2100, ట్రీ కాటేజీ రూ.1560, చిన్నారుల ఆటపాటల కోసం అడ్వంచర్‌ గేమ్స్‌ సదుపాయముంది. పర్యటకులను ఆకర్షించే విధంగా ఐలాండ్‌లో 40 అడుగుల ఆకర్షణీయమైన ద్వీపస్తంభాన్ని (టవర్‌) నిర్మించారు. దీనిపై జీవకళ ఉట్టిపడే పలురకాల బొమ్మలున్నాయి.బోటు షికారు 
ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన కృష్ణానదిలో పర్యాటక శాఖ బోటు షికారుని ఏర్పాటు చేసింది. ఆహ్లాదకరమైన వాతావరణం గలగలా పారే కృష్ణమ్మ అలలపై బోటు షికారు ఎంతో ఆనందాన్నిస్తుంది. స్పీడుబోటు, బోధిసిరి, ఆమ్రపాలి, కృష్ణవేణి వంటి మెకనైజ్డ్‌ బోట్లు నదిలో విహారానికి ఉపయోగిస్తారు.

ఐలాండ్‌లో 40అడుగుల టవర్‌
ధరలు 
జాలీట్రిప్‌ పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.25 
భవానీ ఐలాండ్‌ సందర్శనకు పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.25 
స్పీడుబోట్‌లో అయిదు నిమిషాలపాటు నదీ విహారానికి రూ.150, ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులకు అవకాశం. 
బోధిసిరి 45 నిమిషాలు నదీవిహారం పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 
ఆమ్రపాలి, కృష్ణవేణి బోట్లలో రెండున్నర గంటలు 25 మంది సభ్యులకు రూ.2వేలు 
బోధిసిరి ఏసీ బోటు 120 మంది సభ్యులకు రూ.8 వేలు ఛార్జి, రెండున్నర గంటలు 
వివరాలకు 08645-272382, 9848629342 సంప్రదించవచ్చు. 
భవానీ ఐలాండ్‌లో వివరాలకోసం 9848779685 
బెరంపార్క్‌ హరిత హోటల్‌ (పున్నమి) వివరాలకోసం 9848779686కు సంప్రదించవచ్చు.

కోటప్పకొండ
 
నరసరావుపేట నియోజకవర్గంలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ. నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొలువుదీరిన శివుడుని దక్షిణామూర్తిగా భావిస్తారు.

నాగార్జునసాగర్‌
 
మాచర్ల నుంచి 25 కి.మీ. దూరంలోని నాగార్జునసాగర్‌కు ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. హైదరాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, భద్రాచలం బస్సులు మాచర్ల నుంచి సాగర్‌ మీదుగా వెళ్తుంటాయి. గుంటూరు నుంచి మాచర్లకు బస్సుకైతే రూ. 70, రైలుకైతే రూ. 20 ఛార్జి చెల్లించాలి. మాచర్ల చేరుకున్న తరువాత ఆర్టీసీ బస్సులో రూ. 15 ఛార్జి చెల్లించి సాగర్‌ చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి 150 కి.మీ దూరంలో నాగార్జునసాగర్‌ ఉంది. బస్సుకు రూ. 110 ఛార్జి. ఎత్తిపోతల, అనుపు, నాగార్జునకొండ మ్యూజియానికి మాచర్ల నుంచి వెళ్లేందుకు ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

చెరుకుపల్లిలో.. 
 
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా జిల్లాలో నేటికీ వినయాశ్రమానికి ఒక ప్రత్యేక స్ధానం ఉంది. స్వాతంత్ర సమపార్జనే ధ్యేయంగా ఆనాడు గాంధీజీ చేస్తున్న ఉద్యమానికి ప్రేరేపితులైన కావూరు గ్రామానికి చెందిన తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు స్వామి సీతారామ్‌ ఆదేశాల మేరకు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అంతేకాక తమకున్న యావదాస్తులను స్వాతంత్ర సమపార్జనకే వెచ్చించాలనే లక్ష్యంతో కావూరులో వినయాశ్రమాన్ని స్ధాపించారు. వీరి దేశభక్తికి మెచ్చి గాంధీజీ గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు 23.12.1933లో ఆశ్రమానికి శంకుస్ధాపన చేశారు. అప్పట్నించి దేశభక్తిని ప్రబోధిస్తూ ఆశ్రమంలో పలు కార్యక్రమాలు చేపట్టి ఆశ్రమాన్ని స్వాతంత్ర సమరయోధుల కార్ఖానాగా తీర్చిదిద్దారు. అంతేకాక కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం ఆశ్రమవాసులు నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. స్వాతంత్రం సిద్ధించిన తరువాత ఆశ్రమాన్ని మరింత ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించేందుకు ఆశ్రమానికి ఉన్న ఆస్తులను కొంత బాలికల గురుకుల పాఠశాలకు, కొంత కృషివిజ్ఞాన్‌ కేంద్రానికి దానం చేశారు. ఎంతో పవిత్రమైన వినయాశ్రమాన్ని అప్పట్నించి ఇప్పటివరకు ఎందరో మహనీయులు సందర్శించారు. భారతదేశ రాష్ట్రపతులు బాబూ రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి వంటి వారే కాక మన రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ వినయాశ్రమాన్ని సందర్శించినవారే. ఆశ్రమ శంకుస్ధాపన సమయంలో ఆనాడు గాంధీ నాటిన చిన్నరావి మొక్క నేడు పెద్ద వృక్షంగా మారి సందర్శకులకు ఆనాటి జ్ఞాపకాలను స్ఫురణకు తెస్తుంది. 
 

గుత్తికొండ బిలం.. దైద అమరలింగేశ్వరుడు..
 
పిడుగురాళ్లకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తికొండ బిలం నియోజకవర్గంలో ప్రధాన పర్యాటక ప్రాంతం. చుట్టూ పర్వతశ్రేణి.. మధ్యలో బిల సముదాయం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ బిల ప్రాంతంలోకి అడుగుపెట్టడంతోనే ఆధ్యాత్మికత పలకరిస్తుంది. ప్రధాన బిలం నుంచి లోపలకు వెళ్తే 101 బిలాలు ఉన్నాయని చెపుతారు. ఇంకా ముందుకెళ్తే గరళం సేవించే శివుడి విగ్రహం ఉందని అంటారు. పల్నాడు యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు ఈ బిలంలోకి వెళ్లినట్లు కథనం ఉంది.గురజాలకు 13 కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానది తీరాన అమరలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. సొరంగ మార్గంలో స్వయంభువుగా వెలసిల్లిన అమరలింగేశ్వరుడు భక్తుల పూజలందుకుంటూ భాసిల్లుతున్నాడు. సొరంగ మార్గంలో 400 మీటర్ల వరకు ప్రయాణం చేసి శివలింగాన్ని సందర్శించుకోవల్సి ఉంటుంది.

