Monday, July 18, 2016

శాసన మండలి మరియు శాసన సభ లో హరితహారం

శాసన మండలి మరియు శాసన సభ లో హరితహారం కార్యక్రమంలో పాల్గున్న స్పీకర్, డెప్యూటీ స్పీకర్ మరియు చైర్మన్ మరియు డెప్యూటీ చైర్మన్ 








చెరుకుపల్లి గ్రామం, నల్గొండ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన డెప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ గారు

చెరుకుపల్లి గ్రామం నల్గొండ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన
డెప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ గారు తన స్వంత గ్రామం లో హరితహారాన్ని ప్రారంభించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు 


Monday, July 4, 2016

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి.



నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట (యాదాద్రి) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. 
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు పనుల్లో వేగం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం స్వామి దర్శనం చేసుకునేందుకు వీలుగా నిర్మించిన బాలాలయ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. కేవలం క్యూలైన్ల నిర్మాణాలు జరిగితే భక్తులు వరుసలో వెళ్ళి స్వామివారిని దర్శించుకునేందుకు మరింత వసతి చేకూరుతుంది. 
గుట్టపై చేపట్టనున్న నిర్మాణాల కోసం ప్రస్తుతం ఉన్న పాత నిర్మాణాలన్నింటినీ కూల్చివేసే పనులకు శ్రీకారం చుట్టారు. 
ఈ ప్రక్రియ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎక్కడ ఏ నిర్మాణాలు జరపవలసి ఉందో ఆయా నిర్మాణాలను ఆరంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 
ప్రహరీ గోడ నిర్మించేందుకు వీలుగా పునాదుల తవ్వకం ఆరంభ మైందని తెలిపారు. కాగా, ప్రస్తుతం కొండపైన 108 దుకాణాలు ఉండగా, వీటి స్థానంలో తాత్కాలిక ఏర్పాట్ల తో దుకాణదారులు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 
అయితే శాశ్వతంగా దుకాణాలు వరుస క్రమంలో నిర్మిస్తారా లేక తిరుమల తిరుపతి తరహాలో దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తారా అన్న విషయంలో ఇంకా ఒక నిర్ధారణకు రాలేదని తెలుస్తుంది.
శిల్పనిర్మాణాల కోసం గతంలో హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసిన ‘తధాగతుని’ విగ్రహాన్ని తొలిచిన రాయ గిరి కొండనుంచే కావలసిన రాయిని సేకరించేందుకు నిర్ణయించి ఈ మేరకు పనులను త్వరలో ఆరంభించనున్నారు. 
ఇక ప్రధాన ఆలయమైన గుట్టకు చుట్టూ ఉన్న గుట్టలపై దశావతార మూర్తులను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయం తీసుకున్న మేరకు పెద్ద గుట్ట కొండపై పనులు ఆరంభించినట్లు చెప్పారు. 
దీంతోపాటు గుట్ట చుట్టూరా వలయ రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మేరకు ఆ పనులను కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే నిర్మాణ పనులకు కూలీల కొరత అధికంగా ఉండడంతో పనులు అనుకున్న మేరకంటే కొంత ఆలస్యమవుతున్నాయంటున్నారు. ఇక రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ఏర్పాటు చేయనున్న నాలుగు వరుసల రహదారి పనులు కొంత నత్తనడకన నడుస్తున్నాయని చెబుతున్నారరు. 
ఇప్పటికే స్థల సేకరణ పూర్తి కాగా, రోడ్డు నిర్మాణం పూర్తి అయితే గానీ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టే అవకాశం లేదంటున్నారు. 
ఇప్పటికే విస్తరణ కోసం పలు దఫాలుగా ఇళ్ళను కోల్పోతున్న బాధిత ప్రజలతో సమా వేశాలు నిర్వహించామని, ఇంకా పరిహారం తదితర విషయాలు ఒక కొలిక్కి రాలేదని చెబుతున్నారు. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని, నిర్మాణ పనులు ఊపందు కుంటే దేవుడిని దర్శించుకోవడంతో పాటు ఈ నిర్మా ణాలను వీక్షించేందుకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటు న్నారు. 
నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యా లయం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి తిరుపతి వెళ్ళే భక్తులకు ఇక్కడి నుంచే పలు సేవల టిక్కెట్లు అందిస్తున్నారు. 
అదే మాదిరిగా యాదాద్రికి వెళ్ళే భక్తులకు బస, దర్శనం తదితర అవసరాలు తీర్చేందుకు గాను వైటిడిఎ బర్కత్‌పురలో ఒక కార్యా లయ నిర్మా ణాన్ని చేపట్టగా ఆ భవన నిర్మాణ పనులు కూడా వేగవం తంగా జరుగుతున్నాయని, త్వరలో మొత్తం యాదాద్రికి చెందిన ప్రతి పనిని ఇక వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు పనుల్లో వేగం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.