దైదబిలం..  
గురజాలకు 13 కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానది తీరాన అమరలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. సొరంగ మార్గంలో స్వయంభువుగా వెలసిల్లిన అమరలింగేశ్వరుడు భక్తుల పూజలందుకుంటూ భాసిల్లుతున్నాడు. ప్రతి సోమవారం భక్తులు ఇక్కడకు వచ్చి శివలింగాన్ని దర్శించి పూజలు చేస్తారు. శివరాత్రికి భారీ ఎత్తున భక్తజనం చేరుకుంటారు. సొరంగ మార్గంలో స్వయంభువుగా వెలియడంతో భక్తులు గతంలో ప్రమిదల వెలుగులో సందర్శించుకునే వారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. సొరంగ మార్గంలో 400 మీటర్ల వరకు ప్రయాణం చేసి శివలింగాన్ని సందర్శించుకోవల్సి ఉంటుంది. ఆలయం సందర్శించడం, శివలింగాన్ని పూజించడం గొప్ప అనుభూతిని నింపుతుంది. 

భట్టిప్రోలు బౌద్ధస్థూపం
 
వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో బౌద్ధస్థూపం ముఖ్యమైన పర్యాటక కేంద్రం. కీ.శ. 1870లో భాసిక్‌ అనే ఈస్టు ఇండియా కంపెనీ అధికారి భట్టిప్రోలులో బౌద్ధస్థూపం ఉన్నట్లు గుర్తించారు. 1892లో అలెగ్జాండరు అనే బ్రిటిష్‌ అధికారి తవ్వకాలు జరిపి సంపూర్ణ స్థూపాకృతిని వెలికితీశారు. జిల్లాలో అమరావతి క్షేత్రం తర్వాత భట్టిప్రోలు బౌద్ధస్థూపానికి పేరుంది. విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. 2009లో రూ.30 లక్షలతో స్థూపం చుట్టూ పూర్వ ఆకారాన్ని తీసుకొచ్చే పనులు చేశారు. గుంటూరు నగరానికి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సూర్యలంక తీరం
సూర్యలంక బీచ్‌: జిల్లా కేంద్రం గుంటూరు నుంచి 56 కిలోమీటర్లు, బాపట్లకు 8 కి.మీ. దూరంలో బంగాళాఖాతం ఒడ్డున సహజ సిద్ధమైన బీచ్‌ ఉంది. పర్యాటకుల వసతి కోసం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అతిథిగృహాలను నడుపుతున్నారు. 
చిలకలూరిపేట నియోజకవర్గంలో చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన కొండవీడుకోట, చెంఘీజ్‌ఖాన్‌పేట, వెన్నముద్దల వేణుగోపాలస్వామి ఆలయం ఉన్నాయి.

గుంటూరు నగరం నుంచి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు బస్సు సౌకర్యం.. వివరాలు
అమరావతి 
విశిష్టత : బౌద్ధుల శిల్పకళ, అమరలింగేశ్వరస్వామి దేవాలయం 
* దూరం : 35కి.మీ 
* ఛార్జి : రూ.21 
* గుంటూరు నుంచి అమరావతి వెళ్లేందుకు ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు కలదు.మంగళగిరి 
విశిష్టత : పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 
* దూరం : 20 కి.మీ. 
* ఛార్జి : రూ.12 
* గుంటూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఓ బస్సు
ఉండవల్లి 
విశిష్టత : కొండలలో బౌద్దుల శిల్పకళ 
* దూరం : 32 కి.మీ. 
* గుంటూరు నుంచి విజయవాడ వెళ్లి, అక్కడ నుంచి వెళ్లాలి.
పొన్నూరు 
విశిష్టత : భావన్నారాయణ స్వామి దేవాలయం 
* దూరం : 30 కి.మీ 
* ఛార్జి : రూ.17 
* గుంటూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు
కోటప్పకొండ 
విశిష్టత : త్రికోటేశ్వరస్వామిదేవాలయం 
* దూరం : 60 కి.మీ. 
* గుంటూరు నుంచి నర్సరావుపేట, చిలకలూరిపేట మీదుగా
కారంపూడి 
విశిష్టత : పల్నాటి వీరుల గుడి 
* దూరం : 87 కి.మీ 
* ఛార్జి : రూ.50 
* గుంటూరు నుంచి నర్సరావుపేట, మాచర్ల మీదుగా కారంపూడి చేరుకోవాలి.
మాచర్ల 
విశిష్టత : చెన్నకేశవస్వామిదేవాలయం 
* దూరం : 127 కి.మీ 
* ఛార్జి : 70 
* గుంటూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు
ఎత్తిపోతల 
విశిష్టత : జలపాత విహారం 
* దూరం : 149 కి.మీ 
* ఎత్తిపోతలకు చేరుకునేందుకు మాచర్ల మీదుగా వెళ్లాలి.
కొండవీడు 
విశిష్టత : రెడ్డిరాజుల చారిత్రక స్థలం 
* దూరం : 25 కి.మీ 
* గుంటూరు నుంచి ఫిరంగిపురం చేరుకొని అక్కడ నుంచి వెళ్ళవలసి ఉంటుంది.
నాగార్జునసాగర్‌ 
విశిష్టత : బౌద్ధుల విద్యాకేంద్రం 
* దూరం : 162 కి.మీ 
* గుంటూరు నుంచి మాచర్ల మీదుగా నాగార్జున సాగర్‌ చేరుకోవలసి ఉంటుంది
చేజర్ల 
విశిష్టత : కపోతేశ్వరాలయం 
* దూరం : 68 కి.మీ 
* ఛార్జి : రూ.32
గుత్తికొండ 
విశిష్టత : గుత్తికొండ బిలం 
* దూరం : 83 కి.మీ 
* గుంటూరు నుంచి నర్సరావుపేటకు చేరుకొని అక్కడ నుంచి వెళ్లవలసి ఉంటుంది.
పెదకాకాని 
విశిష్టత : భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం 
* దూరం : 6 కి.మీ 
* ఛార్జి : గుంటూరు నుంచి ఆర్డినరీ బస్సుకు నాలుగు రూపాయలు 
* ప్రతి ఐదు నిమిషాలకు ఓ బస్సు
చేబ్రోలు 
విశిష్టత : భీమేశ్వర స్వామి దేవాలయం 
* దూరం : 16 కి.మీ 
* ఛార్జి : రూ.11 
* గుంటూరు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు కలదు

EastGodavari చూడదగు స్థలములు


EastGodavari చూడదగు స్థలములు 
పచ్చని ప్రకృతి ఒడి...మారేడుమిలి ్ల









రాజమండ్రికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది మారేడుమిల్లి. జిల్లాలో ఉన్న తూర్పు కనుమల్లోని అత్యంత ఎతై్తన ప్రాంతం. ఎకో టూరిజంలో భాగంగా వనసంరక్షణ సమితి, అటవీశాఖలు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు చేపడుతున్నాయి. అందులో భాగంగా ‘వాల్మీకి వ్యాలి వన విహారస్థలి’ పేరుతో మారేడుమిల్లి మన్యంలో చేపట్టిన ప్రాజెక్టు సందర్శకులను ఎంతో ఆకర్షిస్తోంది.

ఇందుకోసం మారేడుమిల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పర్యాటకస్థలాలుగా తీర్చిదిద్దింది. ఇక్కడకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో జలతరంగిణి జలపాతం ఉంది. ఎతై్తన కొండలమీద జాలువారే జలపాతం ఈ ప్రాంతానికో ప్రత్యేక ఆకర్షణ. ఇది కిందకు జారి సెలయేరులా ప్రవహించే దృశ్యం అపురూపంగా అనిపిస్తుంది. 
ఈ కొండప్రాంతంలోని మరో ఆకర్షణ...16మ కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార, అమృతధార అనే జంట జలపాతం. అక్కడికి వెళ్లేందుకు కిలోమీటర్లు అడవిలో నడవాలి. మారేడుమిల్లికి 10 కిలోమీటర్ల దూరంలోని మదణ్‌కుంజ్‌ పిక్నిక్‌ ప్రదేశంగా ప్రసిద్ధి. అక్కడ పైన్‌ చెట్లు ఆకాశాన్ని తాకుతున్నట్లుగాఉంటాయి.
నందనవనం
ఇక్కడ చూడదగ్గ మరోప్రదేశం పాములేరు. ఇది కూడా మారేడుమిల్లి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ ప్రవహించే పాములేరు వాగు చెంతకు అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. కార్తీకమాసంలో ఈ ప్రాంతం సందర్శకులతో కళకళలాడుతుంటుంది. ఇక్కడే జంగిల్‌స్టార్‌ నేచురల్‌ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. వేటపట్ల ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడి విశేషాలను వివరించేందుకు వనసంరక్షణసమితి సభ్యులు సిద్ధంగా ఉంటారు. ఈక్యాంపులో గడిపేందుకు 20 మందిని ఓబ్యాచ్‌గా చేసి వాళ్లకు గుడారాలు ఇస్తారు. వీటిలో ఓరాత్రి గడపవచ్చు. పర్యాటకుల కోరిక మేరకు క్యాంపు ఫైర్‌ని కూడా ఏర్పాటుచేశారు. తరువాత చూడదగ్గది నందనవనం. ఇక్కడ కాలువలమీద వెదురు వంతెనలు నిర్మించారు. పర్యాటకులు సేదతీరేందుకు వెదురు గుడిసెల్ని నిర్మించి వాటిని వెదురు ఫర్నీచర్‌తో అలంకరించారు. పుష్పాంజలి ఉద్యానవనం, కాఫీ, రబ్బరు,. మిరియాలు, కమలాతోటలు, ఔషధమొక్కలు ఈ ప్రాంతంలోని అదనపు ఆకర్షణలు. బోడికొండల దగ్గర సహససిద్ధంగా పెరిగే వాలిసుగ్రీవనం సైన్సు విద్యార్థులకు ఎంతో బాగుంటుంది. ఇక్కడ సుమారు 125 జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. అందుకే బొటానికల్‌టూర్‌కిఇక్కడకు వస్తుంటారు.
బొంగుచికెన్‌ 
వెదురు చికెన్‌కు ఈ ఏజెన్సీ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. కోడిముక్కలకు మసాలా, పచ్చిమిర్చి మిశ్రమాల్ని పట్టించి, ఒక వైపు తెరిచిన వెదురుబొంగులో ఉంచి అడ్డాకులతో మూతిని మూసి నిప్పులమీద సుమారు గంటసేపు కాల్చుతారు. ఇది రుచిలోనే కాదు,, ఆరోగ్యానికీ మంచిదట. అందుకే ఇక్కడికి వచ్చే చికెన్‌ప్రియులు దీన్ని అస్సలు మిస్‌ కారు. పర్యాటకుల కోసం డీలక్స్‌, బైసన్‌ పొదరిళ్లు, కంటైనర్‌ కాటేజీలు, ఏసీలున్న హిల్‌టాప్‌ ఇళ్లూ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గిరిజనులే గైడ్‌లు. ఆహారపు ఏర్పాట్ల నుంఖ్ద్మీ; అన్ని పనులూ చేసి పెడతారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. దాంతో ఆస్ట్రియా, ఫ్రాన్స్‌, చైనా, అమెరికాల నుంచి పర్యాటకులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఈప్రాజెక్టు కారణంగా గిరిజనులకు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ లబ్ధి చేకూరుతోంది.

కోరంగి అభయారణ్యం 
జిల్లాలోని సముద్ర తీర జీవావరణ వ్యవస్థలో ఈ అభయారణ్యం ఓ ముఖ్యమైన భాగం. తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, యానాం ప్రాంతాల్లో ఉన్న ఈ అభయారణ్యంలో విస్తృతంగా మడ అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నారు.

. పాపికొండలు
అఖండ గోదావరి తూర్పు కనుమలను ఛేదించే ప్రాంతమే పాపికొండలు. దీని పేరు వినని పర్యాటకులుండరు. దట్టమైన అడవులు, గిరిజన సంస్కృతి, గోదావరి అందాలకు నెలవీప్రాంతం. పర్యాటకులకు రాజమండ్రి నుంచి విస్తృత ఏర్పాట్లు ఉన్నాయి.

కడియం
అక్షరాలా ఆరు వేల ఎకరాల వనం. నర్సరీల అందాలతో అలరారుతోంది. ఎన్నో రకాల మొక్కలు, పూలను ఇక్కడే సృష్టిస్తున్నారు. రాజమండ్రికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దిండి రిసార్ట్స్‌
గోదావరి సముద్రంలో సంగమించే సమీపంలో అందాల కోనసీమలో ఈ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేశారు. కేరళకు ఏ మాత్రం తీసిపోని అందాలు ఇక్కడ ఉన్నాయి. రాజోలు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. హౌస్‌బోట్లు అదనపు ఆకర్షణ

ఆదుర్రు బౌద్దకేంద్రం
దక్షిణ భారత దేశంలో పేరెన్నికగన్న బౌద్ధక్షేత్రం.

. రాజమండ్రి, కాకినాడ నగరాలు
ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు నెలవు. అటు గోదావరి, ఇటు సముద్ర తీర అందాలు, నగర జీవితం, పలు పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి.
.
ధవళేశ్వరం బ్యారేజీ
చూసి తీరాల్సిన కట్టడం. లక్షల ఎకరాలకు జీవధార నందించే ఈ బ్యారేజీ ఓ చారిత్రక ఆణిముత్యం. రాజమండ్రికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. 

బాలయోగి ఘాట్‌... స్టేడియం... 
అమలాపురంలో లోక్‌సభ మాజీ స్పీకరు దివంగత జి.ఎం.సి.బాలయోగి స్మృత్యర్ధం ఘాట్‌, స్టేడియంలను ప్రభుత్వం నిర్మించింది. ఈ రెండు కలిపి సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. దీంట్లో ఘాట్‌ను పార్కుగా రూపొందించి అక్కడ బాలయోగి జ్ఞాపకార్ధం ఓ స్థూపం ఏర్పాటుచేశారు. సందర్శకుల కోసం కొన్ని సౌకర్యాలు కల్పించారు. దీనిని ఆనుకునే స్టేడియం ఉంది. దీంట్లో అధునాతనమైన జిమ్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టు, స్కేటింగ్‌ రింగ్‌ ఉన్నాయి. వివిధ క్రీడలకు సంబంధించిన శిక్షణ అక్కడ ఇస్తున్నారు. జిల్లా క్రీడా సంస్థ ఆధ్వర్యంలో ఈ స్టేడియం పనిచేస్తుంది. వేసవిలో వివిధ క్రీడలలో యువతకు శిక్షణ ఇస్తూంటారు. ఇటీవలే ఈ రెండింటిని కేంద్ర మంత్రి మల్లిఖార్జునఖర్గే ప్రారంభించారు.

అన్నంతపూర్ చుడదగు స్థలములు


అన్నంతపూర్ చుడదగు స్థలములు 
పుట్టపర్తి: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం. సత్యసాయి బాబా సమాధిని దర్శించుకోవడానికి విదేశాల నుంఖ్ద్మీ; భక్తులు వస్తుంటారు. అనంతపురం నుంచి ధర్మవరం మీదుగా 64 కి.మీ. దూరంలో పుట్టపర్తి ఉంది.

పుట్టపర్తి ప్రశాంతి నిలయం 

పుట్టపర్తిలో శిల్పారామం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో భక్తులు, పర్యాటకులు సందర్శించేందుకు ప్రభుత్వం రూ.1.50 కోట్ల వ్యయంతో శిల్పారామం నిర్మించింది. చూడముచ్చటగా రంగు రంగుల పూల మొక్కలు, బొమ్మలు, రకరకాల దుకాణాలు ఏర్పాటుచేశారు. సత్యసాయి మహాసమాధి దర్శనార్థం వచ్చే భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఉదయం 10.30 నుంచి రాత్రి 8.30 గంటలవరకు సందర్శించవచ్చు. ప్రవేశరుసుం రూ.10 చెల్లించాలి. విద్యార్థులకు 30 శాతం రాయితీ ఇస్తారు. 

వలస పక్షుల కేంద్రం వీరాపురం 
జిల్లాలోని వీరాపురం వలస పక్షులకు ఆవాసంగా అలరారుతోంది. ముఖ్యంగా సైబీరియా నుంచే వచ్చే పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-7పై ఉన్న కొడికొండ చెక్‌పోస్టు నుంచి 13కి.మీ. దూరంలో వీరాపురం ఉంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు వచ్చే పక్షులను ఈ వూరి ప్రజలు తమ అతిథులుగా చూసుకుంటారు. ఇక్కడకు వచ్చే పక్షిజాతుల్లో పెయింటెడ్‌ స్టార్క్‌ ముఖ్యమైంది. వీరాపురం వాసులు ముద్దుగా ఎర్ర కొంగ అంటారు. అరుదైన పక్షి జాతిగా భావిస్తున్న ఈ పెయింటెడ్‌ స్టార్క్‌లు వందల సంఖ్యలో ఒక చోటుకు రావడం అద్భుతమైన విషయం.రష్యాలోని సైబీరియా లోయ ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 150 రకాల నివసిస్తున్నాయి. వివిధ రంగుల్లో ఎత్తయిన సైబీరియా కొంగలు అంతరించి పోతున్న జాబితాలో చేరాయి. వాటి సంఖ్య నానాటికీ తగ్గుతున్నట్లు అమెరికాలోని విస్కాన్సిలో గల క్రేన్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. సైబీరియాలో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో వందల సైబీరియా పక్షులు వలస బాట పడతాయి. సుమారు శ్రీలంక, థాయ్‌లాండ్‌, ఇండియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు వలస వస్తాయి. అక్కడే ఆర్నెల్ల పాటు ఉండి, సంతానోత్పత్తి చేసుకుని తిరిగి సైబీరియాకు పయనమవుతాయి. 

పెయింటెండ్‌ స్టార్క్‌ 
పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. సికొనిడే జాతికి చెంది పెయింటెడ్‌ స్టార్క్‌ శాస్త్రీయ పేరు ‘మిక్టీరియాలూకోసిఫల’. ఎత్తు 3-3.5అడుగులు, ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు సుమారు 3.5-4కిలోల వరకు ఉంటుంది.
ఎక్కడెక్కడ? 
పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షులు మన దేశానికి శాశ్వత అతిథులు. మనదేశంలో పలు చోట్ల అవి కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ పక్షి కేంద్రం, హార్యానాలోని ఫరీదాబాద్‌ జిల్లా హోదల్‌ పరిసరాల్లో, గుజరాత్‌లోని విద్యానగర్‌ సమీపంలో చెన్నైకు 40కి.మీ.ల దూరంలోని వేదాంతంగల్‌, కర్ణాటకలోకి శ్రీరంగపట్టణం, ముద్దూరు వద్ద, గుంటూరుకు 10కి.మీ.ల దూరంలోని ఉప్పలవాడ వద్ద, సూలూరు పేట సమీపంలో పులికాట్‌ సరస్సు వద్ద ఇవి ఎక్కువుగా కనిపిస్తాయి. 


లేపాక్షి ఆలయం 
రావణుడు సీతాదేవిని అపహరించి లంకా నగరానికి తీసుకెళ్తుండగా, జఠాయువు పక్షి అడ్డగించింది. కోపోద్రుక్తుడైన రావణుడు దాని రెక్కలు నరికివేస్తాడు. సీతాన్వేషియై తిరుగుతున్న రాముడు ఈ ప్రాంతానికి రాగా రెక్కలు తెగి ఉన్న జఠావును చూసి లే.. పక్షి అన్నాడని దాంతో ఈ ప్రాంతం లేపాక్షిగా మారిందని ఇతిహాస గాథ.ప్రపంచ ప్రసిద్ధి చెందిన నంది 
ప్రపంచంలోనే అతి పెద్ద రాతి నంది మరెక్కడా లేదు. 15అడుగుల ఎత్తు, 27అడుగుల పొడవుతో జీవకళ ఉట్టిపడుతూ పైకి లేచివస్తున్నట్లు కనబడే ఈ నంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
మూడు గుడుల ముచ్చట 
లేపాక్షిలో ప్రధాన దేవుడు వీరభద్రుడు. అక్కడే మరో రెండు చిన్న దేవాలయాలున్నాయి. పాప వినాశనేశ్వరస్వామి ఆలయం, రఘునాథాలయం, శివకేశవులకు తేడా లేదని ఒకే చోట శైవ, విష్ణు ఆలయాలు ఎదురెదురుగా ఉండటం లేపాక్షిలోని మరో ప్రత్యేకం.ఆలయం మూడు భాగాలుగా ఉంటుంది ముఖ మండపం(నాట్యమండపం) అర్ధమండపం (గర్భగృహం), కల్యాణమంటపం, మంటపాలన్నీ సుందర శిల్ప శోభితంగా అలరిస్తాయి. 

గర్భగుడిలో 
గర్భగుడిలో వీరభద్రస్వామి, దుర్గాదేవి, శివకేశవులు ప్రధాన దేవుళ్లు. పైకప్పు అంతా చిత్ర కళాసమన్వితంగా ఉంటుంది. 34అడుగుల వీరభద్రుని పెయింటింగ్‌ చిత్రం ఆసియాలోకెల్లా పెద్దది. ఒక వాస్తుపురుషుడు, పద్మినీజాతి స్త్రీ, శిల్పాలను ప్రభుత్వ చిహ్నాలుగా ఎంపిక చేశారు.
అబ్బురపరిచే వేలాడే స్తంభం 
ఆలయంలో ఉన్న వేలాడే స్తంభం నాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి నిదర్శనం. గర్భగుడికి ముందు ఉన్న ఈ స్తంభం వేలాడుతూ ఉంటుంది. భూమిని ఏమాత్రం తాకకుండా గాలిలో ఉంటుంది. దీనిని పక్కకు జరిపించాలని నాటి బ్రిటీషు కాలంలో ఓ ఇంజినీర్‌ ప్రయత్నించగా గుడిలోని శిలలన్నీ కదిలినట్లు కథ ప్రచారంలో ఉంది.
తనే శిక్ష విధించుకున్న విరూపణ్ణ 
1538లో విజయనగర రాజుల ప్రధాన కేంద్రమైన పెనుకొండ. దాని కోశాధికారిగా ఉన్న విరూపణ్ణకు దేవాలయాన్ని నిర్వహించేందుకు నిధులు వెచ్చించాడు. విరూపణ్ణపై కొందరు రాజుకు లేనిపోనివి చెప్పడంతో రెండు కన్నులు పీకేయాలని శిక్ష విధించారు. ఇది తెలుసుకున్న విరూపణ్ణ తన కళ్లు తాను పీకి గోడకు కొట్టినట్లు చరిత్ర చెబుతోంది. నేటికీ ఆ రక్తపు మరకలు ఉండటం విశేషం.
నాట్య మండపం 
70 స్తంభాలతో నిర్మించిన నాట్య మండపంలో ప్రతి స్తంభంలోను శిల్పుల నేర్పరితనం కనిపిస్తోంది. మంటపం మధ్య ఉన్న 12 స్తంభాల మీద నాట్యకత్తెల భంగిమలతో పాటు సంగీత వాయిద్యకారుల శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మూడు కదళ్లతో గుర్రపు దంతాలు, కమ్మీలతో, తలలో జడగల భృంగీశ్వరుని నాట్యాచార్యునిగా చూపారు. ఇదే స్తంభంలో మరో వైపు భిక్షాటన చేస్తున్న శివుడ్ని మలిచారు.
ఉట్టిపడే లేపాక్షి ఆకృతులు 
కళ్యాణమంటపానికి ఒక ఆనుకొని ఉత్తర దిశలో పలు స్తంభాల్లో అద్భుత ఆకృతులు శిల్పులు ఆనాడే చెక్కారు. వాటినే నేడు లేపాక్షి డిజైన్స్‌గా పిలుస్తున్నాం. ఖ్ద్మీ;రలకు వీటిని ఉపయోగిస్తున్నారు.
అద్భుతం... ఆ చిత్ర రాజాలు 
ఆకుల రసాలతో నాట్య మంటపంలోని పైకప్పుపై చిత్రలేఖనం నేటికీ ఎంతో చక్కగా కనపడటం విశేషం. భూకైలాస్‌, మానునీతిచోళుని కథ, భక్తిశిరియాళుని కథ, కిరితార్జునీయం, భక్తమార్కండేయ ఇలా ఎన్నో భక్తి కథలను చిత్రాల రూపంలో దర్శనమిస్తాయి.
ఆకట్టుకొంటున్న సీతాదేవి పాదం 
ఆలయం వెలుపల సీతాదేవి పాదం. అప్పట్లో శిల్పులు వాడిని తట్టలు చూస్తేనే ఎంత భారీ మనుషులో తెలుసుకోవవచ్చు. 

పచ్చని అందాలు... విజయనగర రాజుల కట్టడాలు 
కోట కలిగిన కొండ... కొండ కలిగినకోట.. కోట కొండలలో మేటి పెనుకొండగా పేరుగాంచిది పెనుకొండ. విజయనగర రాజులకాలం నాటికట్టడాలు దీనిపై అనేకం ఉన్నాయి. 
శ్రీకృష్ణదేవరాయలు 15 శతాబ్దంలో హంపి తరువాత పెనుగొండను రెండో రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. వేసవివిడిదిగా ఇక్కడి వస్తుండేవారు. ఇక్కడ ఒక్క చోటే 365 దేవాలయాలు ఉండటం విశేషం. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుకోగా కొన్ని ఆలయాల్లో మాత్రమే ధూప, దీప, నైవేద్యాలు జరుగుతున్నాయి. కొండపై ఉన్న పలుదేవాలయాలు, తటాకాలు, గోపురాలు, బురుజులు, కోనేరులు విజయనగరరాజుల చరిత్రకు అద్దం పడుతున్నాయి.కొండపై ఉన్న విశేషాలు.. 
పెనుకొండ కొండపైకి ఎక్కడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి మెట్లుదారి కాగా, మరొకటి చుట్లదారి ప్రస్తుతం మెట్లదారి ముళ్లకంపలమొక్కలతో మూసుకుపోగా కొండపైకి వెళ్లేవారు చుట్లదారినే వెంబడే వెళ్తున్నారు.
కొండపైన నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని హరిహరరాయలు, బుక్కరాయల పరిపాలన కాలంలో క్రియాశక్తిగా నిర్మించనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గుప్త నిధుల వేటలో ఈ దేవాలయం చాలా వరకు ధ్వంసమైంది. దేవాలయం సమీపంలోని బ్రహ్మతీర్థంగా పిలవబడే కోనేరు నేటికి ఉంది. బ్రహ్మతీర్థం నీటితో కళకళలాడుతూపర్యాటకులను ఆకట్టుకుంటుంది.
కొండపైన ఉన్న ఖిల్లా నాటి వైభవానికి నిదర్శనం. పెనుకొండలోని గగన్‌మహల్‌ నుండి ఖిల్లా వద్దకు సొరంగమార్గం ఉన్నట్లు అనేక మంది చెబుతారు. ఖిల్లాకు ఉత్తర భాగంలో దిగువభాగాన నాగులబావి, అక్కమ్మగార్లగుడి, కోనేరు, నాగదేవతలు గుడి ఉన్నాయి. అదేవిధంగా రాంబురుజు సమీపంలో నుండి కొండపైకి వెళితే లక్ష్మణబురుజు, సీతబురుసుజులతోపాటు కొండపైకి కట్టిన కోటగోడ కనిపిస్తాయి. 
నరసింహస్వామి దేవాలయానికి దక్షిణ భాగంలో బంగారుగుండ్లగా పిలవబడే ప్రాంతంలో కాళికాదేవి దేవాలయం ఉంది. వీటితోపాటు కొండపై మండపాలు, గోపురాలు అనేకం ఉన్నాయి. 
అదేవిధంగా కొండ అవతలి భాగంలోను కొండూరు ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. వీటికితోడు పచార్లకుంట, భైరవానికుంటలు అలరిస్తాయి.

తిమ్మమ్మ మర్రిమాను: 
తిమ్మమ్మ మర్రిమాను అంటేనే తిమ్మమ్మ పేరుతో వెలసిన మర్రిమాను అని అర్థం. దాదాపు 5.2 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి, 1100 వూడలతో పర్యాటకులను ఆకర్షిస్తుందీ వృక్షం. అనంతపురం నుంచి కదిరి మీదుగా 120 కి.మీ. దూరంలో ఉంది. 
క్రీ.శ. 1355లో పతి భక్తి కలిగిన తిమ్మమాంబ నాటిన ఎండిన మర్రి కొమ్మే నేటి ప్రపంచ మర్రిగా గిన్నిస్‌ పుటల్లోకెక్కింది. బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిపించారు. కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు. భర్త మరణంతో తిమ్మమాంబ సతీ సహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి మహా వటవృక్షంగా ఎదిగింది. ఇది 1989లో సత్యనారాయణ అరియర్స్‌ అనే వ్యక్తి మర్రిమాను ప్రపంచ పుటల్లో స్థానం పొందేందుకు కృషిచేశారు. 1355 వూడలతో మర్రిమాను ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది. మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి. 
* మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్‌ నిర్మించారు. ఇటీవల కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్టు ఆధ్వర్యంలో రూ.పది లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయ నిర్మాణం చేపట్టారు. 

గుత్తికోట
 
అనంతపురం జిల్లాలోని గుత్తిదుర్గం చూడ ముచ్చటగా ఉంది. అనంతపురం నుంచి 52కిలో మీటర్లు, గుత్తిరైల్వే స్టేషన్‌నుంచి మూడు కిలోమీటర్లు దూరంలో దుర్గం ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దులో గుత్తిపట్టణం తూర్పు భాగాన కొండలపై దుర్గంను నిర్మించారు. మూడువందల మూడు మీటర్ల ఎత్తున మూడువైపులా కొండలను కలుపుకుని 25హెక్టార్ల విస్తీర్ణంలో శంఖాకృతిలో నిర్మించారు. ఐదుమీటర్ల ఎత్తు, రెండున్నర మీటర్ల వెడల్పుతో పటిష్టంగా రాతికట్టడపు ప్రాకారాలతో లెక్కకుమించిన వృత్తాకారపు కోటబురుజులతో శత్రుదుర్భేద్యంగా దుర్గాన్ని నిర్మించారు. సుమారు 30 కిలో మీటర్ల దూరం నుంచే దుర్గం కనిపిస్తుంది. 18వ శతాబ్దంలో దుర్గం ప్రముఖ పాత్రవహించింది. 11,12 శతాబ్దంలో చాళుక్యులు ఈ కోటగోడను నిర్మించినట్లు తెలుస్తోంది. హరిహరబుక్కరాయలు ఈ కోటను మొదటిగా రాజధానిగా చేసుకున్నట్లు తెలుస్తున్నది. మహామంత్రి తిమ్మరుసు బాల్యం గుత్తిదుర్గంలో గడిపినట్లు భట్టుమూర్తి పద్యాన్ని బట్టితెలుస్తోంది. క్రీస్తుపూర్వంనుంచి క్రీస్తుశకం వరకు అశోకుడు, చూటకూళులు, కంచిపల్లవులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, గంగవరపు రాజులు, చోళరాజులు, పశ్చిమచాళుక్యులు, భల్లాలరాజులు, దేవగరియాదవులు, విజయనగరరాజులు, నల్గొండ నవాబులు, మొగలాయిలు, కడపనవాజ్‌ మజీద్‌ఖాన్‌, దక్కస్‌సుబేదారు, పాలేగాండ్లు, మరాఠాలు , టిప్పుసుల్తాన్‌, నైజాంనవాబులు, ఆంగ్లేయులు దుర్గంను పాలించారు. దుర్గంలో 101 బావులున్నాయి. కోటముఖద్వారం, నగరేశ్వర ఆలయం, యల్లమ్మదేవాలయం, గోపాలస్వామిదేవాలయం, రామాలయం, ఆంగ్లేయుల సమాధులు, సీమప్రజల బంధు సర్‌థామస్‌మన్రో సమాధి, ఏనుగులశాల, సైనికకవాతు ప్రదేశం, రంగమండపం, ఖైదీలను నిర్బంధించే ఖ్ద్మీ;కటిగది, ధాన్యాగారం, బేగం మహాల్‌,ఖిల్లా ఉన్నాయి. దుర్గంలో 15 కోటలున్నాయి. చారిత్రక ఆలయాలు అనేకం ఉన్నాయి. దుర్గంలోకి వెళ్లేందుకు రాతికట్టడపు బాట ఉంది. ఖిల్లానుంచి చూస్తే సుమారు 30 కిలోమీటర్లు దూరం పచ్చని పొలాలు కనిపిస్తాయి. 
కళ్యాణదుర్గం - - ప్రసిద్ధి చెందిన చరిత్రాత్మక కోట ఇక్కడ ఉంది. అనంతపురానికి పశ్చిమ దిశగా 56కి.మీ దూరంలో కళ్యాణదుర్గం ఉంది. 

కొనకొండ్ల- ప్రాఖ్ద్మీ;న జైనతీర్థం జంబూద్వీపచక్రం ఇక్కడ ఉంది. ఇదిగుంతకల్లు రైల్వే స్టేషనుకు 6కి.మీ దూరంలో ఉంది.


Chittor చూడదగు స్థలములు ....


Chittor  చూడదగు  స్థలములు 
                ప్రకృతి ఒడిలో సుందరవనాలు   
దేశ చిత్రపటంలో చిత్తూరు జిల్లాకు పర్యాటక కేంద్రంగా ప్రముఖ స్థానం ఉంది. పుణ్యక్షేత్రాలు.. జలపాతాలు.. చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి.. యాంత్రిక జీవితంలో కాసేపు 
సేదదీరేందుకు ఇక్కడి ప్రకృతి ఆహ్వానం పలుకుతుంది. పచ్చని చెట్లు, ఎతై్తన కొండల నుంచి జాలువారే జలపాతాలు, గలగల పారే సెలయేర్ల మధ్య ఆహ్లాదంగా గడిపేందుకు అనువైన 
ప్రాంతాలెన్నో ఇక్కడ ఉన్నాయి. విస్తారమైన అడవులు ఉన్న జిల్లాలో ఇందుకు అనుగుణంగా అటవీశాఖ ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. అడవుల్లో పర్ణశాలల ఏర్పాటు, 
చెట్లపై నడక, వన్యమృగాల ప్రదర్శనతో చిన్నపిల్లల నుంచి పెద్దలకు వినోదంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతోంది అటవీశాఖ. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎకో టూరిజం ప్రాజెక్టుల వివరాలను తెలుసుకుందాం.. 

జంగిల్‌బుక్‌: 
తిరుపతి పట్టణం సమీపంలోని కపిలతీర్థం వద్ద పర్యాటకులు, పిల్లల కోసం జంగిల్‌బుక్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రకృతి అధ్యయన ఉద్యానవనంలో వివిధ రకాల పక్షుల గురించి తెలిపే కీటకధామం, ఖనిజాల గురించి వివరించే ఖనిజ సామ్రాజ్యం ఉంది. ఇక్కడ బోటింగ్‌ సదుపాయం కూడా ఉంది. పిల్లలు టెలిస్కోప్‌ వీక్షించడానికి అనువైన ఏర్పాట్లు చేశారు.మామండూరు 
తిరుపతికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామండూరు ప్రాంతం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అడవిలో విహరించడానికి, జంతువుల్ని సందర్శించడానికి 10 కిలోమీటర్ల 
పొడవునా ప్రకృతి బాట ఉంది. పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ వసతి గదులు ఉన్నాయి.
కపిలతీర్థం: 
తిరుపతిలో పకృతి ప్రసాదిత జలపాతం
కైలాసనాథకోన: 
పుత్తూరు నగరి మార్గంలో కైలాసనాథకోన జలపాతంఉంది. తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరం.
తలకోన 
దట్టమైన అడవులు.. కళ్లను కట్టి పడేసే ప్రకృతి అందాలు. గిరిశిఖరం నుంచి జాలువారే జలపాతం తలకోన ప్రత్యేకత. చలనచిత్రాల చిత్రీకరణలకు తలకోన అటవీ ప్రాంతం 
అనువైనదిగా పేరొందింది. ఇక్కడ నిత్యం ఏదోఒక సినిమా చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. సందర్శకుల సౌకర్యార్థం అడవిలో చెట్లపై నడిచేందుకుఅనువుగా నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ బోటింగ్‌ సదుపాయంతో పాటు వనమూలికల సందర్శన, నేచర్‌ ట్రయిల్స్‌ నిర్వహిస్తూంటారు. వివిధ ప్రాంతాలను సందర్శించడానికి వీలుగా జంగిల్‌ సఫారి ఏర్పాటు చేశారు.తిరుపతి నుంచి 59 కిలోమీటర్లు, భాకరాపేట నుంచి అయితే 24 కిలోమీటర్ల దూరంలో తలకోన ఉంది. వంద సంవత్సరాల వయస్సు ఉన్న గిల్లతీగ భూమి నుంచి పది అడుగుల ఎత్తు పెరిగి నాలుగు శాఖలుగా విస్తరించి 5 కిలోమీటర్ల పొడవునా ఉంది. తలకోన ప్రాంతానికి ఈ గిల్లతీగ ప్రత్యేకతగా నిలిచింది. తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరం
కైగల్‌ జలపాతం: డుముకురాళ్ల జలపాతం. పలమనేరు నుంచి కుప్పం మార్గంలో ఉంది. తిరుపతి నుంచి 150 కిలోమీటర్ల దూరం.
ఉబ్బలమడుగు: బుచ్చినాయుడుకండ్రిగ నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని ఉబ్బలమడుగు జలపాతం వద్ద నిత్యం పర్యాటకుల సందడి ఉంటుంది. కొండకోనల మధ్య సుందర జలపాతం ఇక్కడి ప్రత్యేకత. దీన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో తమిళనాడు నుంచి పర్యాటకులు వస్తూంటారు. ఇక్కడ సందర్శకుల కోసం అతిధిగృహాలు ఏర్పాటు చేశారు. 

చారిత్రాత్మక కట్టడాలు.. 
చంద్రగిరి: విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో చంద్రగిరి దుర్గం విడిదిగా ఖ్యాతి గడించింది. కోటలో పురావస్తు ప్రదర్శనశాల, బోటింగ్‌, సాయంత్రం వేళల్లో రాష్ట్ర పర్యాటకశాఖ రూపొందించిన అద్భుతరూపవాణి కార్యక్రమం సందర్శన. తిరుపతి నుంచి 16 కిలోమీటర్లు 
కంగుందికోట: కుప్పంలో కంగుంది కోట ఉంది. ఆంజనేయస్వామి విగ్రహం సందర్శనీయం. తిరుపతి నుంచి 210 కిలోమీటర్లు 
హార్సిలీహిల్స్‌: దక్షిణ ­టిగా ఖ్యాతి గడించింది. వేసవి విడది. సముద్రమట్టానికి 1,265 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. తిరుపతి నుంచి 150కిలోమీటర్లు.పర్యాటకులకు రవాణా సదుపాయాలకు.. 
పర్యాటక శాఖ కేంద్రీయ విచారణ కార్యాలయం: తిరుపతి శ్రీనివాసం ఫోన్‌0877 2289126.
శ్రీదేవి కాంప్లెక్సు: ఐఆర్‌ఓ ఫోన్‌ 0877 2289120, 121 
తిరుమలలో పర్యాటకశాఖ కార్యాలయం ఫోన్‌: 08772289128 
ఆర్టీసీ విచారణ: 0877 12666 

కమనీయ దృశ్యం 
ప్రకృతి సుందర దృశ్యాలతో కన్నులకు ఇంపుగా గిరిశిఖరాల నుంచి జాలువారే జలపాతాలతో ఉల్లాసాన్ని కలిగించే ఎతైన కొండల మధ్య వెలసియున్న శ్రీకైలాసనాథకోన ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజల్లుతోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన శ్రీ కైలాసకోన పుత్తూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి- ­త్తుకోట రహదారి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కాకముక కొండల నడుమ 120 అడుగుల ఎత్తు నుంచి జారువారే ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం కొండపై ఉన్న ఏడు బావుల గుండా ప్రవహిస్తూ ఏడాది పొడవునా దుముకుతుండటం ప్రత్యేకత. ఈ జలపాతంలో స్నానం ఆచరించి జలాన్ని తాగితే ఉదరకోశ, చర్మవ్యాధులు నయమవుతాయని నమ్మకం ఉంది. 

మహిమగల కొలను 
బుటకపల మండలంలోని దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లె గుట్టలో మహిమగల కొలను ఉంది. నీళ్లగుండు కింద ఉన్న ఈ కొలను పూర్తిగా బండపైతగ్గుప్రదేశంలో ఒక బిందె మాత్రమే నీళ్లు ఉరుతుంటాయి. వీటిని బిందెలోకి తోడితే తిరిగి ­రుతాయి. ఈ విధంగా ఎన్ని నీళ్లైన ­రుతాయి. కరవు రోజుల్లో కూడా ఇక్కడ నీరు ­రడం విశేషం. పూర్వం ఇక్కడ అభయాంజనేయస్వామి ఆలయం ఉండేదని చెపుతారు. 

చారిత్రక స్కందపుష్కరిణి 
కార్వేటినగరం సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన ఈ స్కంధపుష్కరిణిని క్రీ.శ 1857-85లో శ్రీవెంకటపెరుమాళ్‌ దేవమహారాజు నిర్మించారు. 14.54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పుష్కరిణి మెట్లపై నీరు ఏవైపు చూసినా సమానంగా ఉండటం విశేషం. మెట్లపై మలచిన దేవతామూర్తులు, సర్పాలు, విచిత్ర జంతువులు, చేపలు, తాబేళ్ల చిత్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 

లక్ష్మీమహల్‌ 
కార్వేటినగరం సంస్థానాధీశులు నిర్మించిన లక్ష్మీమహల్‌ చంద్రగిరి కోటను పోలీ ఉంటుంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరింది. క్రీ.శ. 1857-1885 లో వెంకటపెరుమాళ్‌ దేవమహారాజులు దీన్ని నిర్మించారు. చంద్రగిరి కోటను పోలి ఉన్న ఈ భవనం అలనాటి వాస్తు శిల్పకళలకు దర్పణం పడుతుంది. భవన నిర్మాణ పైకప్పునకు బర్మాటేకు దుంగలు వాడారు. కోట్ల విలువ చేసే చందనం, బర్మాటేకులు ఇప్పటికీ ఉన్నాయి. 

హార్సిలీహిల్స్‌ అందాలు హాయ్‌.. హాయ్‌! 
 
రాష్ట్రంలో అత్యంత ఎతై్తన పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌. సముద్రమట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్నఈ ప్రదేశం బి.కొత్తకోట మండలంలో ఉంది. పురాతన కాలం నుంచి ఏనుగు మల్లమ్మకొండగా పిలువబడే ఈ కొండకు 1848లో మొదటిసారిగా అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వంలో కడప కలెక్టర్‌గా పనిచేసిన సర్‌ హార్సిలీ గుర్రంపై చేరుకున్నారు. ఇక్కడి చల్లటి వాతావరణానికి ముగ్ధుడైన ఆయన వేసవి విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఈకొండ హార్సిలీహిల్స్‌గా పేరెన్నికగన్నది. 1859లో ఆయన నాటిన నీలగిరి మొక్క మహావృక్షంగా ఎదిగి ప్రస్తుతం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 7 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల ఎత్తు పెరిగిన ఈ వృక్షానికి భారత ప్రభుత్వం 1995లో మహావృక్ష పురస్కారాన్ని ఇచ్చింది. 1964లో హార్సిలీహిల్స్‌ను రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గవర్నర్‌ వేసవి విడిదికి ఇక్కడ గవర్నర్‌ బంగ్లా నిర్మించారు. అప్పటి నుంచి వేసవి విడిది కేంద్రంగా ఉన్న హిల్స్‌ గత 15 ఏళ్లుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘణనీయమైన అభివృద్ధి సాధించింది. ఇక్కడ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో కూడిన 50 అతిథిగృహాలు, సమావేశ మందిరం నిర్మించారు. రెస్టారెంట్‌ కూడా ఉంది. స్విమ్మింగ్‌పూల్‌, మసాజ్‌ సెంటర్‌, పిల్లల ఉద్యానవనం ఉన్నాయి. ఇంకా ప్రకృతి అందాలతోపాటు అడ్వెంచర్‌ టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్‌వాకింగ్‌, జార్బింగ్‌, ట్రెక్కింగ్‌, రాక్‌క్లైంబింగ్‌ తదితర ఏర్పాట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో వేసవి విడిది కేంద్రంగా ఉన్న హార్సిలీహిల్స్‌ నేడు నిత్యపర్యాటక కేంద్రంగా అభివృద్ధి సాధించింది. దీంతో పర్యాటక శాఖకు నెలసరి రూ.25 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. వేసవిలో రూ.35 నుంచి రూ.40 లక్షల దాకా ఉంటుంది. హిల్స్‌లో ఆటవీశాఖ ఆధ్వర్యంలో మినీ జూపార్క్‌, ప్రకృతి అధ్యయన కేంద్రం, మొసళ్లపార్కు, పిల్లల ఉద్యానవనం పర్యాటకులను ముగ్ధులను చేస్తున్నాయి. అటవీ, పోలీస్‌, రెవెన్యూ, రైల్వే శాఖల అతిథి గృహాలు ఉన్నాయి. ఇక్కడికి రావాలనుకునే పర్యాటకులు ఆన్‌లైన్‌ ద్వారా టూరిజం అతిథి గృహాలు రిజర్వు చేసుకునే అవకాశం ఉంది. ఫోన్‌ నెంబర్లు9440272241, 08571-279323 లలో సంప్రదించి పూర్తి వివరాలను పొందవచ్చు 

శేషాచలంలో జలపాతాల అందాలు
 
శేషాచలం అడవులు అరుదైన జంతు, వృక్షజాతులకు నిలయమే కాదు, అందమైన ప్రకృతి సౌందర్యానికి, పరవశింపజేసే జలపాతాలకు నిలయం. కనుతిప్పుకోలేని అందాలతో అలరారుతూ భక్తిభావం పెంపొందిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఎతై్తన పర్వతాల నుంచి దూకే జలపాతాలు ఇందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇందులో గుంజన, తుంబుర, రామకృష్ణ, కలివిలేటికోన, స్వామికోన, మూడేళ్లకురవ, విష్ణుగుండం, తలకోన, ఎర్రారెడ్డి గుండం, గోల్లదేవుని గుండం, సీతమ్మసెల వంటి జలపాతాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చే దేవతలు, గంధర్వులు ఈ జలపాతాల్లోనే ముందుగా స్నానమాచరించి వచ్చేవారని, ముక్తికోసం, దైవ సాక్షాత్కారం కోసం మునులు, రుషులు తపస్సు చేసే పవిత్ర జలపాతాలుగా పురాణ ప్రాశస్థ్యాన్ని కలిగివున్నాయి. 

మనసుకు ఉల్లాసం...మామండూరు 
* ప్రకృతి ప్రియుల కేంద్రం
నిత్యం నగర జీవనంలో యంత్రాల మాదిరి పరిగెత్తి... మనశ్శాంతి లేని జీవనం సాగిస్తు వారంతపు చివర్లో కుటుంబంతో సహా ఎక్కడైన వెళ్లాలని అనుకునే వారికి మామండూరు ఒక వరం. రేణిగుంట-కోడూరు మార్గంలో జిల్లా సరిహద్దు ప్రాంతం ఈ గ్రామం. ప్రకృతి ప్రియులైన ఆంగ్లేయులు 1920లో ఇక్కడ ఈ ప్రాంతాన్ని గుర్తించారు. అప్పటి బ్రిటిష్‌ ఉద్యోగి కెనత్‌ ఆండర్సన్‌ రైల్వే స్టేషన్‌కు సమారు 0.5 కిలోమీటర్‌ దూరంలో ఒక అందమైన గుట్టను చూశారు. దీనిపై ఆయన ఈ అందమైనభవంతిని నిర్మించారు. అప్పట్నించి అది అంగ్లేయులు అందమైన విహార కేంద్రంగా పేరుగాంచింది. మామండూరు గ్రామం అటవీప్రాంతంలో ఉండడంతో ఇక్కడ గాలి, వాతావరణం అన్ని స్వచ్ఛంగా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని ఇటీవలే ఎకో టూరిజం కింద చేర్చి ఇక్కడ అనేక అభివృద్ధి పనులు చేశారు అటవిశాఖ అధికారులు. పర్యాటకుల బస కోసం ఇక్కడ పలు గుడిసెలు నిర్మించారు. ఇవి మనకు అటవీ సంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా ఉంటాయి. ఈ బంగ్లా సమీపంలో చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బంగ్లానే కాకుండా ఇక్కడికి సమీప ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి ఇటివలే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి 
చూడదగ్గ ప్రదేశాలు 
మామండూరు అటవి ప్రాంతంలో బంగ్లానే కాకుండా పలు అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో బ్రహ్మదేవుని గుండం, కల్లెటి కోన, తూంబురతీర్థం, పెద్దయేరు వంక, బావికాడలైను ఈ ప్రాంతాలు ఈ వేసవిలో బాగుంటాయి. ఇవి జలపాతాలు కావడంతో ఈ ప్రాంతం చల్లగా ఆహ్లదంగా ఉంటుంది. దీనితో పాటు చాకిరేవుబాణ, రింగురోడ్డు, బండ్లవిరుసు, అవ్వతాతగుట్టలు, స్వామిపాదాలు ఈ ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి. 
మార్గాలు 
తిరుపతి నుంచి కోడురూ, కడప బస్సులు ఇక్కడ మామండూరులో నిలుస్తాయి. ఇంటర్‌సీటి ప్యాసింజర్‌ రైళు ఇక్కడ రైల్వేస్టేషన్‌లో ఆగుతుంది. ఇక్కడ్నించి కాళినడకన ఈ బంగ్లాను చేరుకోవచ్చు. 
ఎకో టూరిజంలో భాగంగా ఇక్కడ హరిణి అనే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన శాఖహార భోజనం ఇక్కడ మనకు మంచి రుచిలో లభ్యమౌతుంది.